AADIVAVRAM - Others

మధ్యతరగతి కేక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీతగాన్ని
మధ్యతరగతి వాణ్ణి
ఏముందని నా చేత
వెనకేసుకోడానికి
*
కరెంటు బిల్లు
సెల్‌ఫోన్ బిల్లులు
ఇంటి బాడుగకే
సగం జీతం గోవిందా
*
ఇంటి ఖర్చులు
ప్యాకెట్‌మనీ తదితరాలకు
ఉన్నదే సరిపోదు
ఇంకేం మిగులుతుంది?
*
ఖర్చులు బండెడు
ఆదాయం బెత్తెడు
ఇదే కదా
మా జీవన చిత్రం!
*
చట్రంలో మా బతుకు
చతికిలపడింది
గంగిరెద్దులా
తిరుగుతోంది
*
నా తరమా ఈ సాగరమీదగ
నళినదళేక్షణ రామా
అంటూ దీనంగా పాడుకుంటూ
బతుకుబండి నడుస్తోంది
*
ఎవరు పడేస్తారు
ఒడ్డున
ఆపన్న హస్తం
ఎవరు అందిస్తారు?
*
జీతం పెరుగుతుందా అంటే
కాగడా వేసి వెదకినా
ఆ ఆశ
కనిపించదు
ఉచితమని ఊదరగొడతారు
కోట్లు కుమ్మరిస్తారు
చేపకు గాలం వేసినట్లు
జనాన్ని ప్రసన్నం చేసుకుంటారు
*
నిజమైన పేదలకు
సాయం చేయి
చేయూతనివ్వు
ఎవరు కాదంటారు
*
వృద్ధులను
ఆదుకో
అక్కున చేర్చుకో
ఎవరు వద్దంటారు కానీ...
*
ఉచితమని
ఉన్నవాడికి
దోచిపెడితే
ఇదో.. ఇలాగ.. మాలాగ
*
మేం ఉచితానికి
అర్హులంకాదు
ఎందుకంటే
మాకు బియ్యం కార్డు లేదుగా!
*
ఉచితానికి అర్హత అదేనని
ఉన్నవాడు పసిగట్టాడు
పరపతితో
ఒడిసిపట్టాడు
సగానికి పైగా
వారివే
పేదవానికి అందేది
కొంచెమే!
*
ఉచితం
ఎవరికి లాభం
ఓట్లు వేసుకునే
నాయకులకు,
వారి మందీమార్బలానికే
ఎక్కువ మోదం.

-ఎస్.పి.కృష్ణమూర్తి 99660 38800