Others

మీరజాలగలడా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్యభామ సరే, కృష్ణుడు ఎన్టీఆర్ కాదే.. అని ఆలోచనలో పడినట్టున్నారు. సహజమే! ఎందుకంటే సత్యభామ, కృష్ణుడు పాత్రల్లో ఎన్టీఆర్, జమునలను తెలుగు ప్రేక్షకులు అమితంగా ఆదరించారు. అందుకు సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన శ్రీకృష్ణ తులాభారం (1966) చిత్రం, అది సాధించిన అఖండ విజయమే ఉదాహరణ. ఈ చిత్రంలో సత్యభామ పాత్రలో జమునకు ప్రత్యేక గుర్తింపు లభించింది. అపర సత్యభామగా అభిమానుల ఆదరణ పొందింది. తులాభారం ఎడిసోడ్‌కు ఆ చిత్రంతో ఆదరణ పెరగడంతో -సహ నటీమణులు కాంచన, ప్రభ, గిరిజ, మమత మొదలగు వారితో బీరం మస్తాన్‌రావు దర్శకత్వంలో శ్రీకృష్ణతులాభారం నాటకంగా రూపొందింది. ఈ ప్రదర్శనలనూ తెలుగువారు అమితంగానే ఆదరించారు. నాటకాన్ని తమ తమ ప్రాంతాల్లో ప్రదర్శించాలంటూ కోరటం మొదలుపెట్టారు. తనతోపాటు ఇతర నటీమణులకు షూటింగ్ సమయాన్ని తీసుకోవటం సమస్యగా మారినా, సత్యభామ పాత్ర పట్ల మోజు పెంచుకున్న జమున మూడవ ప్రయత్నంగా రంగస్థల కళాకారుల కాంబినేషన్‌లో శ్రీకృష్ణతులాభారం నాటకాన్ని ప్రారంభించింది. అదృష్టవశాత్తూ వెండితెరపై శ్రీకృష్ణుడిగా ఎన్టీఆర్‌ని చూసిన ప్రేక్షకులు, ఏమాత్రం నిరుత్సాహపడకుండా ఆ పాత్రకు ఆహార్యం, నటనలో సరిసాటి అయిన అక్కిరాజు సుందరరామక్రిష్ణనూ ఆదరించారు. జమున, అక్కిరాజు కాంబినేషన్‌లో నాటకం విజయవంతమై పలు ప్రదర్శనలు ఇచ్చే అవకాశం కలిగింది. ఆ నాటకంలోని శ్రీకృష్ణుడు సత్యభామనే మనం ఇప్పుడు ఈ చిత్రంలో చూస్తున్నది.

-పర్చా శరత్‌కుమార్ 9849601717