Others

పుష్ప విలాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసంతం వేళ సుమ సోయగాలను కనులార వీక్షించాలని, మనసారా ఆనంద పారవశ్యం చెందాలని ఎవరికుండదు..? ఆకుపచ్చని వనాల్లో ఏకాంతంగా పూల గుసగుసలు వినడం మరచిపోలేని మధురానుభూతి.. అందుకే- ప్రఖ్యాతి చెందిన పూదోటలను తిలకించేందుకు ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు తరలివస్తుంటారు. ప్రస్తుతం జపాన్, అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల్లో విరగబూసిన చెర్రీ పూల చెట్లను తిలకించి పులకించేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. జపాన్‌లో ఏటా మార్చి నుంచి ఏప్రిల్ వరకూ చెర్రీ వనాలు సందర్శకులకు స్వాగతం పలుకుతాయి. ఈ దేశంలోని ఒసాకా, హొక్కైడొ, ఫుకొకా ప్రాంతాల్లో ఎటు చూసినా చెర్రీ పూల అందాలే.. షొఫుసొ జపనీస్ హౌస్ గార్డెన్‌లో ప్రకృతి ప్రేమికుల కోసం ఈనెల 10 నుంచి వారం రోజుల పాటు ‘వార్షిక పుష్పోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జపాన్ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతిబింబించే కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. జపాన్‌లోని ప్రసిద్థి చెందిన పలు ఉద్యానవనాల్లోనూ ఈ తరహా ఉత్సవాలను నిర్వహిస్తారు. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ సహా పలు ప్రాంతాల్లో పూల అందాలను ఆస్వాదించేందుకు పర్యాటకులు ఉత్సాహం చూపుతారు. కొన్ని నగరాల్లో పదిరోజుల పాటు జరిగే సంబరాల్లో పర్యాటకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రకృతి అందాలను వీక్షిస్తారు. టోక్యో, వాషింగ్టన్ డీసీ, మకొన్, జార్జియా, శాన్‌ఫ్రాన్సిస్కో, సియోల్, ఫిలడెల్ఫియా, నెవార్క్, నాష్‌విల్లే తదితర నగరాల్లో శీతాకాలం ముగిసేదాకా ఈ కోలాహలం కొనసాగుతుంది.