AADIVAVRAM - Others

వెయ్యి కడవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెన్నమ్మ ప్రక్క వూళ్లో శివాలయం
రతనాలనబడే రాళ్లసీమలో
ఆ వూరు ‘బంగరు’
పెన్నమ్మ ఎప్పుడూ ఇసుక చీర కట్టుకొని వుంటుంది
శ్రావణంలోనో, భాద్రపదంలోనో
బిడియపడి వచ్చే వాన చినుకులకు
ఏ పండక్కో పేరంటానికో అన్నట్టు
జల జలతారు కోక కప్పుకుంటుంది
నోరు తడుపుకోవడానికి నీళ్లు వెదకాలి
బావి తవ్వితే రాళ్లే కానీ నీళ్లేవీ
కరుణిస్తే పాతాళ గంగమ్మ చెంబు నీళ్లిస్తుంది.
ఆ రోజు ప్రొద్దున ఇంటింటికి ఒక కడవతో
సహస్ర ఘటాభిషేకం చేశారు గంగాధరునికి
మధ్యాహ్నం అంతా ఎండిపోయి కారుమబ్బులు, చీకటి
ఉరుములు, మెరుపులు వడగండ్లతో
రెండు గంటలు హోరు వాన
ఊరంతా నీళ్లు, బురద గుంతలు, కాలువలు
అరవై ఏళ్లలో ఇంత కుండపోత రాలేదంటూ
పెద్దోళ్లు సంబరపడుతున్నారు.
*
ఆ సాయంకాలం
శివాలయంలో ప్రదోష పూజలు చేస్తూ
చిన్నా పెద్దా ఆడా మగా ఒకటే సందడి.
*
వెయ్యి కడవలకు శత సహస్రకోటి కడవల నీళ్లిచ్చిన
అగస్తేశ్వరుడు నవ్వుకుంటున్నాడు
నేనే కదా మీకు దిక్కని.

- ఎ.ఎస్. ప్రభాకర్