Others

డైరెక్టర్స్ ఛాయిస్.. రెండు పనులు ఒకేసారి చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

-దర్శకుడు అవసరాల శ్రీనివాస్
***
‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో దర్శకుడైన నటుడు అవసరాల శ్రీనివాస్. తొలి చిత్రంతోనే క్రేజ్ సంపాదించిన అవసరాల, ఆ తర్వాత మళ్ళీ చాలా కాలానికి ‘జో అచ్యుతానంద’ అనే రొమాంటిక్ కామెడీతో దర్శకుడిగా వచ్చాడు. మంచి టాక్ తెచ్చుకుందన్న ఆన్ఘందంలోవున్న
అవసరాలతో ఈ వారం చిట్‌చాట్.
గుసగుసల తరువాత, ఇంత గ్యాప్పా?
-కావాలని తీసుకున్నదే. నిజానికి ఆ సబ్జెక్టు వెరీ సింపుల్ లవ్‌స్టోరీ. బేసిక్ ఎమోషన్‌కు బాగా కనెక్టయ్యారు. అయితే రెండోది అంత సింపుల్‌గా ఉండకూడదనుకున్నా. కొత్తదనమున్న కథతో వచ్చేందుకు గ్యాప్ తప్పలేదు.

అన్నదమ్ముల కథలు పాతవేగా?
-కావొచ్చు, కానీ ఇది నా స్టయిల్లో కూల్‌గా ఉంటుంది. ఫ్యామిలీతో సరదాగా చూడదగ్గది. అన్నదమ్ములిద్దరూ ఒకే అమ్మాయి వెనుక పడిన పాత కథనే కాస్త భిన్నంగా చెప్పాననుకుంటున్నా.

హీరోలకీ ముందే పెళ్లి చేసేశారు?
-కథను కావాలని హైడ్ చేయను. హీరోలిద్దరికీ పెళ్లైందని ఫస్ట్ షాట్‌లో చెప్పేశా. అక్కడి నుంచి కథ నడిపించడమే రియల్ చాలెంజ్. అదే వైవిధ్యం.

ముగ్గురిచుట్టూ తిప్పేశారు?
-ప్రధాన కథలో ముగ్గురూ చాలు. అందుకే బోర్‌డమ్ లేకుండా లుక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకున్నారు. అందరూ ఫన్ లవింగ్, బాగా చేశారు.

యాక్టింగ్, డైరెక్షన్.. బ్యాలెన్సింగ్ కష్టంగా లేదూ?
-రెండు పనులూ ఒకేసారి చేయను. సో, నో ప్రాబ్లెమ్.

మీలో డైరెక్టర్‌ని రైటర్ డామినేట్ చేస్తాడా?
-ఉంటుందేమో. నిజానికి రైటర్‌గానే ఎక్కువ ఆలోచిస్తా. ఈ సినిమాకూ అదే బలమనుకుంటున్నా.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
బాలీవుడ్ ‘హంటర్’ను రీమేక్ చేస్తున్నా. అడల్ట్ కంటెంటే అయినా ధైర్యంగా అడుగేస్తున్నా. ఇక నానితో ఒకటి, వారాహి బ్యానర్‌లో మరొకటి చేయాల్సినవి ఉన్నాయి.

-శ్రీ