AADIVAVRAM - Others

చిత్తశుద్ధి - చెత్త బుద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తశుద్ధి లేని శివపూజలేలరా!
అన్నాడు ఆనాటి వేమన
చెత్తబుద్ధి లేని జనే్మ
జన్మ కాదురా!
అంటున్నారు నేటి జనం
చదువులు చట్టుబండలై
చనువులు నిండు కుండలై
లవ్వులు లవ్వులు అనుకొంటూ
పువ్వుల్లా నలిగిపోతున్నారు
పెళ్లినాటి ప్రమాణాలకు
నీళ్లొదిలి, అక్రమ సంబంధాల
కౌగిళ్లకు బందీలై
కనుమరుగవుతున్నారు
తల్లిదండ్రుల విడాకుల
మేకులు గ్రుచ్చుకొని
తలోదారి పోతుంటే
తమలపాకుల్లాంటి పిల్లలు
తల్లడిల్లిపోతున్నారు
నిత్యకృత్యాలైన ఈ సన్నివేశాలన్నీ
టీవీ ఛానల్సులో నృత్యం చేస్తుంటే
గ్రుడ్లప్పగించి చూస్తూ
గుటకలు మ్రింగుతున్నారు

-షణ్ముఖశ్రీ 88978 53339