Others

ఆమే.. ఓ ఫ్లేవర్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు, తమిళ ప్రేక్షకులకు హీరోయిన్ రెజీనా కసాండ్రా సుపరిచితమే. తెలుగులో చాలా సినిమాలే చేసినా, ఆశించిన స్థాయి సక్సెస్ అందలేదు. తెలుగులో సినిమాలు తగ్గడంతో తమిళంపై ఫోకస్ చేస్తున్న చెన్నై బ్యూటీ, రీసెంట్‌గా సోనమ్‌కపూర్ సినిమా ‘ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా’తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. లెస్బియన్ లవ్ కథాంశంతో తెరకెక్కిన బోల్డ్ సినిమాలో సోనమ్‌కపూర్ లవర్‌గా రెజీనా కనిపించింది. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో రెజీనాతో రొమాన్స్ చేయడంపై సోనమ్ షాకిచ్చే కామెంట్లు చేసింది. ‘రెజీనా కూల్ గాళ్, మంచి నటి. వీటన్నిటికి మించి రెజీనా దగ్గర ఎప్పుడూ ఓ పరిమళం ఉంటుంది. అందుకే రెజీనాతో రొమాన్స్ బాగుంటుంది. నేను హ్యాపీ’ అని చెప్పుకొచ్చింది. ఎంత మరీ అమ్మాయి అయితే మాత్రం ఇలా డైరెక్టుగా చెప్తే ఎలా అంటూ అందరూ షాక్ అవుతున్నారు. సోనమ్ అంతటితో ఆగకుండా ‘సినిమాలో లీడ్ యాక్టర్‌ను మేము ప్రేమించాల్సి వస్తుంది. నిజానికి మేము వారిని ప్రేమించం. సో, అంతా నటనే’ అంటూ రొమాన్స్ విషయాన్ని కవర్ చేసింది.