Others

పొందికగా సర్దుకుందాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు మనం ‘ఇంటీరియర్ డెకరేషన్’ అనే మాటని బాగా వింటున్నాం. ఇంటినొక సాంకేతిక సీమగా, సర్వవసతుల నిలయంగా మార్చుకుంటున్నాం. ఇంటిని అందంగా అలంకరించుకోవటానికి వస్తువులు, సకల సదుపాయాలు ఇబ్బడిముబ్బడిగా ఇప్పుడు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అన్నీ ముఖ్యమైనవీ, అత్యవసరాలు అని కూడా అనిపిస్తాయి. హోదాని పెంచేందుకు, హుందాగా జీవించేందుకు అవి తప్పనిసరే అనిపిస్తాయి. మరి అలా అనుకుంటూ పోతే ఇంట్లో మనకున్న పరిమితమైన స్థలంలో వాటిని సర్దుకోవటం పెద్ద సమస్యగా మారుతోంది. ‘ననె్నక్కడ పెడతావు?’ అన్నట్టుగా వస్తువులు మనల్ని చూస్తుంటాయి. తరచుగా అద్దె ఇళ్లు మారేవారికి ఇది మరింత తలనొప్పిగా పరిణమిస్తుంది. కుటుంబ సభ్యులందరూ కలిసిమెలసి వుంటే ఇంట్లో ఎంత ప్రశాంతత వుంటుందో వస్తువులన్నీ తమ తమ నెలవుల్లో కొలువురితే ఇంటికి వచ్చే ఆ అందమే వేరు. ఆనందమే వేరు. మరి ఈ సరసమైన సర్దుబాటుకు సంబంధించిన పద్ధతులేంటో చూద్దాం.
ఇంటిని పరిశుభ్రంగా, అందంగా తీర్చిదిద్దుకుంటే గౌరవం, మంచి హోదా లభిస్తుంది. వారి వారి స్థాయిల్ని బట్టి ఎన్నోరకాలుగా అందంగా అలంకరించుకోవచ్చు. ఇంటిని చూసి ఇల్లాలిని చూడమన్నారు పెద్దలు. ఇంటిని ఎంత చక్కగా దిద్దుకుంటే అంత పేరు ప్రతిష్ఠలు వస్తాయి. అందుకే ఇంటిపై ఎక్కువ శ్రద్ధచూపండి. ఇంటిని శుభ్రంగా పెట్టుకోకపోతే చాలామందికి విరక్తిపుడుతుంది. సామాన్లతో ఇంట్లోని గదులన్నిటినీ నింపేస్తే చాలా చికాకుగా కనిపిస్తుంది. గదిలో ముప్పావు భాగం లేదా సగభాగమైనా ఖాళీగా వదిలేసి చూడటానికి విశాలంగా కనిపిస్తుంది. గదులన్నీ సామాన్లతో నింపేస్తే ఎంత విశాలమైన ఇల్లయినా చిన్నదిగానే కనిపిస్తుంది. ఒక గదికి ద్వారాలు ఎక్కువగా ఉన్నపుడు వస్తువుల అమరిక అష్టమవుతుంది. ఉదాహరణకు లివింగ్ కమ్ డైనింగ్ రూమ్‌కు ప్రధాన ద్వారం కాకుండా మరో నాలుగు ద్వారాలు అదనంగా వున్నపుడు అంటే బెడ్‌రూమ్‌లు టాయ్‌లెట్, కిచెన్ ద్వారాలుంటే సోఫాలు, కుర్చీలు, డైనింగ్ టేబుల్ అమర్చడం కష్టంగానే ఉంటుంది. ఇవి తప్పనిసరిగా అమర్చవలసినవి కాబట్టి గదుల్లో స్థలం ఉన్నప్పటికీ అది ఒక గదిలో నుండి ఇంకో గదిలోకి వెళ్ళడానికి దారిగా మాత్రమే ఉపయోగపడుతుంది. ఇలాంటి గదులు వున్నవారు స్థలం ఎక్కువగా ఆక్రమించే సోఫాలు గట్రా వాడకపోవడం మంచిది. ఆకర్షించే లివింగ్ రూం.. ఇంటికివచ్చే అతిథులు ముందుగా చూసేది లివింగ్ రూం. కాబట్టి మన స్థాయికి తగినట్టుగా అతిథులను ఆకట్టుకునే విధంగా అమర్చుకోవాలి. స్థిరంగా ఒకచోట ఉండకుండా ఇల్లు మారుతూ ఉండేవారు లివింగ్ రూంలో అమర్చుకునే కుర్చీలు, సోఫాలు ఏ ఫ్లోర్‌కైనా నప్పే విధంగా సహజమైన రంగులను ఎంపిక చేసుకోవాలి. సోఫాలు, కుర్చీలు, దివాన్ బెడ్‌లు వంటివి గోడవారగా ఉంటే బాగుంటుంది. పైగా అవి స్థలం ఎక్కువగా ఆక్రమించినట్టుగా కనిపించదు. గది మధ్యలో వేస్తే నడవటానికి ఇబ్బందే కాకుండా గది కూడా విశాలంగా అగుపించదు. గదిలో వెలుతురు ఎక్కువగా ఉండి, గది విశాలంగా ఉన్నపుడు దివాన్ కవరు, కుషన్ కవర్స్ ముదురు రంగులయితేనే అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తుంది. అలాగే కర్టెన్లు కూడా కుర్చీలకు, సోఫాలకు, దివాన్ సెట్స్‌కు వాల్ హాంగింగ్స్‌కు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి. లివింగ్ రూంలో ఎటాచ్డ్ టాయ్‌లెట్స్ ఉన్నపుడు అక్కడ కర్టెన్లు వేయడమో లేదా తలుపునకు పోస్టర్ అమర్చడమో చేయాలి. ఇంకా అందంగా కనిపించాలంటే కర్టెన్లకు బదులుగా కర్టెన్ హాంగింగ్స్ వాడుకోవవచ్చు. కర్టెన్లు కుట్టించేటప్పుడు లోపలికి మడతలు ఎక్కువగా ఉంచుకున్నట్లయితే కిటికీలు పెద్దవైనా, చిన్నవైనా అమర్చుకోవడానికి వీలుగా ఉంటాయి. ప్రతిసారీ కొత్త కర్టెన్లు కొనే అవసరం రాకుండా తరచూ బదిలీలపై వెళ్ళేవారు ఇది తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన విషయం.

- కంసుడు