Others

‘లంబోదరా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూషికమెక్కి మహిలో యింటింటికి వెళ్లి
ప్రమోదాన్ని యివ్వాలని వస్తున్నావా
మోదకప్రియా, ఓ బొజ్జ గణపయ్యా

వెండి, బంగారు గణపతులు కొందరు
కృత్రిమ రంగులొద్దు, నకిలీలు వద్దు
పుడమి తల్లి యిచ్చిన మట్టితో చేసిన కమనీయ విగ్రహం నీది

దూర్వాయుగ్మాలు, పత్రి పుష్పాలు
అరటి, వెలగ, నేరేడు- అనేకమైన ఫలాలు
నారికేళాలు, ఉండ్రాళ్ళు, మోదకాలు
మా శక్తి ధారపోసి, నిన్ను పూజించి, నీ కీర్తి పాడేము

గిరితనయా, శివాంతరంగా
భాద్రపద చవితి చంద్రుని చూడ నీ పాదాలు తాకేము
అన్నిటికీ ఒజ్జవైన ఓ ఏకదంతా
మా బాధలు దంత వేదాంతాలు కావు

ఇటు కుల విచక్షణ, మత భేదాలు
దొంగతనాలు, దోపిడీలు
అక్క, చెల్లెళ్ళమీద అనుకోని వేధింపులు
మనిషి నీడన మరో మనిషి మనుగడ కుదరడంలేదు
నీవు దిక్కై వుంటావని వేచి వున్నామయ్యా గజకర్ణకా

చదువు, సంధ్యలకు, పెళ్లి పేరంటాలకు
సౌభాగ్యసిద్ధికి, ఆయురారోగ్యాలకు నిలయుడవు నీవు
తృప్తినివ్వు తండ్రీ తపన పోనివ్వు
కలవరం పోనిచ్చి, కలలు పండించు
నీ దయవల్ల ఈ దేశం కావాలి ఒకరికొకరం
సుజల, సుఫలగా నిలవాలి నిరంతరం
మా సంకల్పబలం నీ వ్రతఫలం
ఉద్యాపనానంతరం గంగమ్మ ఒడిలోకి వెళ్ళి
అమ్మదగ్గరికి చేరుకుంటావు
నీ రాకకై నిత్యపూజలు చేసి మరుయేటి పూజకై వేచి వుంటాం.

- ఎ.ఎస్.ప్రభాకర్