Others

కారులో షికారుకెళ్లే.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1957లో విడుదలెంది అన్నపూర్ణ వారి ‘తోటికోడళ్ళు’ చిత్రం. ఈ సినిమాలో హిట్‌సాంగ్ ‘కారులో షికారుకెళ్లే పాలబుగ్గల పసిడిదాన.. బుగ్గమీద గులాబిరంగు ఎలా వచ్చెనో తెలుపగలవా?’ అంటూ హీరో పాడే పాట చాలా ఇష్టం. కష్టజీవుల తరఫున గొప్పోళ్లను నిలదీసే విప్లవగీతంగా వినిపించే ఈ పాటను ఆత్రేయ అందించారు. అంతేకాదు, కష్టజీవుల శ్రమ విలువను అద్భుతంగా ఆవిష్కరించారు. కారులో షికారుకెళ్ళే హీరోయన్‌ను ఉద్దేశించి ఒక కవి (హీరో అక్కినేని) ‘కారులో షికారుకెళ్ళే పాలబుగ్గల పసిడిదానా/ బుగ్గమీది గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా?’ అని అడుగుతూ ‘నిన్ను మించిన కనె్నలెందరో మండుటెండలో మాడిపోతే/ వారి బుగ్గల సిగ్గుల అందం వచ్చి చేరెను తెలుసుకో’ అని హితోక్తి పలుకుతాడు. అద్దంలో అందం తీర్చిదిద్దుకునే ప్రతిసారీ ఈ పాటతో శ్రమజీవుల శ్రమ గుర్తుకొచ్చి తీరుతుంది. చరణంలో -‘చలువరాతి మేడలోన కులుకుతావో కుర్రదానా/ మేడ కట్టిన చలువరాయి ఎలా వచ్చెనో చెప్పగలవా?’ అని ప్రశ్నిస్తూ ‘కడుపు కాలే కష్టజీవులు గనులు దొలచి, ఒడలు విరిచి చెమట చలువను చేర్చి రాళ్ళను తీర్చినారు తెలుసుకో’ అని చెప్పడంతో మన కళ్ళముందు జరిగే ప్రతి నిర్మాణంలో శ్రామికుల శ్రమ కనిపిస్తుంది. చివరిగా ‘గాలిలోన తేలిపోయే చీర కట్టిన చిన్నదానా/ జిలుగు వెలుగుల చీర శిల్పం ఎలా వచ్చెనో చెప్పగలవా? అని అడుగుతూ, ‘చిరుగుపాతల బరువు బ్రతుకుల నేతగాళ్ళు నేసినారు’ అని చెప్పడంలో శ్రమ జీవుల కష్టాన్ని ఆత్రేయ ఎంత సున్నితంగా చెప్పారో అనిపిస్తుంది. ఎంతో శ్రమకోర్చి వస్త్రాలునేసే చేనేత కార్మికులకు తగిన ధర, మార్కెట్ లభించక ఆత్మహత్యలకు పాల్పడటం, మిషన్‌తో తయారైన దుస్తులతో వృత్తికే చరమదశ రావడం కళ్ల ముందు నిలుస్తుంది. చిన్నిచిన్ని పదాలు, సులువుగా అర్థమయేయ మాటలతో కష్టజీవుల శ్రమ విలువను ప్రతి ఒక్కరూ గుర్తించేలా హృదయానికి హత్తుకునే రీతిలో ఆత్రేయ పాటను రాస్తే, పాడుకోడానికి అంతే సులువుగా ఉండేలా స్వరరచన చేసిన మాస్టర్ వేణు, గానం చేసిన ఘంటసాల ఎంతైనా అభినందనీయులు. అందుకే ఈ గీతం తెలుగువాళ్లకు ఆపాతమధురమైంది. చివరిగా.. అక్కినేని, సావిత్రి అభినయంతో ఈ పాట మరింత శోభిల్లింది.

-పాల్వంచ సీతారాం, ఐ పోలవరం