Others

చక్కని చుక్క!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాంచి జోరుమీదుంది -తెలుగు తూనీక రీతూ వర్మ. హీరోయిన్‌గా ఎప్పుడో ఎంట్రీ ఇచ్చినా, ఒక్క ‘పెళ్లిచూపులు’తో హిట్ కొట్టి హీట్ పెంచేసింది. ఊపుమీదున్న హీరోయిన్లకు సరిసాటినన్న స్టార్ ఇమేజ్ తెచ్చేసుకుంది రీతూ. సహజంగానే -్భమ ఫ్లాట్‌ముందు అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఒకటో రెండో కాదు -అరడజను ప్రాజెక్టులు ఆమె ‘యస్’ కోసం ఎస్టార్ట్ మాదిరి అలెర్ట్‌గా ఉన్నాయట. రీతూ కథ రసకందాయంలో పడటం వరకూ బాగానే ఉంది. కానీ -ముందు కమిటైన ప్రాజెక్టుల దర్శక నిర్మాతలకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయట. కారణం -అమాంతంగా పెరిగిన క్రేజ్‌కు తగినట్టు అంతే వేగంగా రేటు (రెమ్యూనరేషన్) పెంచేసి, అడిగినంత ఇస్తారా చస్తారా అంటూ పిల్ల పట్టుబడుతుందని గగ్గోలు పెడుతున్నారు. సరేనని ఒప్పుకుందామన్నా -ఆ ప్రాజెక్టుల్లో పెద్ద హీరోలను పెట్టుకోండంటూ మరో బ్రేక్ వేస్తోందట. లేదంటే ‘నో’ అంటోందని దర్శక నిర్మాతలు తలలు కొట్టుకుంటున్నారు. ఒక్క హిట్టుకే ఇంత బెట్టుచేస్తే.. రెండు మూడు హిట్లు వరసనే పడితే పట్టుకోగలమా? అన్న సందేహాలు ఇప్పటినుంచే ముసురుతున్నాయి. అఫ్‌కోర్స్, రీతూ వరకూ అది వేరే విషయం. హిట్టు పడినప్పుడే -క్రేజ్‌ని క్యాష్ చేసుకోవాలనుకోవటం తప్పుకాదుగా. అందుకే -గో ఎహెడ్ రీతూ .