Others

డైరెక్టర్స్ ఛాయిస్.. కళాత్మక చిత్రాలవైపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-కెఎన్‌టి శాస్ర్తీ
సమాంతర సినిమావైపు దృష్టి సారించి చిత్రాలు రూపొందించే దర్శకులు అరుదు. అలాంటివారిలో కెఎన్‌టి శాస్ర్తీ ఒకరు. సురభి కళాకారులపై తొలిసారిగా షార్ట్ ఫిల్మ్ రూపొందించిన ఆయన ఆ తరువాత ఆరు జాతీయ అవార్డులు, నాలుగు నంది అవార్డులు, మూడు అంతర్జాతీయ అవార్డులతోపాటుగా రెండు స్వర్ణ కమలాలను అందుకుని దర్శకుడిగా తన సత్తా నిరూపించారు. ఆర్ట్ ఫిల్మ్‌లంటే ఇష్టమని చెప్పే శాస్ర్తీ, ఆ కారణంగానే కమర్షియల్ చిత్రాలవైపు రాలేకపోయానని అంటున్నారు. ఈ వారం ఆయనతో చిట్‌చాట్..
మీ నేపథ్యం?
కర్నాటక కోలార్ జిల్లాలో పుట్టి పెరిగిన నేను మైసూరు యూనివర్శిటీలో ఇంగ్లీష్ లిటరేచర్ మాస్టర్ డిగ్రీ చేశా.
దర్శకుడు అవ్వాలనే కోరిక?
జర్నలిస్టుగా పని చేస్తూ సినిమా సమీక్షలు రాసే నాకు పనోరమ జ్యూరీ సభ్యుడిగా అవకాశం వచ్చింది. అక్కడ ఓ మంచి కథ దొరకడంతో సినిమా దర్శకుడు అవ్వాలన్న కోరిక పుట్టింది.
దర్శకుడిగా సంతృప్తినిచ్చిన చిత్రం?
నందితా దాస్‌తో తీసిన కమిలి, తిలదానం, ఇప్పుడు రూపొందిస్తున్న లక్షు చిత్రం షాను.
ఇష్టమైన జోనర్?
సమస్య లేదు. ఆర్ట్ ఫిల్మ్‌లంటే చాలా ఇష్టం. నా చిత్రాలన్నీ అలానే ఉంటాయి. అందుకే కమర్షియల్ చిత్రాలవైపు రాలేకపోయాను. అయితే, ఎవరి వద్దా లేనన్ని అవార్డులు నా దగ్గర ఉన్నాయి.
హారర్, లవ్ జోనర్లపై అభిప్రాయం?
ఇప్పుడున్న దర్శక నిర్మాతలు వాళ్లకు నచ్చిన విధంగా వాళ్ల వాళ్ల పరిధిలో చేస్తున్నారు. దాదా సాహెబ్ ఫాల్కె అవార్డు అందుకున్న ఆదూరు గోపాలకృష్ణన్ ఇప్పటి వరకూ 8 చిత్రాలే తీశారు. అది, ఎవరి అభిరుచిని బట్టి సినిమా జోనర్ ఉంటుంది. అంతే.
పరిశ్రమలో సమస్యలు?
థియేటర్ల మీద మాఫియాలాంటి నిర్మాతలు కబ్జా చేసుకుని కూర్చున్నారు. నాలాంటి వాళ్లకు అసలు థియేటరే దొరకదు. మాలాంటి వాళ్లు తీసిన చిత్రాలు ఏవో ఫెస్టివల్స్‌లో చూపుకోవాలి.
దర్శకుడు అంటే?
సినిమా గురించి ప్రతి విషయం తెలిసిన వాడు. తనకంటూ ఓ అభిరుచి ఉన్నవాడు.

-శేఖర్