Others

ముద్దుల హీరోతో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన గోవా భామ ఇలియానా ఇక్కడ మంచి క్రేజ్ ఉండగానే బాలీవుడ్‌కి చెక్కేసింది. అక్కడ రెండు మూడు సినిమాలు చేసిన ఈమెకు పెద్దగా ఉపయోగం లేకపోయింది. దాంతో అవకాశాలు సన్నగిల్లాయి. మళ్లీ తన హవాను ప్రూవ్ చేసుకోవడానికి హాట్ హాట్‌గా ఫొటోషూట్లతో బాలీవుడ్ జనాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసింది. ప్రస్తుతం ఈమె అక్షయ్‌కుమార్ సరసన నటించిన రుస్తుం చిత్రం మంచి టాక్‌తో రన్ అవుతోంది. ముఖ్యంగా ఇలియానా నటనకు, గ్లామర్‌కు అభినందనలు దక్కడంతో ఇప్పుడు మరో ఛాన్స్ బాలీవుడ్‌లో దక్కించుకుంది. బాలీవుడ్ ముద్దుల వీరుడుగా పాపులర్ అయిన ఇమ్రాన్‌హష్మీ హీరోగా నటించే సినిమాలో ఇలియానా హీరోయిన్‌గా ఓకే అయ్యిందట. మిలాన్ లుత్రియా దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమాలో మరో హీరో అజయ్ దేవ్‌గన్ కూడా నటిస్తున్నాడట. మొత్తానికి బాలీవుడ్‌లో ముద్దుల వీరుడు సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న ఇలియానా ఈ సినిమాతో ఇంక ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తుందో చూడాలి!