AADIVAVRAM - Others

‘వుడ్‌కట్’ కళలో రారాజు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోలోగ్రఫీ ప్రక్రియలో శ్రీకాంత్ ఆనంద్ ఎంత ప్రసిద్ధి చెందారో ‘వుడ్‌కట్’ ప్రక్రియలో ఎం.బాలరాజ్ అంతకన్నా ఎక్కువ ప్రశంసలందుకున్నారు. ఆయన ‘ప్రింట్’ చేసిన చిత్రాలు ప్రపంచ ప్రముఖుల మన్ననలు అందుకున్నాయి. విచిత్రమేమిటంటే హైదరాబాద్ నగరానికి చెందిన ఎం.బాలరాజ్ ఎక్కడా చదువుకోలేదు. ఏ కోర్సూ చేయలేదు. ఏకలవ్యుడిగా ఆ ‘విద్య’ను కళను ఆరాధించి, ఔపోసన పట్టారు.
పూర్వపు ఆంధ్రప్రదేశ్ లలిత కళాతోరణంలో 1975 నాటికి గ్రాఫిక్ స్టూడియోను ఏర్పాటు చేశారు. దాంతో హైదరాబాద్‌లోని ప్రముఖ చిత్రకారులు ‘కళాభవన్’కు వచ్చి స్టూడియోలో పనిచేసేవారు. వివిధ ప్రక్రియల్లో ప్రింట్లు తీసుకునేవారు. వారిలో దొరైస్వామి, గౌరీశంకర్, దాతర్, పి.ఎస్.చంద్రశేఖర్, జి.వై.గిరి, లక్ష్మాగౌడ్, వైకుంఠం, బి.ఏ.రెడ్డి, పి.టి.రెడ్డి, విద్యాభూషణ్.. ఇట్లా ఒకరా? ఇద్దరా? చిత్రకళారంగంలోని మీగడ లాంటి వారందరూ వచ్చి పని చేస్తూ, ప్రింట్లు తీస్తూ ఉండగా వారికి సహాయకునిగా నియుక్తుడైన ‘కాజువల్ ఉద్యోగి’ ఎం.బాలరాజ్ వివిధ పనులను చేసిపెట్టేవాడు. అప్పటికి అతని వయసు దాదాపు 15 సంవత్సరాలు. దాంతో అందరితో కలివిడిగా తిరుగుతూ అందరి ‘పని విధానాన్ని’ క్షుణ్ణంగా పరిశీలించాడు. ఒక్కో ప్రక్రియలో ఒక్కో రకమైన నైపుణ్యాన్ని గ్రహించాడు. కుటుంబ పరిస్థితులు సరిగా లేని కారణంగా ప్రాథమిక విద్యలోనే చదువు మానేసి ‘కళాభవన్’కే అంకితమయ్యాడు. ఆ రకంగా అక్కడి వాతావరణాన్ని పూర్తిగా జీర్ణించుకున్నాడు. రంగుల, రసాయనాల రహస్యాలు తెలుసుకున్నాడు. చిత్రలేఖనంలో కొంత ‘అభ్యాసం’ చేశాడు. వాటిని గురువులకు చూపితే భుజం తట్టారు. దాంతో వుడ్‌కట్ ప్రక్రియలో తన ‘ప్రజ్ఞ’ను మెరుగుపరచుకోవాలని నిశ్చయించుకుని అటుగా అడుగులు వేశాడు.
చిత్రకారుడు దాతర్, దొరైస్వామిలు వుడ్‌కట్ ప్రక్రియలో ప్రింట్లు తీయడంలో ఆరితేరినవారు. వారి పని విధానాన్ని మరింత నిశితంగా పరిశీలిస్తూ వచ్చాడు. చిత్రకారులు తమ తమ పనులు ముగించుకుని వెళ్లిపోయాక బాలరాజ్ తన ‘పని’ని ప్రారంభించేవాడు. ఆ ఏ కాంతంలో తన మనోభావాలకు అనుగుణంగా చిత్రాలు గీస్తూ కార్డుబోర్డును కట్ చేసి ‘వుడ్‌కట్’ ప్రక్రియలో వాటి ‘ప్రింట్లు’ తీస్తూ తన నైపుణ్యాన్ని పెంచుకున్నాడు. అలా ‘చేయి తిరిగింది’. దాంతో భోపాల్‌లో 1991లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన భారత్ భవన్ ప్రింట్ పోటీకి బాల్‌రాజ్ తన ‘ప్రింట్’ను పంపించారు. ఆ పోటీలో బహుమతి రావడంతో బాలరాజే కాదు హైదరాబాద్ చిత్రకళాకారులందరూ ఆనందపడ్డారు. ప్రతిష్ఠాత్మక పోటీలో ప్రైజు రావడం ఆషామాషీ వ్యవహారం కాదని అందరికీ తెలుసు. ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీలకు క్రమం తప్పకుండా ప్రింట్లను పంపసాగాడు. బహుమతులను అందుకున్నాడు. అదొక రికార్డు.
తాను పని చేసిన లలిత కళా అకాడెమీ కూడా ఆయన ప్రతిభను మెచ్చి 1981, 1984 సంవత్సరాల్లో బహుమతులను ప్రదానం చేసింది. తెలుగు విశ్వవిద్యాలయంలో లలిత కళా అకాడెమీ 1984లో విలీనమయ్యాక 1999 సంవత్సరంలో బాలరాజ్ విశ్వవిద్యాలయం నుంచి మరో అవార్డును అందుకున్నారు.
2012 సంవత్సరంలో ముంబాయిలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో ‘బాలరాజ్ వుడ్‌కట్ ప్రింట్ల ప్రదర్శన’ జరిగింది. హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ తదితర ప్రముఖ నగరాల్లోనూ ఆయన తన చిత్రాలను ప్రదర్శించారు. అనేక గ్రూపు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
ఆయన వుడ్‌కట్ చిత్రాలు పద్మశ్రీ జగదీశ్ మిట్టల్, ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి లాంటి ప్రముఖ వ్యక్తుల, సంస్థల కలెక్షన్లలో ఉన్నాయి.
ఆ ప్రింట్లు సాధారణ చూపరులను అంతగా ఆకర్షించక పోయినా ఆస్ట్రేలియాకు చెందిన డయానీ లెవీస్ ఫాగ్‌వెల్ లాంటి చిత్ర విమర్శకుల, జగదీశ్ మిట్టల్ లాంటి చిత్రకళా ప్రముఖుల ప్రశంసలు, మన్ననలు అందుకున్నాయి.
బాలరాజ్ బొమ్మలు (వుడ్‌కట్ చిత్రాలు) సమాజానికి ఎంతో అవసరమని వారభిప్రాయపడినారంటే అందులో ‘సత్యం’ దాగున్నదనే కదా అర్థం!
ఎం.బాలరాజ్ 97058 12006

-వుప్పల నరసింహం 9985781799