సబ్ ఫీచర్

నేల విడిచి సాము

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగునట. నదులు కొండల పర్వతాలమీద పాయలాగా ప్రారంభమై బలహీనపడిన చోటల్లా వాగు లు, ఉప నదులను కలుపుకుంటూ ప్రవహిస్తూ సముద్రానికి చేరుతుంటాయి. కృష్ణానది కూడా అలాగే అరేబియా సముద్రానికి 64 కి.మీ. దూరంలో సహాద్రి పర్వతాల మీద ప్రారంభమై, ఆంధ్రప్రదేశ్‌లోని దివిసీమలోని హంసలదీవి దాటి న తర్వాత బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ ప్రవాహం కొనసాగుతూ ఎందరి దాహాన్నో తీరుస్తోంది. ఎన్ని లక్షల ఎకరాలనో సస్యశ్యామలం చేస్తోంది. అంతేకాదు ఎన్నో ప్రాంతాలలో విద్యుచ్ఛక్తితో వెలుగునిస్తోంది.
నీరు తగ్గినా నది మీద కట్టిన ఆనకట్టలు మితిమీరినా ముఖ్యంగా బాధపడేవాళ్ళు ఆ నదికి దిగువున వున్న వాళ్లు. కృష్ణానది దిగువ ప్రాంతంలో వున్నవి తెలంగాణా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు. కృష్ణా గోదావరి నదుల మీద ఆధారపడి వ్యవసాయమే కాదు, విద్యుదుత్పత్తి జరుగుతోంది. మరి నీళ్ళు నదిలో తగ్గిపోతే విద్యుదుత్పత్తి తగ్గిపోతుంటుంది. దాంతో ప్రజలు రకరకాలుగా బాధలు పడుతుంటారు.
ఈ విషయాన్ని మళ్ళీమళ్ళీ మననం చేసుకుని ప్రవాహం పెరిగే జాగ్రత్త పడాలి. ఎక్కువశాతం భూములు సస్యశ్యామలం కావడమే కాదు, తగ్గట్టు విద్యుదుత్పత్తి ఉండేలా చూసుకోవాలి. విద్యుత్ తగ్గిపోతే వ్యవసాయ రంగానికే కాదు పారిశ్రామిక రంగానికి కష్టమవుతుంది. నీటి స్థాయి తగ్గినకొద్దీ విద్యుదుత్పత్తితగ్గి డిమాండ్ పెరుగుతుంది. జల విద్యుత్తు కాస్త చౌకగా దొరుకుతుంది. ఈ ఉత్పత్తి తగ్గిపోతే బహిరంగ మార్కెట్‌లో విద్యుత్తుని అధిక ధరకు కొనాల్సి వస్తుంది.
గత నెలాఖరుకి తెలంగాణా రాష్ట్రానికి విద్యు త్తు డిమాండ్ 160 ఎమ్‌యూలను దాటుందని అంచనావేశారు. ఇప్పటికి జల విద్యుత్తు 25 ఎమ్‌యూలని కూడా దాటలేదు. ప్రస్తుత నీటి నిలువ ఆల్మట్టిలో పూర్తిస్థాయిలో ఉంది. నారాయణపూర్ వచ్చేసరికి సగం స్థాయికి చేరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో మూడోవంతే నిల్వవున్న తెలుగు రాష్ట్రాలలో అన్ని ఆనకట్టల దగ్గర చేరే ప్రవాహాలకన్నా వదులుతున్న ప్రవాహాలు తగ్గిపోతున్నాయి. వీటి గురించి ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? నదీ ప్రవాహం తీరు గురించీ ఆలోచించి తీరాలని పుష్కరాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పుష్కరాలకు జనాల్ని ఆకర్షింపజేసి ప్రచారంకాక నీటి ప్రవాహం తగ్గకుండా కాపాడుకోవడం ఎలాగనే విషయాల మీద ఆలోచించాలి ప్రజా సంక్షేమంకోసం.
జల పరిణామాన్ని పట్టించుకోకుండా బహుళార్థసాధక ప్రాజెక్ట్‌లను కట్టుకుంటూపోయి, అభివృద్ధిని సాధించగలమా? నీరే లేనప్పుడు ఈ ప్రాజెక్టులు వ్యర్థమేకదా? ఈ విషయాన్ని ఆలోచిస్తున్నారా? ఆలోచించాల్సిన సమయమిది. పనె్నండేళ్ళకోసారైనా ఇలాంటి విషయాల్ని ఆలోచించాలిగదా! ప్రభుత్వాల ఆలోచనలూ ఆ దారిలో సాగాలని ఆశిద్దాం.
నీటి ప్రవాహం, స్వచ్ఛతలతో నదీ నీటిని ఎలా వినియోగించుకోవాలో ఆలోచించాలిగాని నీటి విషయాన్ని గమనించకుండా అభివృద్ధి సాధించడానికి చేస్తున్నామంటూ చేస్తున్న పనులన్నీ నేల విడిచి సాము చేసినట్టే!
ఇంతవరకూ వున్న కృష్ణానది చిత్రమిది. హఠాత్తుగా పెద్ద వర్షాలు పడడంతో చిత్రం మారిపోయింది. నీరు వరదలా ప్రవహిస్తోంది.
మహబలేశ్వరం కొండల మీద కుండపోతగా వర్షం కురవడంతో ఆ నీరు వరదగా వచ్చేసింది. మధ్యలో మిగతా ప్రాంతాల్లో కురిసిన నీళ్లు తోడవుతున్నాయి. అంటే మనం గమనించాల్సిన విషయం ఒక ప్రదేశంలో క్యాచ్‌మెంట్ ఏరియాలో భారీ వర్షాలు కలిసి ఆ ప్రాంత జన జీవనం అవస్థలకు లోనైతేనే మరికొన్ని ప్రాంతాల్లో జనం లబ్ధిపొందుతున్నారు. పై ప్రాంతాల్లో ప్రజలు వర్షాలు కురిసినా కురవకపోయినా కూడా కష్టపడుతున్నారు.
కింది ప్రాంతాలవాళ్లు నదిలోని నీటిని తమ పూర్తి అవసరాలకు వాడుకుని ఎక్కువైతే ఈ నీటిని కింది ప్రాంతాలకు వదులుతున్నారు. కింది ప్రాంతాలవారు హటాత్తుగా అంత నీరు వస్తే నిలువ వుంచుకోలేక ఉపయోగించుకోలేక సముద్రంలోకి వదిలేస్తున్నారు.
అందుకే అతివృష్టి అనావృష్టి.
ఇవి కలగకుండా నది నీటిని పూర్తిగా వినియోగించుకోలేమా? ఈ విషయం గురించి ప్రభుత్వాలు విజ్ఞులు ఆలోచించలేరా? ఇలాంటి సమయంలోనైనా అలాంటి ఆలోచనలు రావా? అలాం టి ఆలోచనలు చేయాలనే నాయకులకు పరిశోధకులకు పుష్కరాలు చెబుతున్నాయి.
ఇక ప్రజలు ప్రత్యేకంగా ఆలోచించాల్సిన విషయాలు...
వర్షాకాలం వచ్చిందంటే నీటి ద్వారా రకరకాల జబ్బులు ప్రబలి ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటాయి. వర్షాలతో బాటు వరదలూ ఈ సందర్భంలో పుష్కరాలు...చాల జాగ్రత్తలు తీసుకోవాలి. రకరకాల రుగ్మతలతో బాధపడేవాళ్లు స్నానాలకు వస్తారు. పైగా ఘాట్లలో గుంపులగా స్నానం చేస్తుంటారు. అందుకని నదీ స్నానానికి ముందు ఆ తర్వాత సముద్ర స్నానానికి ముందు ఆ తర్వాత మంచినీటితో శరీరాన్ని శుభ్రం చేసుకోవడం అవసరమేమో?
నీరు నిండుగా వున్నప్పుడు నదీ స్నానాలు చాలా జాగ్రత్తగా, లోతుకి వెళ్లకుండా చేయాలి. నీటిలో ఉమ్ములు వేయడం లాంటి అపరిశుభ్ర పనులు చేయకూడదు. చేస్తే ముందు బాధపడేవాళ్లు అక్కడ స్నానం చేసే వాళ్లేగా?
పుష్కరాలంటే నది నీటిని పవిత్రంగ భావిస్తూ చేసే స్నానాలేగా? అనారోగ్యాన్ని కొని తెచ్చుకునే స్నానాలు కావుగా? నది నీటి పవిత్రతను కాపాడుకోండి.
నది నీటిని దాని పరిశుభ్రతని కాపాడుకొమ్మని చెప్పడమూ ఈ పుష్కర సందేశాలలో ఒకటి. కా దంటారా? పుష్కరాలని నిర్వహిస్తున్న ప్రజలు పుష్కరాలలో పాల్గొనాలని ఉబలాట పడుతున్న ప్రజలు కూడా ఆలోచించాల్సిన విషయాలివి. ఏమంటారు?

- డా.వేదగిరి రాంబాబు