Others

మబ్బులో ఏముంది.. (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మబ్బులో ఏముంది?.. నా మనసులో ఏముంది? అంటూ కథానాయిక అడిగితే, మబ్బులో కన్నీరు. నీ మనసులో పన్నీరు.. అవునా? అంటూ కథానాయకుడు సమాధానమిస్తాడు. ‘తోటలో ఏముంది.. మాటలో ఏముంది.... నా మాటలో ఏముంది?’ అని ఆమె అడిగితే -‘తోటలో మల్లియలు/ మాటలో తేనెయలు/ నీ మాటలో తేనెయలు’ అంటాడతను. ప్రశ్న -జవాబుగా సాగే ఈ పాట లక్షాధికారి చిత్రంలోది. అప్పట్లో ఈ స్టయిల్ సాంగ్ ఓ గొప్ప ప్రయోగం.
‘చేనులో ఏముంది? నా మేనులో ఏముంది?’ అని ఆమె అడిగితే -‘చేనులో బంగారం మేనులో సింగారం నీ మేనులో సింగారం’ అంటూ సమాధానమిస్తాడు అతను. ‘యేటిలో ఏముంది? పాటలో ఏముందని’ ఆమె అడిగితే, ‘యేటిలో గలగలలు పాటలో సరిగమలు’ అంటూ మెప్పిస్తాడతను. చివరిగా ఆమె ‘నేనులో ఏముంది.. నీవులో ఏముంది’ అంటే, ‘నేనులో నీవుంది నీవులో నేనుంది’ అంటూ ఫినిషింగ్ ఇస్తాడు హీరో. నిజానికిదో ప్రేమగీతం. లోతుగాచూస్తే, వాళ్ల ప్రేమలోని స్వచ్ఛత, నిజాయితీ కనిపిస్తాయి. ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు.. ప్రేయసి తన మనోభావాలను చిలిపిగా ప్రియుడ్ని పాటలో ప్రశ్నిస్తుంటే.. ప్రియుడు కంగారు పడకుండా నిండైన సంతోషంతో నిజాయితీ సమాధానాలు ఇవ్వడం ఎంత అద్భుతం. ఇంత గొప్ప ప్రేమ సాహిత్యాన్ని తేలిక పదాలతో అచ్చమైన ప్రేమభాషలో ఎవరు వ్రాయగలరు? విశ్వంభర కవి సి నారాయణరెడ్డి తప్ప. ఆయన రాసుకున్న వేల కవితల్లోని భావాన్ని ఇలా పాటగా మలిచారట. ఇంత అందమైన పదాల పొందికకు సుస్వర రాగాలందించారు తాతినేని చలపతిరావు. ఈ పాటలో అతి తక్కువ వాయిద్యాలు (తప్పెట, వయోలిన్) సున్నితంగా వాడి మనసుకింపుగా హాయి గొలిపేలా ట్యూన్ చేశారు. చిత్రంలో హీరో హీరోయిన్‌లైన యన్టీ రామారావు, కృష్ణకుమారిపై మరింత అందంగా చిత్రీకరించారు దర్శకుడు. మనసులను ఆహ్లాదపర్చే ఇటువంటి గీతాలు నేటి చిత్రాల్లో మచ్చుకైనా కనిపించటం లేదనేదే బాధ.
-పీవీఎస్పీ రావు, అద్దంకి