Others

అక్టోబర్‌లో వాడొస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ దేశాల్లోనే అత్యధికంగా తుపాకులు కలిగివున్న దేశాల జాబితాలో మొదటిస్థానంలో ఉన్న దేశం అమెరికా. ఆ దేశంలో జరిగే తుపాకి కాల్పుaల్లో అధికంగా బలైపోతున్నవారు భారతీయులేనని ఇటీవలి గణాంకాలు చెబుతున్నాయి. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని కిక్ ఫేమ్ శ్యామ్ హీరోగా సారథి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం వాడొస్తాడు. కెవి శబరీష్ నిర్మిస్తోన్న చిత్రం అమెరికాలోని లాస్‌వేగాస్‌లో హాలీవుడ్‌స్థాయిలో చిత్రీకరణ జరుపుకుంది. ఇటీవల చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దర్శకుడు లింగుస్వామి లాంచ్ చేశారు. అక్టోబర్‌లో సినిమా విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ -హీరోగా శ్యామ్ ఒక డిఫరెంట్ పాత్రలో కనిపిస్తాడు. హీరోయిన్‌గా ఆత్మీయ, మరో హీరోయిన్‌గా శ్రీదేవికుమార్ నటించారు. పలువురు హాలీవుడ్, తమిళ సాంకేతిక నిపుణుల కాంబినేషన్‌లో భారీ బడ్జెట్‌తో తీసిన సినిమా ఇది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి అక్టోబర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అన్నారు.