AADIVAVRAM - Others

సరస సాహిత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాహిత్యం
సరసమైన, సరళమైన సత్యం
అనునిత్యం ఫాఠక లోకాన్ని
అలరించి చేస్తున్న నృత్యం
ప్రాచీనమైనా, ప్రస్తుతమైనా
సత్యం సత్యమే
కవి సర్వ స్వతంత్రుడు
సమాజాన్ని చూసి భయపడడు
తాననుకొన్నది సహజంగానే
చిత్రీకరించి ఏదో ఓ పత్రికలో
చిత్రిక పడుతూనే ఉంటాడు
గరళమైనా, అమృతమైనా
ఆలోచనలతో ఉక్కిరిబిక్కిరి
అవుతుంది ప్రజానీకం
వాస్తవాన్ని గ్రహిస్తే
వసంతంలా ఉంటుంది
స్వార్థంతో ఆగ్రహిస్తే
గ్రీష్మంలా ఉంటుంది
అర్థంపర్థం లేని వ్యర్థ పదాల్ని
ప్రయోగిచి ఆయాసపడేకంటే
అర్థవంతమైన పద లాలిత్యంతో
పాయసాన్ని పంచి సహపంక్తి
భోజనం చేయిస్తే అంతా భోజనప్రియులే

-షణ్ముఖశ్రీ.. 8897853339