Others

చెత్త సేకరణకి రోల్స్‌రాయ్స్ కార్లా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజు తల్చుకుంటే దెబ్బలకి కొదువా?’ అంటారు. రాజస్థాన్ సంస్థానాధీశులలో ఒకడయిన ఆల్వార్ మహారాజు జైసింగ్‌కి లండన్‌లో 1920లో ఒక తీరని అవమానం సంభవించింది. రాజుగారు సీదా సాదా దుస్తులలో, లండన్ వీధులలో తిరుగాడుతూ రోల్స్‌రాయ్స్ మోటారు శకటాల షోరూమ్ ముందు ఆగి లోపలికి తొంగిచూశాడు. రేటు వగైరా కనుక్కుందాం అన్నట్లు లోపలికి నడిచి- ‘‘అబ్బాయ్! ఈ కారు వెల ఎంతుంటుందీ?’’ అని అడిగాడు. సేల్స్‌మ్యాన్ రుూ సామాన్యుడి మొహంలోకి - ‘‘మొహం కడుక్కునే వచ్చావా? ఏవూరు మనది?’’ అన్నట్లు చూశాడు. నిజానికి కోట్ల రూపాయల ఖరీదయిన రోల్స్‌రాయ్స్ కార్లను కొంటే- ఇండియన్ మహారాజాలే కొనాలి. ఐతే సేల్స్‌బోయ్ రుూ కిరీటం లేని రాజుగార్ని ‘‘కొన్న మొహమేలే నీది? బయటకు నడూ’’ అన్నాడు.
హోటల్‌కి వచ్చి, తక్షణం- ‘‘ఎవరక్కడ?’’ అని అరిచాడు రాజు జైసింగ్ మహారాజులుంగారు. ‘‘రోల్స్‌రాయ్స్ షోరూమ్‌లో ఎన్ని కార్లున్నాయో, అన్నీ జైసింగ్ మహారాజులవారు కొనుగోలు చేస్తున్నారని, ఆ కంపెనీ యాజమానికి కబురుపెట్టు’’ అంటూ, సకలాభరణాలూ, కిరీటం కత్తీ వగైరా ధరించి షోరూమ్‌లోకి వెళ్లాడు.
ఇంకేముంది? ఆరు కార్లున్నాయి. ఆ అరడజను కార్లూ కొనేసి, అణాపైసలతో సహా చెల్లించి ‘‘స్టీమర్ ఎక్కించండి’’ అంటూ బుసలు కక్కుతూ, మందీ మార్బలంతో వెళ్లిపోయాడు రాజు.
ఇండియా వస్తూనే- రుూ ఆల్వార్ ఢిల్లీకి 150 మైళ్ల దూరంలో వుంటుంది. పెద్ద పట్టణం. సంస్థాన ముఖ్యనగరం కదా? ఒరేయ్! ఈ ఐరావతాల్ని అనగా రోల్స్‌రాయ్స్ కార్లని - మునిసిపాలిటీ వాళ్లకి పంపండి. వీధులూడ్చి, చెత్త తీసుకురావడానికి వాడుకోమనండి’’ అంటూ హుకుం జారీచేశాడు.
మనం హైదరాబాద్‌లో యివాళ చెత్తల మోటారు వ్యాన్‌లు- దాని మీదకు చెత్తనెక్కించే జంటల్నీ చూస్తున్నాం. కానీ 1920లోనే ఇండియాలో రాజులు రోల్స్‌రాయ్స్‌నే చెత్తల బండ్లగా వాడేశారు! దెబ్బకి రోల్స్‌రాయ్స్ కంపెనీవాళ్లు లబోదిబోమంటూ ఇండియాకి వచ్చి ‘‘అయ్యా! మరో ఆరు కార్లు ఉచితంగా ఇస్తాం. కేవలం కోటీశ్వర్లు మాత్రమే డోర్ తెరిచి ఎక్కే మా కార్లకి యింత ‘‘చెత్త శిక్ష వేశారు? క్షమించి మీ శిక్షను వాపసు తీసుకోండి’’ అని వేడుకున్నారుట. నమ్మూ నమ్మకపో.. అదీ సంగతి.!