Others

క‘బలి’ చేసేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కబాలి కొట్టుకుపోవడానికి సవాలక్ష కారణాల్లో మీడియా ఒకటి అనిపిస్తుంది. వోవరాక్షన్ చేసి కబాలి చిత్రాన్ని ఆకాశానికి ఎత్తింది విజువల్ మీడియా. పట్టుతప్పి నింగినుండి నేలకుపడి కబాలి ముక్కలైతే, భూమిలోకి తొక్కేసిందీ విజువల్ మీడియానే అనిపిస్తుంది. ‘కబాలి’ చిత్ర నిర్మిత సమయం నుంచీ విడుదల వరకూ అత్యుత్సాహం చూపించింది. స్వచ్ఛ్భారత్, బాలకార్మిక వ్యవస్థ, క్యాన్సర్ కారకాలు, సెల్‌ఫోన్ దుర్వ్యసనాలు, ‘నిర్భయను భయపెడుతున్న ఘోరాలు, నిరుద్యోగ సమస్య, కుళ్లు రాజకీయాలు, ప్రపంచ క్రీడల్లో మనమెక్కడ? లాంటి ఎనె్నన్నో సమస్యలపై దృష్టి పెట్టాల్సిన మీడియా -కబాలి సినిమాయే దేశానికి అత్యంత ప్రాధాన్యమన్నంత ఫోకస్ చేసింది. మీడియా అతిగా ఫోకస్ చేయడం వల్ల ప్రేక్షకుల్లో లేనిపోని అంచనాలు పెరిగిపోయాయి. ఉచితంగా వస్తున్న పాపులార్టీ కదా అని భావించి, దాన్ని నియంత్రించడంలో కబాలి టీం కూడా ఉదాశీనంగా వ్యవహరించడం చివరకు కొంప మునిగింది. విడుదల రోజున కంపెనీలు ఉద్యోగులకు సెలవు ప్రకటించాయని, వృద్ధులకు చిత్ర టికెట్లు ఉచితంగా అందించారని, విమాన ప్రయాణయోగం కల్పించడం, నాణేలు ముద్రించడం, ఇన్ని దేశాల్లో ఇన్ని భాషల్లో ఇన్ని థియేటర్లలో విడుదలంటూ లెక్కలు చెప్పడం.. -నిజానికి సినిమా ప్రమోషన్స్‌లో హైప్‌కు మీడియా కాస్త మసాలా అంటించింది. ఫస్ట్‌లుక్స్, టీజర్లు, ఫేస్‌బుక్స్, యూట్యూబ్స్, వాట్సాప్స్, వ్యూస్, స్పెషల్ ఇంటర్వ్యూలు, ట్రయల్స్ రిలీజ్‌లాంటి ‘పిచ్చి’ ఎలాగూ అన్ని వుడ్‌లలో ముదిరిపోయింది. ఆ వింతలు, విడ్డూరాలను అతిగా సామాన్యులకు తెలియచేయాల్సిన అవసరం ఉందా? అంతగా వాటికి మీడియా ప్రాధాన్యత ఇవ్వాలా? అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న. ‘కబాలి’ని ఎవరెస్ట్ శిఖరంపై కూర్చోబెడితే, ఆ శిఖరాన్ని చూపించి వ్యాపారులు తెలివిగా క్యాష్ చేసుకున్నారు. శిఖరం నుంచి ‘కబాలి’ కిందపడి ఫ్లాపైతే ఒక్కరూ కనిపించడం మానేశారు. కారణాలు విశే్లషించడం మానుకున్నారు. ‘కబాలి’ మాత్రమే మెగా చిత్రమైనట్టు తెగ హంగామా చేశారు. అసలు మన చిత్రాలకు అంత సీన్ అవసరమా? విడుదల ఫంక్షన్లు, ఆడియో ఫంక్షన్లు, విజయోత్సవ ఫంక్షన్లు, ఇతర కళాకారులతో చిత్రం గురించి డబ్బా కొట్టించడాలు అవసరమా? ఎవరెన్ని డబ్బాలు వాయించినా, ప్రేక్షకుల తీర్పునకు కట్టుబడక తప్పదు. చిత్రంలో సత్తావుంటే ప్రేక్షకులే నీరాజనం పలుకుతారు. వసూళ్లవాన కురిపిస్తారు. మీడియా ఊదరగొట్టడం వల్లే ‘కబాలి’ కనుమరుగయ్యాడు. అతికి ఫుల్‌స్టాప్ పెట్టి సినిమాను సినిమాగా విశే్లషిస్తే -ప్రేక్షకులకే కాదు, పరిశ్రమకూ మేలు చేసినట్టే.

-మురహరి ఆనందరావు