AADIVAVRAM - Others

రంగుల లోగిలిలో ‘మీనియేచర్’ ముగ్గు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త తరం చిత్రకారిణి ప్రియాంక ఏలే. సరికొత్త ‘సబ్జెక్ట్’తో, భావ వ్యక్తీకరణతో, రంగుల పొంగులతో హద్దులను చెరిపేస్తూ ఆమె దూసుకుపోతున్నారు. తెలుగు నేలపై ఇప్పుడు ఓ రంగుల సమీరం వీస్తోంది. సృజనాత్మకత - కళాత్మకత కళ్లకు కడుతోంది. ప్రియాంక ఏలే కుంచె ఓ కొత్త రంగుల సమీకరణాన్ని కాన్వాసుపై ప్రదర్శిస్తోంది. ఆమె పెన్ను సైతం పరవశింపజేసే ఆకృతులను కాగితంపై అద్దుతోంది, అద్భుతాలను ఆవిష్కరిస్తోంది.
ఎవరీ ప్రియాంక ఏలే?.. అవును, ఎవరీమె?.. అన్న ప్రశ్న కొందరిలో తలెత్తవచ్చు. పూర్వపు నల్లగొండ జిల్లా కదిరేనిగూడెంను కాన్వాసుపైకి తీసుకొచ్చి, ‘ఆర్ట్ లవర్స్’ గుండెల్లో తెలంగాణ మహిళల రూపాన్ని, సంస్కృతిని సంప్రదాయాల్ని ముద్రించిన చిత్రకారుడు లక్ష్మణ్ ఏలే కుమార్తె ప్రియాంక. అయితే తండ్రి గ్రామీణ వాతావరణాన్ని - అక్కడి జీవన విధానాన్ని రంగులు - రేఖలతో దేశవ్యాప్తం చేయగా ప్రియాంక మాత్రం వర్తమాన 21వ శతాబ్దపు ఆలోచనలకు, అభిప్రాయాలకు, సృజనకు, కళలకు స్పందిస్తూ తనదైన సరికొత్త శైలితో చిత్రకళ ప్రపంచంలో ఆకట్టుకుంటున్నారు.
ఆమె మీనియేచర్ (సూక్ష్మచిత్రకళ)ను ఎక్కువ ఇష్టపడతారు. భారతీయ చిత్రకళలో ఒకప్పుడు ఈ శైలి చిత్రలేఖనం ఎక్కువగా కనిపించేది. ముఖ్యంగా మొఘలుల కాలంలో దీనికి ఎక్కువ ఆదరణ కనిపించింది. రాజస్థానీ, పహాడీ మీనియేచర్ శైలి సైతం ప్రాచుర్యం పొందింది.
ఈ మూల భావనను ప్రియాంక ఏలే తనదైన సబ్జెక్టుకు అన్వయించి ఓ ప్రత్యేక ‘చిత్రఝరి’కి ఆయువు పోశారు. ఇందులో కొంత సంప్రదాయ మీనియేచర్ ‘మోటిల్స్’ దర్శనమవుతాయి. ముఖ్యంగా ‘పులి’ ఆమె అనేక చిత్రాల్లో కనిపిస్తుంది. ఒక్కోసారి ఆ పులి గిరిజన సంప్రదాయంలో, మరోసారి బాలలు వేసిన చందంగా, ఇంకోసారి నైరూప్యంలో దర్శనమిస్తుంది. ఒక ఫ్రేమ్‌లో వలయాకారంలో ఒకదాని వెనుక ఒక పులి తిరుగుతున్న దృశ్యం కనిపిస్తుంది. నేపథ్యంలో అడవి కాని అడవి ఆకుపచ్చ రంగులో ఆవిష్కృతమవుతుంది. అందులో ఇంకా అనేక పక్షులు, లతలు, పూలు పరచుకుని ఉంటాయి. ఇలా కవితాత్మకంగా రంగులను కాన్వాస్‌పై ‘స్ట్రోక్స్’ రూపంలో చూపుతారు.
మరో పెయింటింగ్‌లో పులి - చెట్టు - కుక్క - కుర్చీ.. ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్నా, వాటన్నింటి మధ్య ఒక ‘సూత్రం’ బలంగా ఉందని అంటారు. కుర్చీ - కుక్కను తీసుకుంటే అది అధికార - ఆధిపత్య భావనకు చిహ్నమని అంటారు. ఇలా ఎన్నో సంకేత ఆకృతులను కాన్వాసుపై పేర్కొంటారామె. నేపథ్యంలో తిరిగి పొదలు, చెట్లు, పూలు, తీగలు, పక్షులు, సూక్ష్మజీవులు, సీతాకోక చిలుకలు కనిపిస్తాయి. ఆ రకంగా తనకు ప్రకృతి అంటే ఎంతో ఇష్టమని చాటి చెబుతున్నారు. ఈ ప్రకృతిని కలుషితం చేయరాదన్న సందేశం సైతం కొన్ని బొమ్మల్లో వ్యక్తం చేశారు. ఆ వ్యక్తీకరణ తిరిగి సృజనాత్మకంగా, కళాత్మకంగా, సంకేతంగా ఉండటం వల్ల ఆ బొమ్మలు ఆకట్టుకుంటాయి.
ప్రియాంక మరో ప్రత్యేకత ఏమిటంటే ఆమె ఎక్కువగా సర్క్యులర్ కాన్వాస్ (వృత్తాకార కాన్వాసు)ను ఉపయోగిస్తారు. ఈ వృత్తం అనంతానికి, విశ్వానికి చిహ్నమని ఆమె భావిస్తున్నారు. ఈ సర్క్యులర్ కాన్వాసుపై వేసిన చాలా బొమ్మల్లోనూ ‘పులి’ దర్శనమిస్తుంది. వేట - వేటగాడు కనిపిస్తాడు. పూలు, మొక్కలు, పక్షులు, జంతువులు, జలచరాలు సైతం అగుపిస్తాయి. గుర్రాలు, మేకలు, ఏనుగు తలలు కూడా ఆమె కుంచె నుంచి తొంగి చూస్తాయి. అర్బన్ ఆలోచనలు, ఆధునిక జీవనం గడిపే ప్రియాంక మనసు నిండా ‘్ఫ్లరా-్ఫనా’ (పూలు, లతలు, పక్షులు, కీటకాలు) ఉండటం ఓ జెక్స్‌స్టా పొజిషన్ అని భావించవచ్చు. చిత్రకళ నిండా ఈ జెక్స్‌స్టా పొజిషన్ విధానం గుర్తింపు తెస్తుంది. సృజనను - నవీనతకు అద్దం పడుతుంది. ఆ రకంగా జీవితంలోనూ - కళలోనూ, కలల్లోనూ రంగుల వసంత మాడుతోందామె.
ఈ వైవిధ్యభరిత, వినూత్న, వివిధ మాధ్యమాల్లో చిత్రరచన చేస్తున్న ప్రియాంక ఏలేకు గత సంవత్సరం ఫ్రాన్స్‌లోని ‘బోర్డెక్స్’ నగర సందర్శనకు ఆహ్వానం లభించింది. హైదరాబాద్ నగరంలోని కళాకృతి ఆర్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘కల్చర్ ఎక్స్చేంజి (రెసిడెన్సీ ప్రోగ్రాం) కార్యక్రమంలో భాగంగా ఆరు వారాల పాటు ఆమె అక్కడ గడిపారు. ఆ కొత్త వాతావరణంలో తనదైన నైపుణ్యాన్ని ప్రదర్శించి కొన్ని చిత్రాలను గీశారు. అక్కడి బేకరీ పేపర్‌పై సరికొత్త అందాలను సౌందర్యరాశిని పోగేసి ఫ్రాన్స్ దేశస్థులకు చూపారు. ఈ సరికొత్త ప్రయోగం ఆమెకెంతో పేరు తీసుకొచ్చింది. వర్తులాకారంలో ఉండే ఈ అలంకృత బేకరీ పేపర్‌పై టెక్చర్‌లైట్, అక్రిలిక్, వాటర్ కలర్స్‌తో సరికొత్త ప్రయోగం చేశారు. వీటిలో తిరిగి భారతీయ ‘మీనియేచర్’ బొమ్మలు జత చేయడంతో ఫ్రాన్స్ - భారత్‌ల చిత్రకళ, సంయోగం (్ఫ్యజన్) జరిగింది. ఈ ప్రత్యేక బొమ్మలను ‘బోర్డెక్స్’లోనే గాక హైదరాబాద్‌కు తిరిగొచ్చాక కళాకృతి ఆర్ట్ గ్యాలరీలోనూ ప్రదర్శించారు. ఆధునిక చిత్రకళకు.. కళలకు, సంగీతానికి చిరకాలంగా ఎంతో గుర్తింపుగల ఫ్రాన్స్‌లో తెలుగు బిడ్డ బొమ్మలు ప్రదర్శితమై తెలుగు గడ్డపై వాటిని తిరిగి ప్రదర్శించడం అపురూపమైన విషయమే!
కొత్త తరానికి ప్రాతినిధ్యం వహించే ప్రియాంక ఏలే హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. జూనియర్ కాలేజీ విద్య ముగిశాక 2007 సంవత్సరంలో ఆమె జెఎన్‌టియూలో బిఎఫ్‌ఏలో చేరారు. అక్కడ ప్రాథమిక చిత్రకళ పాఠాలతోపాటు ‘హిస్టరీ ఆఫ్ ఆర్ట్’ తెలుసుకున్నారు. పాశ్చాత్య దేశాల్లో చిత్రకళా రంగంలో వచ్చిన ఉద్యమాలు ఆమెకు స్ఫూర్తినిచ్చాయి. ముఖ్యంగా పికాసో పనితనం తన మనసుకెంతో నచ్చుతుందంటారామె. అలాగే భారతీయ చిత్రకళ చరిత్రను అధ్యయనం చేశామని, ఇందులో ‘మీనియేచర్’ చిత్రకళ తనకి ఇష్టమన్నారు. బిఎఫ్‌ఏలో అలా మీనియేచర్‌కు ఆకర్షితురాలైన ప్రియాంక అనంతరం ఆ శైలిని తనదైన పద్ధతిలోకి అన్వయించుకుని బొమ్మలు గీస్తున్నారు. ముఖ్యంగా మొఘల్, పహాడీ మీనియేచర్ చిత్రకళను పరిశీలించి వర్తమాన పరిస్థితికి, సబ్జెక్టుకు అనుగుణంగా మలుచుకుంటున్నారామె.
2011 సం.లో బిఎఫ్‌ఏ పూర్తయ్యాక ఆమె హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఎంఎఫ్‌ఏ చేశారు. దాదాపు దశాబ్ద కాలంలో ‘ఆయినా’ (అద్దం) పేర తన తొలి సోలో చిత్ర ప్రదర్శనను కళాకృతి ఆర్ట్ గ్యాలరీ (2012)లో నిర్వహించారు. ఆ తరువాత కోల్‌కతా, ముంబై, ఢిల్లీ, అమెరికా, ఇటలీ, యూరప్‌లోని కొన్ని దేశాల్లో తన చిత్రాలను ప్రదర్శించారు. అనేక గ్రూప్ షోలలో పాల్గొన్నారు. మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అఖిల భారత చిత్రకళా పోటీల్లో బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. స్టేట్ ఆర్ట్ గ్యాలరీ నుంచి అవార్డు అందుకున్నారు.
ఈ ప్రస్థానంలో భాగంగా ఆమె స్ర్తివాద చిత్రాలను కొన్ని గీశారు. ముఖ్యంగా మెక్సికన్ మహిళా చిత్రకారిణి, స్ర్తివాద, విప్లవకారిణి ఫ్రిదక్‌హలో జీవిత చరిత్ర చదివి, మరింత అధ్యయనం చేసి ప్రియాంక తన ఎంఎఫ్‌ఏలో ఆమెపై ‘్థసీస్’ సమర్పించారు. కొత్తతరం చిత్రకారిణులకు స్ఫూర్తినిచ్చే ఆమె జీవితం నుంచి తానెంతో నేర్చుకున్నానని, ఆ ప్రభావంతో కొన్ని చిత్రాలు గీశానని ప్రియాంక చెప్పారు. అలాగే పెన్ అండ్ ఇంక్‌తో అనేక చిత్రాలు గీశానని అవి కూడా మీనియేచర్ శైలిని తలపిస్తాయని ఆ విధంగా మీనియేచర్ మాధ్యమం తనపై గాఢంగా ముద్ర వేసిందంటున్నారు.
ప్రస్తుతం ప్రియాంక ఏలే విదేశీ భాషల అధ్యయన సంస్థ ‘ఇఫ్లూ’ (తార్నాకలో ఉన్న విద్యాసంస్థ)లో ‘్ఫలిం స్టడీస్, విజువల్ కల్చర్’లో పిహెచ్.డి చేస్తున్నారు. ఇందులో చిత్రకళ, భాషలు, తదితర అంశాలపై పరిశోధిస్తున్నానని ఆమె చెప్పారు.
ఇంత చిన్న వయసులో ఎనె్నన్ని పెద్ద పనులో...

ప్రియాంక ఏలే.. 9985607292

-వుప్పల నరసింహం 9985781799