Others

అపర డొక్కా సీతమ్మ ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి.
రమాప్రభ జీవితంలో ఊహించని పరిణామం. ఇల్లూ వాకిళ్లూ పోయాయి. వెస్ట్‌మాంబలంలో నెంబరు ఆరు ఉమాపతి వీధిలో చిన్న ఇల్లు వుండేది. ఎప్పుడూ ఏదో ధ్యాసలో వుండేది. అపుడే తన దృష్టిని నూరుశాతం బాబామీదికి మళ్లించింది.

అది ఆల్వార్‌పేటలో రమాప్రభ ఇల్లు.
రమాప్రభ రోజుకి నాలుగు షిఫ్టులూ.. మున్నూట అరవై రోజులూ షూటింగుల్లో మునిగితేలుతుండేది. ఎప్పుడయినా షూటింగు ఏ కారణం చేతయినా కేన్సిలయితే సందడే సందడి!
ఆ ఇంట్లో రమాప్రభ కుటుంబ సభ్యులతోబాటు సింగర్ జి ఆనంద్, శరత్‌బాబు, రాజేంద్రప్రసాద్, మేడిశెట్టి అప్పారావు, చక్రవర్తి, బాలూ, నేనూ.. ఇంకా అప్పుడప్పుడే సినిమా వేషాలకోసం వచ్చిన కొత్త నటీనటులూ.. అందరికీ ఆ ఇల్లు కల్పతరువులా నిలిచేది.
ఇంట్లో ఒకపక్క వంటలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఏం తినాలనుకుంటే అవి నిముషాల్లో సిద్ధమైపోవాల్సిందే.
రమాప్రభలో సుగుణం ఏవిటంటే... అందరికీ తనే స్వయంగా వండి పెట్టేది. వడ్డించినపుడు పెద్దా చిన్నా తారతమ్యాలు చూసేది కాదు. స్థారుూభేదం అసలు చూసేది కాదు. అందరికీ అమ్మలా అనిపించేది. పాలు పొంగినట్టు పొంగుతూ వుండేది ఆ ఇంట్లో సంసారం.
వైద్య రామయ్యర్ వీధిలో నాలుగు కోట్లు విలువచేసే ఇల్లు, ఆల్వార్‌పేటలో షాపింగ్ కాంప్లెక్సు, విలువైన జ్యువెలరీ కలెక్షనూ... పట్టుచీరలకు అంతేలేదు. ఒకరోజు ఇంట్లో ఇంత ఖర్చవుతుందనిగానీ, తన ఇంట్లో తింటున్నవారికీ ఏవిటీ సంబంధం అనిగాని ఆలోచించేది కాదు. ఒకవేళ ఎవరయినా ‘ఏవిటమ్మా ఇది! ముందు వెనుకలు చూడకుండా ఇలా ఖర్చుపెట్టేస్తున్నావ్... రేపటి భవిష్యత్తు ఎలావుంటుందో ఆలోచించావా? అని గుమ్మడిలాంటివారు అడిగితే!
‘అడుక్కు తింటాను... ఏం బాబా అడుక్కోలేదా?’ సూటిగా అడిగేది. దాంతో నోటికి తాళంపడేది. ఎవరూ ఇహ ఖర్చులు గురించి ప్రస్తావించేవారు కారు.
ఓడలు బళ్లవుతాయి, బళ్లు ఓడలవుతాయి.
రమాప్రభ జీవితంలో ఊహించని పరిణామం. ఇల్లూ వాకిళ్లూ పోయాయి. వెస్ట్‌మాంబలంలో నెంబరు ఆరు ఉమాపతి వీధిలో చిన్న ఇల్లు వుండేది. ఎప్పుడూ ఏదో ధ్యాసలో వుండేది. అపుడే తన దృష్టిని నూరుశాతం బాబామీదికి మళ్లించింది.
ఉమాపతి వీధిలో ఆమెకు తోడుగా వున్నవాళ్లు నలుగురే నలుగురు బ్రహ్మం (కన్నాంబ అల్లుడు), శ్రీను (రవిరాజా అసిస్టెంట్), శ్రీకాంత్ (సరిత తమ్ముడు), నేనూ. రమాప్రభ చిన్నతమ్ముడు ఆనంద్ ఇంతే! ఆత్మీయులనుకున్న వారంతా ఆమడ దూరంలో ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా ప్రపంచం మీద కోపంతో అసలు ప్రయత్నించడమే మానేసింది. ఒకరిద్దరు వచ్చినా ఒకటీ అరా వేషాలు ఇచ్చినా పారితోషికం విషయం చెప్పిందొకటి ఇచ్చిందొకటి చేసేవారు. రమాప్రభ ఏనాడూ డబ్బు మొహం చూసేది కాదు. ఎంతసేపు ప్రేమ.. ప్రేమగా నిస్వార్థంగా పలకరింపు. ఇండస్ట్రీ మద్రాసు నుంచి హైద్రాబాద్ వచ్చేసింది. అక్కడింకేం పని. మేం ‘గూడెంలో సూరీడు’ సీరియల్ చేద్దామనుకున్నాంగానీ, స్పాన్సర్సు లేక ఆపేశాం.
హైద్రాబాద్‌లో శ్రీనగర్ కాలనీలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంది. మొదట్లో వెంకటేశ్ ఎంకరేజ్ చేశాడు. తరువాత నాగార్జున రమాప్రభకి పునర్జీవితం ఇచ్చాడనే చెప్పాలి. సాయి బాంధవులందరూ ఆమె బంధువులే. శ్రీనగర్ కాలనీలో మన్‌హర్ అపార్ట్‌మెంటులో ఒక ఫ్లాటు తీసుకుంది. అప్పుచేసి.. అప్పుతీరుతుంది. ఖర్చులు పెరుగుతున్నాయి. పాత అలవాటు మానలేదు.. భోజనం వేళయితే... ఇంట్లో ఎంతమందుంటే అంతమంది చేతులు కడుక్కొని తృప్తిగా భోంచేయాల్సిందే! సినిమాలు తగ్గాయి. రమాప్రభకి వయసుకీ సంబంధం లేదు. డైలాగు చెప్పడంలోగానీ డాన్సు చెయ్యడంలోగానీ కుర్రకారుకి ఏమాత్రం తగ్గేది కాదు. షుమారు పదిహేను వందల సినిమాల్లో నటించిన సహజ నటి రమాప్రభకి కనీసం పద్మశ్రీ రాకపోవడం తెలుగు ప్రేక్షకులమైనందుకు సిగ్గుపడాల్సిన విషయం!
రమాప్రభ ప్రస్తుతం మదనపల్లెలో వుంటుంది. నాగార్జున ఎప్పుడూ ఆమెకు అండగా వున్నారంటుంది. ఇన్ని అనుభవాలు చవిచూసినా ఇప్పడూ అదే దారి- పెట్టే చెయ్యి ఊరుకోదు. సాయినామం చెప్పిన వాళ్లందరూ ఆమెకు సాయి బాంధవులే! సూటిగా కళ్లలోకి చూసి నిజాయితీగా మాట్లాడే గుండె ధైర్యం రమాప్రభది!
వయసు పైనపడితే మాత్రం అలవాటు మానుతుందా? ఆకలితో వున్నవారికి బాబా నా ద్వారా అన్నం పెట్టిస్తున్నాడు. ఈ పుణ్య సంపదని మించిన సంపద ఏముంటుంది?
ఎప్పుడయినా మదనపల్లె వెళ్తేమాత్రం -అక్కడ కనిపించే దృశ్యమిదే.

-ఇమంది రామారావు 9010133844