Others

పూర్ బేబీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో బీరువా సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన సురభికి -ప్రాజెక్టు మంచి పేరు తెచ్చినా బ్రేక్ మాత్రం ఇవ్వలేకపోయింది. తరువాత తెలుగులో ఒకటో రెండు చాన్స్‌లు దక్కినా -వావ్ అనిపించుకునే టైం కలిసిరాలేదు. ఈమెతో తెరగేట్రం చేసిన హీరోయిన్లు రేంజ్ పెంచుకుంటే -అందగత్తె సురభి మాత్రం ఎక్కడో ఉండిపోయింది. కొద్దిరోజుల క్రితమే నాని జెంటిల్‌మన్‌లో మంచి పాత్ర చేసినా -పేరు మాత్రం మరో హీరోయిన్ నివేదా థామస్ తన్నుకుపోయింది. మళ్లీ చాన్స్ కోసం సురభి -ఎదురు చూపులు మొదలయ్యాయి. అన్నీ పుష్కలంగానే ఉన్నా అవకాశాలు దూరంగా ఉండిపోతుండటంతో -తోటి హీరోయిన్లతో పోటీ పడేందుకు ‘గ్లామర్’ ద్వారాలు తెరవడానికి రెడీ అంటూ సంకేతాలిస్తోందట. హీరోయిన్లు గ్లామర్ డాళ్స్‌గానే కనిపించాల్సి వస్తున్న తరుణంలో -కెరియర్‌ను ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని హద్దులు చెరిపేయక తప్పదు. కాకపోతే, సురభి ఆ పని కాస్త ఆలస్యంగా చేస్తోంది.