Others

ప్రజలు-జగము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వస్తోందట వికారి నామ వత్సరము
ఎన్ని సత్కార్యాలను తెస్తుందో
వస్తోందట..

అదృష్టం అని అనమాబాకండి
అది మనం చేసుకునే కృతమే
ఆడు మన కులపోడు, మన అన్న బామ్మర్థి
అని మీట నొక్కితే
అందరినీ ముంచుతూ
అందలమెక్కి రాజ్యం చేయగలడు
ఆడు..

అసలే
పారిజాత సుమపు బ్రతుకులు కావు మనవి
పడుపు వృత్తి జీవితాలు
దేశ సంపదలో అర్ధ్భాగం తొమ్మిది మంది
చేతిలో పెట్టిన
ప్రజాస్వామ్యం మనది
చిప్పలో కూటికై అలమటిస్తున్న
చితికి పోయిన జీవితాలు ఎన్నో.. ఎనె్నన్నో..

వస్తోందట వికారి నామ వత్సరం
ఎన్ని వింతలు తెస్తుందో..

ఉగాది ఓ కొత్త యుగానికి
నాందీ వాక్యం కూడా పలకవచ్చు
నిజంగానే పలకవచ్చు
ఆ భాగ్యం తెచ్చేది
యే ఎంఎల్‌ఏనో, యే మంత్రో కాదు
భాయి సాబ్, యాది పెట్టుకోండి ఈ మాట
రుూ నేటి రోజుల్లో
ఎవడూ ఏదీ చేయడు నీకోసం
మహా అయితే అయిదు లీటర్ల పెట్రెల్
కొన్నోడికి అయిదు వందల గ్రాముల
సబ్సిడీ అంటాడు
అదీ నీ డబ్బే.. వాడబ్బ డబ్బు కాదు..

అందుకే
మనకి మనం.. ఒకరికి ఒకరం
అయి బ్రతికితే
పూర్తి భోజనం అక్కర్లే
పస్తున్నోడికి ఓ రొట్టెముక్క
ఒక పెన్సిల్, ఓ నోటుబుక్కు
కింద పడ్డోడికి చేయూత
ఇవ్వగలిగితే..

ముందర మనుష్యులు ఒక్కటైతారు
నా బాగు, నీ బాగు అని కాదు
మన బాగంటూ
ఇడగొట్టే నాయకులను ఇసిరి పారేసి
మంచోడికి బాధ్యత ఇచ్చి
ముందుకు కదులుతారు..

అన్నా
ఆరోజు వికారి నామం అయినా
ఇంకే నామం అయినా
వస్తుందీ ఓ నవ యుగాది
ఓ నవ శకానికి నాంది పలుకుతూ
తథాస్తు.. శుభం..

-నండూరి రామచంద్రరావు.. 9949188444