Others

ఓ విలువైన గ్రంథం.. ( తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనువాద (డబ్బింగ్) చిత్ర గీత రచన
విలక్షణ ప్రక్రియ. మూల చిత్రంలోని
పాట తాలూకు సన్నివేశం. అర్థం ఏమాత్రం తేడాలేకుండా సంగీతానికి, పెదవుల
కదలికలకు అనుగుణంగా రచన చేయటం కత్తిమీద సామువంటిది.

గతంలో తెలుగు సినీ సాహిత్యంపై విస్తృత పరిశోధన చేసి ‘తెలుగు సినిమా పాట చరిత్ర’, ‘నంది అవార్డు పొందిన తెలుగు సినీ గేయ కవుల చరిత్ర’ గ్రంథాలను వ్రాసి ఎందరెందరో పరిశోధకులకు సహకరించిన డాక్టర్ పైడిపాల కలం నుంచి వెలువడిన మరో సాధికారిక రచన -తెలుగు సినిమాల్లో డబ్బింగ్ పాటలు.
తెలుగులో తొలి డబ్బింగ్ చిత్రం ‘ఆహుతి’ 1950లో విడుదలైంది. నాటినుంచి 2010 వరకూ అంటే అరవయ్యేళ్ల డబ్బింగ్ రచనా ప్రక్రియను కూలంకషంగా చర్చించి ఈ గ్రంథంలో పాఠకులకు అందించారు. ఈ కాలంలో (1950-2010) తెలుగులో డైరెక్టుగా నిర్మించిన చిత్రాలు సుమారు 3500. ఇవిగాకుండా విడుదలైన అనువాద చిత్రాలు 2300 (సుమారు పదమూడు వేల పాటలు). తొలితరం రచయితలు సముద్రాల (సీనియర్, జూనియర్), ఆరుద్ర, ఆత్రేయ, దేవులపల్లి మొదలుకొని నేటి సుద్దాల అశోక్‌తేజ, చంద్రబోసు వరకూ సుమారు 180మంది రచయితలు ఆ పాటలు వ్రాయగా అందులో సింహభాగంతో 270 చిత్రాలకు 1500 పాటలు వ్రాసిన ఘనత రాజశ్రీకి దక్కుతుంది. ఇది డేటాకు సంబంధించిన విషయం.
తొలి దశలో శ్రీశ్రీ, ఆరుద్ర; మలి దశలో అనిసెట్టి సుబ్బారావు.. ఆ తర్వాత రాజశ్రీ తమ అసమాన రచన ప్రతిభతో డబ్బింగ్ పాటకు పట్టంగట్టారు. సినీ సాహితీవనంలో విరిసిన పారిజాతం సి నారాయణరెడ్డి ‘కర్ణ’ చిత్రంకోసం మూలగీత భావానికి మరింతగా మెరుగులుదిద్ది వ్రాసిన అపురూప గీతం ‘గాలికి కులమేదీ’.. తెలుగు పాటలతో పోటీపడింది. ‘ప్రేమసాగరం’ కోసం వ్రాసిన రాజశ్రీ రచన ‘చక్కనైన ఓ చిరుగాలి’ ఎంతగా ప్రాచుర్యం పొందిందో అందరికీ తెలిసిందే!
గ్రంథ రచయిత ఎంచుకొన్న అధ్యాయాల, ప్రకరణల విభజన అర్ధవంతంగా సమంజసంగా ఉన్నాయి. ఇతర భాషల లక్షణాలను, వాటి అనువాద సరళిని వివరించిన తీరు, రచయితలను వారి రచనాశైలిని విశే్లషించిన తీరు ప్రశంసనీయం. తమిళంనుంచి తెలుగులోకి అనువదించబడిన చిత్రాలే ఎక్కువ. ఆ కారణంగానే తమిళ నటీనటులు తెలుగువారికి దగ్గరయ్యారు.
185వ పుటలో హిందీ చిత్రం ‘తీస్రీమంజిల్’ ఆధారంగా తెలుగులో ‘నిండు మనసులు’ తీశారని వ్రాసారు. అది పొరబాటు. ‘నిండు మనసులు’ చిత్రానికి మూలం హిందీలో ఓపి రాల్హన్ నిర్మించిన ‘పూల్ ఔర్ పత్తర్’. అనువాద చిత్ర సాహిత్య సౌరభాలను ఆయా రచయితల కృషిని తెలుగు సినీ సాహిత్యాభిమానులకు అందించే గొప్ప ప్రయత్నం చేసిన రచయిత డాక్టర్ పైడిపాల అభినందనీయులు.

-ఎస్‌వి రామారావు