Others

సాహితీ వందనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలచక్రానికి చీకటి పొర కమ్ముకుని
రచనా వెలుగు దీపం ఆరిపోయింది

తార వెలుగు దివ్వెలై ప్రకాశిస్తుంది గగన దీవిలో
సంద్రపు కెరటాలు వౌనంగా బతుకీడుస్తున్నాయి
మీ పాదం మోపి పునీతం చేయమని..

చీకటిని చీల్చుకుని మరోమారు కదిలి రామ్మా
అక్షరాల తల్లి ఎదురుచూపులో పడింది
కవనం కదిలించి నీరాజనం పలుకుతావని..

రచనలతో జీవితాలు వెలిగించిన సంజీవని అబ్బూరి ఛాయాదేవి
కట్టే కడతేరి తిరిగిరాని లోకానికి తరలిపోయింది

అక్షరాలే అంబరమంత ఎత్తున నిలిపి
దేదీప్యమానంగా నీరాజనాలు పలికించింది

జగమంత సాహితీ కుటుంబం కన్నీటి వీడ్కోలు
పలికి అక్షరాలతో బాధను తిరగరాస్తున్నాయి..

జ్ఞాపకాలు గుండెల్లో పచ్చబొట్టులా ముద్రితమై
రచనలు నడిపించే కాలచక్రంలా మా దరిచేరాయి..
భౌతికానికే మరణం జ్ఞాపకానికి మరణం లేదు

చుట్టూ విషాదఛాయలు పరిభ్రమించే జ్ఞాపకాలు
నన్ను అమాంతం హత్తుకుని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి..

ఈ చీకటి చెరసాల వలయం బంధీ నుండి
మమ్మల్ని విడిపించి మా బిడ్డగా సరస్వతి
రూపంగా మా ఇంట్లో జన్మించు తల్లీ..

- శివేగారి చిన్నికృష్ణ 63003 18230