Others

ఆ కోరిక తీరలేదా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకవైపు నయనతార హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలతో దూసుకుపోతున్న ఈ సమయంలో త్రిష కూడా అలా లేడీ ఓరియంటెడ్ చిత్రాలను చేయాలనే పట్టుదలతో ఉంది. అయితే ఇప్పటికే ఈమె చేసిన రెండుమూడు లేడీ ఓరియంటెడ్ చిత్రాలు బాక్సాఫీస్‌వద్ద బొక్కబోర్లాపడ్డాయి. ముఖ్యంగా భారీ అంచనాల నడుమ విడుదలై ‘నాయకి’చిత్రం తీవ్రంగా నిరాశ పర్చింది. తమిళంతోపాటు తెలుగులో కూడా ఆ చిత్రం విడుదలై ఫ్లాప్ అయ్యింది. ఆ చిత్రం మాత్రమేకాకుండా తమిళంలో ఈమె లేడీ ఓరియంటెడ్ చిత్రాలు చేసేందుకు ప్రయత్నాలు చేసినా అవి వర్కౌట్‌కాలేదు.
తాజాగా లైకా ప్రొడక్షన్స్‌లో శరవణన్ దర్శకత్వంలో రూపొందబోతున్న హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో త్రిష హీరోయిన్‌గా నటించబోతుంది. తెలుగులో సూపర్‌హిట్ అయిన ‘జర్నీ’చిత్రాన్ని శరవణన్ తెరకెక్కించాడు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరున్న శరవణన్ తప్పకుండా తనకు సక్సెస్ ఇస్తాడనే నమ్మకంతో త్రిష ఉంది.