Others

మిస్సమ్మ (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1955లో విడుదలైన ‘మిస్సమ్మ’ చిత్రంలో కథానాయికగా భానుమతిని ఎంచుకొన్నారు. కాని కారణాంతరాల వలన ఆమెకు బదులుగా సావిత్రిని తీసుకోవాల్సి వచ్చిందట. విజయా నాగిరెడ్డి, చక్రపాణి ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ సాంఘిక చిత్రం బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుంది.
హిందూ యువకుడు, క్రైస్తవ అమ్మాయి ఉద్యోగాల కోసం దంపతులుగా నటించిన చిత్రం -మిస్సమ్మ. అప్పట్లోనే ఎంత చక్కటి ఇతివృత్తమో చూడండి. ఇందులో వీళ్లను టీచర్ ఉద్యోగులుగా తీసుకొన్న జమీందారుగా యస్‌వి రంగారావు అద్భుతంగా నటించారు. పదహారేళ్ల క్రితం తప్పిపోయిన ఆ జమీందారు అమ్మాయే ఇప్పుడు స్కూలులో క్రిస్టియన్ అమ్మాయని తెలుసుకొనడంతో కథ సుఖాంతం అవుతుంది. కథానాయకుడు యన్‌టిఆర్ ఇందులో యంటిఆర్ అనే పేరుతో వ్యవహరించబడటం ఒక విశేషం. మేరి (సావిత్రి)కి అప్పు ఇచ్చి ఆమెను సతాయించాలనుకొన్న డేవిడ్‌గా రమణారెడ్డి బాగా నటించారు. యన్‌టిఆర్, ఏఎన్నార్‌లు ఇద్దరు హేమాహేమలుగా నటించిన చిత్రమిది. ఇందులో కథానాయకుడు రామారావే. డిటెక్టివ్ రాజుగా నాగేశ్వరరావు ఒక రకమైన హాస్య పాత్రల్ని కూడా పండించగలనని ఈ చిత్రంతో నిరూపించుకున్నారు. జమీందారు భార్యగా రుష్యేంద్రమణి, చాలాపట్టుగా జమున తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. తమిళ చిత్రంలో యన్‌టిఆర్ పాత్రను జెమినీ గణేశన్, నాగేశ్వరరావు పాత్రను తంగవేలు పోషించారు. రమణారెడ్డి పాత్ర నంబియార్ ధరించారు. అదే విధంగా రేలంగి పాత్రను సారంగపాణి పోషించారు. సినిమాటోగ్రఫీని ప్రసిద్ధ దర్శకుడు మార్కస్ బార్‌ట్లే నిర్వహించగా, మరో సుప్రసిద్ధుడైన సాలూరి రాజేశ్వరరావు సంగీత దర్శకత్వం నిర్వహించారు. పి సుశీల, ఏయం రాజా, పి లీల నేపథ్య సంగీతం నిర్వహించారు.
‘అవునంటే కాదనిలే’, ‘తెలుసుకొనవె యువతీ’, ‘కరుణించు మేరి మాత’, ‘ఏమిటో ఈ మాయా’, ‘బృందావనమది అందరిది’, ‘రావోయి చందమామా’ పాటలు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఏ ప్రమాణాల ప్రకారంచూసినా ‘మిస్సమ్మ’ నిజంగా అన్నిరకాల ప్రేక్షకులను అలరించిన చిత్రమేనని చెప్పాలి. ఈ సినిమా నాకు చాలా చాలా ఇష్టం. తెలుగు దర్శకులు క్లాసిక్స్‌ను ఎంత అద్భుతంగా తీయగలరో నిరూపించే చిత్రమిది.

-కె సుబ్రహ్మణ్యం