Others

బరువైన భగవద్గీత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచంలోనే అత్యంత బరువైన భగవద్గీత ఎక్కడుందో తెలుసా? ఈ భగవద్గీత బరువెంతో తెలుసా? 800ల కేజీలు. నిజమండీ.. ఈ భగవద్గీత గ్రంథం బరువు 800 కేజీలు. దీనిలో 670 పేజీలు ఉన్నాయి. దీన్ని తయారుచేయడానికి రూ. 1.5 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఈ భగవద్గీతను ఇటరీలోని మిలాన్ నగరంలో ముద్రించారు. దీన్ని మామూలు పుస్తకంలా పైకి లేపడం అసాధ్యం. దీన్ని కదపాలన్నా, పైకి ఎత్తాలన్నా హైడ్రాలిక్ యంత్రం కావాల్సిందే.. గీతా పంపిణీ మిషన్‌కు యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ భారీ గ్రంథాన్ని ముద్రించి.., సముద్ర మార్గం గుండా భారతదేశానికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ భగవద్గీత దిల్లీలోని ఇస్కాన్ ఆలయంలో ఉంది. ఈ గీతను చాలా దృఢంగా, నీటిలో తడిసినా ఏమీ కాకుండా తయారుచేశారు. దీనికోసం ఇటాలియన్ యూపస్ సింథటిక్ పేపరును వాడారు. మొట్టమొదటిసారి 2018, నవంబర్ 11న ఇటలీలో దీన్ని ప్రదర్శించారు. ఇప్పుడు దీనిని దిల్లీలోని ఇస్కాన్ ఆలయానికి తీసుకువచ్చారు. దీన్ని చూడాలనుకుంటే దిల్లీకి వెళ్లాల్సిందే..