Others

సంక్రమిత వ్యాధుల పట్ల జాగ్రత్త!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పశువుల మరియు పక్షుల నుండి మానవాళికి వ్యాప్తి చెందే వ్యాధులను జూనొటిక్ వ్యాధులంటారు. ఈవ్యాధి కారకాలు సూక్ష్మజీవి (బాక్టీరియా), సూక్ష్మాతి సూక్ష్మజీవులు (వైరస్), పరాన్నజీవులు (ప్యారసైట్స్)లు ఏవైనా కావచ్చు. ఈవ్యాధుల గురించి మానవాళి తెలుసుకునేందుకు, తీసుకునే జాగ్రత్తల గురించి, అప్రమత్తంగా ఉండేందుకు జూలై 6వ తేదీన ‘‘జంతు సాంక్రమిత వ్యాధి నివారణ దినోత్సవం’’ జరుపుకుంటున్నారు. 1885వ సంవత్సరం జూలై 6వ తేదీన ‘‘లూరుూ పాశ్చర్’’ అనే శాస్తవ్రేత్త మొట్టమొదటి సారిగా పిచ్చి కుక్క కాటుకు గురైన బాలునికి వ్యాధి రాకుండా వ్యాధి నిరోధక టీకా మందును విజయవంతంగా ఇచ్చిన నేపథ్యంలో ‘జూలై 6న జూనోసిస్ డే’గా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది. జంతు సాంక్రమిత వ్యాధులలో బ్రుసెల్లోసిస్, జపనీస్ ఎన్‌సెఫలైటిస్, రేబిస్, దొమ్మరోగం, హైడాటిడోసిన్ అనే వ్యాధులు ముఖ్యమైనవి.
బ్రుసెల్లోసిస్
ఈవ్యాధిని పశువుల్లో అకాల ప్రసవం అని, మనుషుల్లో మాల్టా ఫివర్ అని పిలుస్తారు. ఇది అంటువ్యాధి. ఇది అన్ని పశువుల్లోను మరియు పశువులనుండి మనుషులకు వస్తుంది. బ్రుసెల్లా అనేది సూక్ష్మజీవి. ఇది పశువుల్లో గర్భాశయంలో పెరిగి, కోడెల ద్వారా ఇతర పశువులకు సంక్రమిస్తుంది. మనుషులకు పాలు, వెన్న మరియు మాంసపు ఉత్పత్తుల ద్వారా వ్యాపిస్తుంది. ఇది ఎక్కువగా పశువులతో సన్నిహితంగా ఉండే పశువుల కాపరులకు, పశువైద్యులకు, సిబ్బందికి గర్భస్రావ పదార్థాల ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన పశువుల్లో గర్భస్రావం కలుగుతుంది. గర్భాశయం చెడి గొడ్డుమోతుగా మారుతుంది. వ్యాధి వలన మనుషులలో జ్వరం వస్తుంది. కీళ్ళనొప్పులు, వృషణాల వాపు, వంధ్యత్వము ఉంటాయి. వ్యాధి సోకిన పశువులను గుర్తించి వాటిని తీసి వేయాలి. జబ్బుపడిన పశువుల యొక్క పాకలను శుభ్రపరచి, గడ్డి గ్రాసం కాల్చి వేయాలి. వ్యాధి ఎక్కువగా కనబడే ప్రాంత దూడలకు బ్రుసెల్లా-19 అ నే టీకా వేయాలి. పశుకాపరులు, పశువైద్యులు తగు జాగ్రత్తలు వహించాలి. పాలు, వెన్న, మాంస ఉత్పత్తులను సరిగా వేడి చేసిన తర్వాతనే ఆహారంగా తీసుకోవాలి.
జపనీస్ ఎన్‌సెఫలైటిస్
ఈ వ్యాధిని మెదడువాపు అని కూడా అంటారు. ఇది దోమకాటు ద్వారా మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో, కొంగలలో ఈవ్యాధి కారకము వృద్ధి చెందుతుంది. ఇది ఆర్బొజాతికి చెందిన వైరస్ వల్ల వస్తుంది. ఈవైరస్ పందులలో, కొంగలలో వృద్ధి చెంది, వీటిని దోమలు కుట్టినపుడు వాటి రక్తంతోపాటు వైరస్ దోమల్లోకి ప్రవేశించి తర్వాత మనుషులకు కుట్టినపుడు సోకుతుంది. సాధారణంగా 3నుండి 12 సంవత్సరాల మధ్యగల పిల్లలు వ్యాధికి గురి అవుతారు. ఇది ఎక్కువగా దోమలు వృద్ధిచెందే కాలంలో సంభవిస్తుంది. వ్యాది సోకినపుడు మనుషులలో వారి ప్రవర్తన, ప్రవృత్తిలో తీవ్ర మార్పులు సంభవిస్తాయి. తీవ్ర జ్వరం (105-106) కనపడుతుంది. తీవ్రతల నొప్పి ఉంటుంది. వాంతులు, మెడనొప్పి, మెలికలు తిరగడం, మగత వంటి లక్షణాలు ఉంటాయి. ఈవ్యాధికి చికిత్స లేదు, నివారణ ఒక్కటే మార్గం. పందులను మనుషుల నివాసాలకు దూరంగా ఉంచాలి. దోమలు అనివృద్ది చెందు నీటి గుంటలను, మురికి నీరు నిలిచే స్థలాలను నిర్మూలించాలి. పశువుల పాకలను శుభ్రంగా ఉంచాలి. వ్యాధి సోకగల ప్రదేశాల్లో వ్యాది నివారణ టీకాలు పిల్లలకు ఇవ్వాలి.
రేబిస్
ఈ వ్యాధిని పిచ్చి కుక్కకాటు వ్యాధి అని పిలుస్తారు. పిచ్చికుక్కలు మనుష్యులను, పశువులను కరవడం వలన ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ర్యాబ్డొ జాతికి చెందిన వైరస్ వలన వస్తుంది. ఈ వైరస్ గబ్బిలాలలో వృద్ధి చెంది వాటి ద్వారా అడవి జంతువుల నుండి నక్కలకు, కుక్కలకు సంక్రమించి, అవి పిచ్చిగా మారి వాటికి ఎదురు వచ్చిన పశువులు, మనుషులను కరచినపుడు మాత్రమే వారికి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన కుక్కల నోటినుండి చొంగ కారటం, నాలుక బైటపెట్టుట, మతిలేక తిరగటం, కనబడిన వస్తువులను, మనుషులను, పశువులను కరుచుట, అరుపు మొదలగు లక్షణాలు లేదా కొన్ని కుక్కలు పిచ్చివచ్చినవి తిండి తినక నిశ్శబ్దంగా పడుకొని ఉంటాయి. వ్యాధి సోకిన కుక్కలు వారం రోజులలో చనిపోతాయి. వ్యాధి లక్షణాలు 10 రోజుల నుండి 10 సంవత్సరాలలో ఎప్పుడైనా కనబడవచ్చు. వ్యాధి సోకిన మనుషులు నీరును చూసి భయపడటం, గొంతు కండరాలు బిగుసుకుపోవడం, శరీర కండరములు విపరీతంగా నొప్పికలగడం, అరవటం లాంటి లక్షణాలు గాక మరణించడం జరుగుతుంది. ఈ వ్యాధికి చికిత్స లేదు. నివారణ ఒక్కటే మార్గం. వ్యాధి వ్యాపించకుండా వ్యాధివ్యాపక కారకాలైన ఊరకుక్కలను వృద్ధిచెందకుండా, సంతాన నిరోధ చికిత్సలు, పెంపుడు కుక్కలకు రోగనిరోధక టీకాలు వేయించాలి. కుక్కలు కరిచినపుడు గాయమైన ప్రదేశాన్ని మంచి శుభ్రమైన చల్లటి నీటితో కడిగివేసి రోగ నిరోధక టీకాలు వేయించాలి.
ఆంత్రాక్స్
ఈ వ్యాధిని దొమ్మరోగం అంటారు. ఇది పశువుల వ్యర్థ పదార్థాల నుండి, పశు ఉత్పత్తుల నుండి వస్తుంది. ఇది ఎక్కువగా పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, పశువుల తోలు పరిశ్రమలలో పనిచేసే వారిలో కనబడుతుంది. ఇది బెసిల్లస్ ఆంత్రాసిస్ అనే వైరస్ వల్ల వస్తుంది. ఈ వైరస్ అననుకూల పరిస్థితులలో సూప్తవదశలో ఉండి గాలి ద్వారా తొందరగా వ్యాపిస్తుంది.
ఈ వ్యాధి సోకిన పశువులలో జ్వర తీవ్రత పెరిగి , నోటినుండి, మలద్వారం నుండి రక్తం స్రవించి 24 గంటలలో చనిపోవడం జరుగుతుంది. వ్యాధితో చనిపోయిన పశువుల కళేబరాలను గొయ్యి తీసి పాతిపెట్టి, అవి వదిలివేసిన వ్యర్థ పదార్థాలను, మేతను కాల్చి శుభ్రం చేయాలి. వ్యాధి సోకిన ప్రదేశాలలో టీకాలు ఇప్పించాలి.
హైడాటిడోసిస్
ఈ వ్యాధి ఎకైనొకొకస్ అను వైరస్ వల్ల వస్తుంది. ఇది కుక్కలోని చిన్నప్రేవులలో ఉండి, వాటి గ్రుడ్లు మలవిసర్జనం ద్వారా బయటకు వచ్చి మనుషులు తీసుకునే ఆహరం ద్వారా లోనికి ప్రవేశించి, మెదడు, కాలేయము, ఊపిరితిత్తులలో చేరి కాయల రూపంలో పెరుగుతాయి. ఈ వ్యాధి మనిషి శరీర ప్రక్రియలకు అడ్డుగా ఉండి మనిషి పెరుగుదలను క్షీణింపచేస్తుంది. ఇది కుక్కల మలము ద్వారా వ్యాప్తి చెందుతుంది కావున పరిశుభ్రతను పాటించి, పెంపుడు కుక్కలకు మల పరీక్ష చేసి క్రమం తప్పకుండా టీకాలు వేయించాలి. పరిశుభ్రమైన ఆహరం తీసుకోవాలి.

-సంగనభట్ల రామకిష్టయ్య 9440595494