AADIVAVRAM - Others

వ్యంగాస్తమ్రే కార్టూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెయ్యిమాటలు చెప్పలేని భావాన్ని ఓ దృశ్యం ఆవిష్కరిస్తుంది. అలాగే.. సమాజంలోని
రాజకీయాలను, అక్రమాలను, అన్యాయాలను.. చురుక్కుమనిపించే చతురతతో.. వణుకు పుట్టించే వ్యంగ్యంతో.. పాఠకుల మదిలోకి సూటిగా
దూసుకుపోయేలా చేసేదే కార్టూన్..
అద్భుతమైన సృజనాత్మకతకు సున్నితమైన హాస్యం జోడించి, మనసును తట్టిలేపి, ఆలోచింపజేసేవే కా ర్టూన్లు. అందుకే వ్యంగ్య చిత్రాలు అన్నింటికన్నా ముందుగా పాఠకుల దృష్టిని ఆకర్షిస్తాయి. అలరిస్తాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ కార్టూనే్ల ఒక్కోసారి పదునైన అస్త్రాలై నాయకుల గుండెల్లో గుబులు పుట్టిస్తాయి. భుజాలు తడుముకునేలా చేస్తాయి. ప్రభుత్వాన్ని, ప్రభుత్వం నడిపే నాయకులని, ప్రభుత్వాధికారులనూ.. ‘మీరు చేసిన పనేంటి?’ అంటూ నిలదీస్తాయి. ప్రభుత్వ పనితీరును, సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, ప్రజల మనోభావాలులను అద్దంలా ప్రతిబింబింపచేసేవే కార్టూన్లు. నేతాశ్రీల, అధికారుల పనితీరును ప్రజల కళ్ళకు కట్టడమే పొలిటికల్ కార్టూనుల ప్రధానోద్దేశం.
వ్యంగ్య చిత్రాలు గీయడమంటే మాటలు చెప్పినంత తేలిక కాదు. చెప్పాల్సిన విషయాన్ని కేవలం అతి తక్కువ పదాల్లో చెప్పగలగాలి. కార్టూన్‌ను చూడగానే అందులో అంతర్లీనంగా ఉన్న భావం వెంటనే అర్థమైపోవాలి. గీతల్లో విశ్వదర్శనాన్ని చూపించే కార్టూన్.. అత్యంత శక్తివంతమైన అణ్వాయుధం లాంటిది. ఇటీవల కేరళలో మలయాళ కార్టూన్ శతాబ్ది ఉత్సవాలు రెండు రోజుల పాటు జరిగాయి. ఈ ఉత్సవాలు కార్టూన్లలో దాగి ఉన్న శక్తివంతమైన కోణాన్ని ప్రతిబింబించేలా చేశాయి.
స్వాతంత్రోద్యమ సమయంలో భారతదేశంలోని ఆంగ్ల దినపత్రికలో ముద్రించిన అన్ని పొలిటికల్ కార్టూన్స్ ఆంగ్ల సంపాదకులచే సరిదిద్దించుకుని అచ్చయ్యేవి. ప్రఖ్యాత కార్టూనిస్ట్ శంకర్ పిళ్ళై, వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్ గౌపై గీసిన కార్టూన్ పెద్ద దుమారమే లేపింది. కార్టూనిస్ట్ శంకర్‌ని అతని ముందు దోషిగా నిలబెట్టింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ వైస్రాయ్ శంకర్‌ను అభినందించడమే కాకుండా, ఆ కార్టూన్ ఒరిజినల్‌ను అడిగి మరీ తీసుకున్నాడు. భారత స్వాతంత్య్రానంతరం మొద టి ప్రధానమంత్రి నెహ్రూ శంకర్ కార్టూన్లను అభిమానించడమే కాకుండా ‘డోంట్ స్పేర్ మీ శంకర్..’ అంటూ అడిగి మరీ తనపై కార్టూన్లను వేయించుకునేవారు. కానీ మిగతా కార్టూనిస్టులందరికీ అటువంటి అదృష్టం దొరకలేదు.
మొట్టమొదటి మలయాళీ కార్టూనిస్ట్ వి.ఎస్. గోవిందన్ పిళ్ళై జీవితం ఒక విషాదాంతం. ‘కత్తి కన్నా కలం గొప్పది’ అంటారు. కానీ గోవిందన్ పిళ్ళై- తన ‘క్రోక్విల్ పెన్’ బ్రిటీష్ వాడి ఫిరంగి కంటే చాలా గొప్పదని నిరూపించాడు. ఇండియన్ ఇంక్‌లో ముంచి తీసిన అతని క్రోక్విల్ పెన్ బ్రిటీష్ అధికారులను నిద్ర లేకుండా చేసింది. అతని మొదటి కార్టూన్ ‘విదూషకన్’ పత్రికలో 1919వ సంవత్సరంలో అచ్చయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశం భయంకరమైన కరువు కోరల్లో చిక్కుకుంది. పైగా బ్రి టీష్ వారి ఆర్థిక విధానాల వల్ల ఈ కరువు తీవ్రరూపం దాల్చి ఎందరో ప్రజల ప్రాణాలను బలితీసుకుంది. ఆ సమయంలో గోవిందన్ పిళ్ళై వేసిన ‘మహా క్షామ దేవత’ అనే కార్టూన్ బ్రి టీష్ రాణిని ‘కరువు దేవత’గా చూపించిన తీరు బ్రిటీష్ అధికారులను విపరీత ఆగ్రహానికి గురిచేసింది. ఫలితంగా ఆ కార్టూనిస్ట్‌ని అరెస్ట్ చేసి అండమాన్ ‘కాలాపానీ’ జైలుకు పంపించారు. రెండు సంవత్సరాల తర్వాత అతని ఆరోగ్యం దెబ్బతినటంతో విడుదల చేశారు. విడుదలైన కొద్దిరోజులకే.. అంటే 1932లో 42 సంవత్సరాల అతి పిన్నవయసులోనే గోవిందన్ పిళ్ళై చనిపోవడం పెద్ద విషాదం.
కేరళలో మోస్ట్ సీనియర్ కార్టూనిస్ ఎనభై సంవత్సరాల సుకుమార్ పుట్టి, కార్టూనిస్ట్ సుధీర్‌నాథ్‌ల పరిశోధనల ఫలితంగా గోవిందన్ పిళ్ళై గురించి చాలా విషయాలు బయటకు వచ్చాయి. అలా అతని కుటుంబ సభ్యులను గుర్తించడం జరిగింది. కేరళ మీడియా అకాడమీ, కేరళ కార్టూన్ అకాడమీ సంయుక్తంగా నిర్వహించిన మ లయాళ కార్టూన్ పండుగలో గోవిందన్ పిళ్ళై కుటుంబ సభ్యులను చాలా గొప్పగా సన్మానించారు. గోవిందన్ పిళ్ళై స్వస్థలం కొల్లామ్‌లో ఈ వేడుకను నిర్వహించారు. రెండు రోజులపాటు అద్భుతంగా నిర్వహించిన కార్టూనిస్టుల సమావేశానికి దేశం నలుమూలల నుండి వివిధ వార్తాపత్రికలకు సంబంధించిన పనె్నండు మం ది కార్టూనిస్టులను ఆహ్వానించారు. ఇందులో కార్టూన్ల గురించి ఉపన్యాసాలు, పవర్ పాయింట్ ప్రెజంటేషన్స్, కార్టూన్ ఎగ్జిబిషన్స్, కేరళకు చెందిన వివిధ విశ్వవిద్యాలయాల జర్నలిజం విద్యార్థులతో చర్చాగోష్టిని నిర్వహించారు. సీనియర్ కార్టూనిస్ట్ సుకుమార్ , ఏసుదాసన్‌లు శత సంవత్సరాల మలయాళ కార్టూన్ల గురించి వివరించారు. అలాగే ‘ద టైమ్స్ ఆఫ్ ఇండియా’ కార్టూనిస్ట్ సందీప్ ఆధ్వర్యు, ‘హిందూస్థాన్ టైమ్స్’ కార్టూనిస్ట్ మనోజ్ సిన్హాలు ‘మీడియాలో కార్టూనుల స్థానం-్భరతీయ ప్రజాస్వామ్యం’ గురించి మాట్లాడారు. ‘ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్’ కార్టూనిస్ట్ డా. రోహ్‌నిత్ పోరే ‘ఉత్తర భారతదేశ కార్టూన్ల’ గురించి మాట్లాడారు. ‘పంజాబ్ కేసరి’ కార్టూనిస్ట్ మనోజ్ చోప్రా ‘జమ్మూ కశ్మీర్ నియంత్రణ రేఖ’ గురించి మాట్లాడారు. గుజ్జరప్ప, నర్సిమ్‌లు ‘కన్నడ, తమిళ కార్టూన్ల’ గురించి మాట్లాడారు. ‘డెక్కన్ క్రానికల్’ కార్టూన్ ఎడిటర్ అయన నేను ‘తెలుగు కార్టూన్లు-్భరతదేశం’ గురించి మాట్లాడాను. మొట్టమొదటి తెలుగు కార్టూనిస్ట్ తలిశెట్టి రామారావు గురించి, 1930లో ‘్భరతి’ మాస పత్రికలో అచ్చయిన అతని కార్టూన్ ‘ప్రబంధ నాయక్’ గురించి కూడా ఈ సందర్భంగా ప్రస్తావించాను. బాపు కార్టూన్లతో తెలుగు కార్టూన్ రంగం కొత్త పుంతలు తొక్కింది. ఆయన కార్టూన్స్ చాలావరకు సామాజిక సమస్యలపైనే ఉండేవి. ఆ కాలంలో అన్ని తెలుగు వార్తాపత్రికలు, ఆంగ్ల వార్తాపత్రికల్లో అచ్చయిన శంకర్ పిళ్ళై, అబూ అబ్రహాం, రాజేంద్ర పూరి ఆంగ్ల కార్టూన్లు తెలుగులో అనువదించి అచ్చు వేసేవారు. కాలక్రమేణా తెలుగు వార్తాపత్రికలు తమకంటూ సొంత కార్టూనిస్టులను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపు 100 మందికి పైగా అమెచ్యూర్ కార్టూనిస్టులు (ఫ్రీలాన్స్ కార్టూనిస్టులు), 15 మందికి పైగా రాజకీయ కార్టూనిస్టులు వివిధ పత్రికలలో పనిచేస్తున్నారు. హైదరాబాద్ ‘డెక్కన్ ఉర్దూ’ గురించి, దాని ప్రత్యేకత గురించి కూడా ప్రస్తావించాను. హైదరాబాద్ నుండి వెలువడే ఉర్దూ హాస్య పత్రికలు, హిందీ పత్రికల గురించి, వాటిలో వచ్చే కార్టూన్ల గురించి వివరించాను. తలిశెట్టి రామారావు మొట్టమొదటి తెలుగు కార్టూన్ అచ్చయి వచ్చే సంవత్సరానికి తొంభై సంవత్సరాలు నిండుతాయి. ఈ సందర్భంగా మన ప్రభుత్వాలు, మన తెలుగు కార్టూనిస్టులు పూనుకుని తెలుగు కార్టూన్ ఉత్సవాలను కూడా ఇలాగే ఎంతో ఘనంగా నిర్వహిస్తారని ఆశిద్దాం.

సుభాని కార్టూన్ ఎడిటర్, డెక్కన్ క్రానికల్