AADIVAVRAM - Others

క్రికెట్( సండేగీత)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రికెట్ ఆటని ఇష్టపడేవాళ్లు ఎందరో...
విమర్శించేవారు ఎందరో...
ఎవరికి కారణాలు వాళ్లకి వున్నాయి. ఆ వాదనలోకి నేను వెళ్లదల్చుకోలేదు. కానీ ప్రతి ఆటను చూసి ఒకటి నేర్చుకోవాల్సి ఉంటుంది. అది ఆటే కావొచ్చు. మరేదైనా కావొచ్చు. మనం దాన్ని చూసి నేర్చుకోవచ్చు.
క్రికెట్ ఆటలో గట్టిగా దబాయించి కొడితే తప్ప సిక్స్ రాదు. అలా చేయడంలో ఓ రిస్క్ ఉంది. అవుటయ్యే ప్రమాదం ఉంది. అయినా చాలామంది ఆ రిస్క్‌ని తీసుకుంటూ వుంటారు.
సిక్స్ కొట్టాలంటే చాలా బలం ఉండాలి.
తమకు వున్న బలాన్ని మొత్తంగా భుజాల్లోకి తీసుకొని సిక్స్ కొట్టాల్సి ఉంటుంది. ఆటగాడికి వున్న బలాన్ని మొత్తం భుజాల్లోకి తీసుకుంటే తప్ప సిక్స్‌ని కొట్టలేం.
దాదాపు ఇట్లాంటి సన్నివేశమే ప్రతి ఆటలోనూ కన్పిస్తుంది. ఇట్లాంటి సన్నివేశాన్ని జీవితానికి అన్వయించుకోవాలి.
మన జీవితంలో కూడా సిక్స్ లాంటి బంతిని కొట్టాలంటే మనకున్న బలాన్ని మొత్తం వినియోగించాల్సి ఉంటుంది.
మన లక్ష్యం మీద మన బలాన్ని శక్తియుక్తులని ఉపయోగించి ప్రయత్నం చేయాలి. అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు విజయం లభిస్తుంది.
అట్లాంటి ప్రయత్నం చేసినప్పుడు ఓడిపోవడం వుండదు. ఆటలో మాదిరిగా.
ప్రతి ఆటలోనూ మనం నేర్చుకోవాల్సింది ఒకటి వుంటుంది. త్యజించాల్సినవి ఎన్నో వుంటాయి.
వ్యక్తులకి కూడా ఈ విషయం వర్తిస్తుంది.

మంగారి రాజేందర్ ‘జింబో’ 94404 83001