Others

అక్షరాల బాటలో అస్మా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘నువ్వు బడికెళితే..పిల్లల్ని ఎవరు చూస్తారు? హైదరాబాద్ నగరంలో తొమ్మిదేళ్ల అస్మా అనే చిన్నారికి ఎదురైన ప్రశ్న. తొమ్మిదేళ్ల ప్రాయంలో ఏ చిన్నారైనా ఆడుతూ..పాడుతూ గెంతులేస్తూ స్కూలుకు వెళుతుంది. కాని అస్మాకు అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే అమ్మానాన్న రోజూ కూలీకి వెళతారు. ఇంట్లో ఆమెకన్నా చిన్నవారైన ముగ్గురు తోబుట్టువుల ఆలనాపాలనా ఈ తొమ్మిదేళ్ల అస్మా చూసుకోవాలి. పసిప్రాయంలోనే మానసిక పరిపక్వత సంతరించుకున్న అస్మా నిద్రలేవటంతోనే ఇంటి పనుల్లో తలమునకలవుతోంది. ప్రతిరోజూ ఉదయమే లేచి అన్నం వండి తన చిట్టి చెల్లెళ్లకు, తమ్ముడికి పెడుతోంది. అమ్మవచ్చేసరికి ఇంటి పనంతా చేసిపెడుతోంది. మరి ఇక ఆ చిన్నారి స్కూలుకు ఎలా వెళుతుంది. ఇలాంటి పరిస్థితులలో మగ్గిపోతున్న అస్మాకు చిరు ఆశ రగిల్చింది సర్వశిక్షా అభియాన్. తెలంగాణ రాష్ట్రంలో సర్వశిక్ష అభియాన్ కార్యక్రమం కింద 12 గంటల పాఠశాలలను నడుపుతున్నారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 7గంటల వరకు బాలాపూర్‌లో ఈ పాఠశాల నడుస్తోంది. ఇక్కడ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇస్తారు. ప్రతిరోజూ అస్మా ఆ వీధి వెంట వెళుతూ.. ఆ స్కూలు వైపు ఆశగా చూస్తుంది. కాని లోనికి వెళ్లలేదు. ఇది గమనించిన సర్వ శిక్ష అభియాన్ కో-ఆర్డినేటర్ ప్రశాంతి భటినా ఓరోజూ వీధివెంట వెళుతుండగా.. అస్మాను స్కూల్లోకి పిలిచి ఆ చిన్నారి పరిస్థితిని ఆరా తీసింది. ఆమె తల్లిని పిలిపించి కౌనె్సలింగ్ ఇప్పించింది. దీంతో చిన్నారి ఆస్నాను స్కూలుకు పంపేందుకు తల్లి అంగీకరించింది. అంతేకాదు అస్మాతో పాటు మిగిలిన తోబుట్టువులను చిల్డ్రన్స్ డే కేర్ సెంటర్‌కు రప్పించే ఏర్పాట్లు చేశారు. ఇపుడు అస్మా చక్కగా చదువుకుంటుంది. ఆమె తోబుట్టువులు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎదుగుతున్నారు.