Others

భలే అందగాడు!.. శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు సినిమా రంగంలో ఎందరో హీరోలు. అద్వితీయమైన నటనను ప్రదర్శించిన వాళ్లు కొందరు. పేరు ప్రఖ్యాతలు గడించిన వాళ్లు ఇంకొందరు. ఆహార్యంలోనూ, వాచకంలోనూ తనకు సాటి లేదనిపించుకున్న వాళ్లు ఇంకొందరు. కానీ అందాల నటుడిగా పేరు తెచ్చుకున్న వాళ్లు మాత్రం బహు కొద్దిమంది. వాళ్లలో ఒకప్పటి హరనాథ్ ఒకరు. పూర్తిపేరు బుద్దరాజు వేంకట అప్పల హరనాథ్ రాజు. విద్యార్థి దశనుంచే నాటక రంగానికి ఆకర్షితుడై, పలు నాటకాలు ప్రదర్శించి బహుమతులు పొంది మంచి నటుడని నిరూపించుకున్నాడు. ఆ రంగంలో సహనటులైన జగపతి రాజేంద్రప్రసాద్, ఏడిద నాగేశ్వరరావు, విజయచందర్, మాడా వేంకటేశ్వరరావులతో కలిసి నాటక ప్రదర్శనలలో పాల్గొనేవాడు. పైలట్ అవ్వాలనే కోరికతో ఇంటర్వ్యూకి వెళ్తూ వాణీమహల్ బస్టాండులో ఎదురుచూస్తున్న సమయంలో ఒక కారు వచ్చి ఆగింది. ఒక నిర్మాత, నటుడు, దర్శకుడు కారు దిగి వచ్చి సినిమాలో నటిస్తావా? అని అడిగాడు. ఆ అడిగిన వ్యక్తి ముక్కామల. ఆ చిత్రం ఋష్యశృంగ. అయితే ఆ చిత్రం తర్వాత వచ్చిన అవకాశంతో చేసిన ‘మా ఇంటి మహాలక్ష్మి’ ముందుగా విడుదలైంది. అప్పటికే హరనాథ్‌గా పరిశ్రమకు పరిచయమైన ఆయన వెనుతిరిగి చూడలేదు. శ్రీకృష్ణుడిగా, శ్రీరాముడిగా, బాలచంద్రుడిగా, మదనకామరాజుగా మరెన్నో సాంఘిక చిత్రాల నాయకుడిగా 117 తెలుగు, 12 తమిళ, ఒక కన్నడ, మరొక హిందీ (హమ్ కహా జారమే హై) చిత్రాల్లో నటించి ఆ కాలంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. కళారంగంలో రాణించాలంటే అందచందాలు, నటనా ప్రతిభ ఒక్కటే సరిపోదు, అందుకు క్రమశిక్షణ కూడా ముఖ్యం. అది కొరవడితే పతనం తథ్యమని భావితరానికి తానే ఒక ఉదాహరణగా మిగిలాడు. సినిమా రంగంపట్ల జీవితాంతం కృతజ్ఞతగా ఉంటానని తరచుగా మిత్రులతో అనే హరనాథ్, నిర్మాతగా ‘మా ఇంటి దేవత’ నిర్మించాడు. కుమారుడు శ్రీనివాసరాజు, అల్లుడు జివి రాజు (పద్మజ భర్త) నిర్మాతలు. హైదరాబాద్ హెచ్‌ఎంటి వాచీల సంస్థ నిర్వహించిన నాటక పోటీల సందర్భంలో హరనాథ్ మాట్లాడుతుండగా తీసిన అరుదైన చిత్రమిది. సెప్టెంబర్ 2 ఈ గ్లామర్ హీరో జయంతిని పురస్కరించుకొని.. మీ కోసం.

-పర్చా శరత్‌కుమార్ 9849601717