Others

ఒక్క ఆలోచన !

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒక్క ఆలోచన ఉంటే చాలు
దేనినైనా సాధించవచ్చు.
సంతోషాన్ని, డబ్బును, కీర్తిని కూడా సంపాదించవచ్చు.
ఎలా అంటారా.. చూడండి...
చెట్లు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు కదా. రంగు రంగుల పూలు
కమ్మని కమ్మని వాసన లిచ్చే ఆకులు.. ఇలా ఇంత చాలు...
మనం రోజు చేసే పని చేసేయొచ్చు. అందులోనే కాస్త రిలాక్స్‌పొందొచ్చు.
అవసరాలకు డబ్బు కూడబెట్టుకోవచ్చు.
పొద్దునే్న చెట్ల మధ్య గడపడం అంటే చాలా ఇష్టం కానీ ఎక్కడ మేము ఉండేది అపార్ట్‌మెంట్ అంటారా... మరేం ఫర్లేదు
ఎక్కడ ఉంటే అక్కడే బృందావనం...
ఇంటి పైన ఉండే స్థలంలో చక్కని చిక్కని ఆకుకూరలను చిన్న చిన్న కాయకూరలను పండించుకోవచ్చు. బోన్సాయి మొక్కలూ పెట్టుకోవచ్చు. రకరకాల పూల మొక్కలు పెంచేసుకోవచ్చు.
ఇపుడు రకరకాల రంగులు, మంచి సువాసనలిచ్చే ఆకులుండే చెట్లు ఎక్కువ మంది పెంచుతున్నారు. వీటిని సలాడ్స్‌లో పైన అలంకరిస్తే చూడడానికి తినడానికి ఎంతో బాగుంటాయి. మీకిష్టమైతే వీలునుబట్టి వీటిని పెద్ద మొత్తాల్లో పండించి మార్కెటైజ్ చేసుకోవచ్చు. వీటిని కొనేవారు ఎక్కువమందే ఉన్నారు. మార్కెటింగ్ ఈ సలాడ్ ఆకులకు ఎక్కువనే చెప్పుకోవచ్చు.
అంతొద్దు అనుకున్నారా.. చక్కగా కంటికి ఇంపుగా పెంచుకోండి. మీరు తినే పదార్థాల్లో అంటేకూరల్లో సాంబారులో, పచ్చడ్లలో ఉపయోగించుకోండి. లేదా రోజు మొలకెత్తిన గింజలతోపాటు ఈ ఆకులను కలుపుకుని తినండి. అటు ఆనందమే కాదు ఇటు ఆరోగ్యమూ మీ సొంతం. మీరు బ్యూటీ పార్లర్‌కు వెళ్లకుండానే మీ ముఖం కాంతులీనుతుంది. ఈ ఆకులను ఉపయోగించి ఫేస్ ప్యాకులు తయారు చేసుకోవచ్చు.
ఇక పూల సంగతి మీకు చెప్పనక్కర్లేదు. దొండ, చిక్కుడు లాంటి తీగచెట్లును డాబాలపైన ఎంచక్కా పెంచుకుంటే ఎంతో పంట చేతికి వస్తుంది. మనకిష్టమైన వారికి ఇవ్వచ్చు. మనం తినొచ్చు. వీటిని కూడా మార్కెట్ సదుపాయాలను ఉపయోగించు అమ్మకాలు సాగించవచ్చు.
వీటిని వర్షాకాలంలో సులభంగా పెంచుకోవచ్చు. కానీ ఎండాకాలం రాగానే ఎండిపోతాయి. అందులో డాబాలపైన అనుకోకండి.
ఆ మొక్కలను కాపాడానికి పరదాలు ఉండే గ్రిల్స్ దొరుకుతున్నాయి. రకరకాల సైజుల్లోదొరికే వాటిని తెచ్చుకుని వాటిని అమర్చుకుంటే ఈ మొక్కలకు ఎంత ఎండ కావాల్సి ఉంటే అంతే అందీయవచ్చు.
అందుకే అన్నారు మనసుంటే మార్గం ఉంటుందని. చిన్న చిన్న కుండీల్లోనే పచ్చి మిరప, టమాట, వంకాయ, బెండ లాంటి కాయకూరలను సులువుగా పెంచుకోవచ్చు. వాటి ఫలాలను అందుకోవచ్చు.
రోజూ ఒక అరగంట మొక్కల కోసం కేటాయిస్తే నీళ్లు పోయడం, ఎరువులు వేయడం , పూలు, పండ్లు కోయడం లాంటివి చేస్తే అటు మనసుకు ఆహ్లాదం. ఆ తరువాత సాయంత్రం ఆఫీసుల నుంచి వృత్తి వ్యాపారాల నుంచి ఇంటికి వచ్చిన తరువాత కాసేపు మొక్కల మధ్య గడపితే రిలాక్స్ కోసం ఇంకేమీ చేయనక్కర్లేదు. అపుడు చికాకులు సీమ టపాకాయలు దూరం అయిపోతాయి. ఇంటి సభ్యులందరూ మానసిక వికాసంతో ఒకరికోసం ఒకరుగా ఉండడానికి కూడా ఈ మొక్కల పెంపకం ఉపయోగపడుతుందని మానసిక వైద్యులు అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం పట్టండి కుండీ , మట్టీ, నీరు...

- లక్ష్మీ ప్రియాంక