Others

అలనాటి సంగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవ్విన నాపచేనే పండుద్ది అన్నట్లుగా ఆణిముత్యంలాంటి గుండమ్మకథ గూర్చి ఓ నగ్నసత్యం వివరించాలి. మనసులో మాటలా ఈ సినిమా కథ బాగాలేదని కొందరు చెప్పినా అందరికీ చిత్రం నచ్చింది. మొదట ఈ సినిమాకు ఏం పేరు పెట్టాలా? అని తర్జన భర్జనలు పడ్డారట. ఏం పెట్టాలో కూడా అర్థంకాలేదట. అయితే ప్రీప్రొడక్షన్స్‌కు ముందునుండి ఈ కథను గుండమ్మకథ అనడం అలవాటైంది. గుండమ్మకథ తీద్దాం, గుండమ్మకథకు మాటలు రాద్దాం, గుండమ్మ కథకు స్క్రీన్‌ప్లే రాద్దాం అని వ్యావహారికంలో ఉన్న మాటనే చివరికి దర్శక నిర్మాతలు ఈ చిత్రానికి గుండమ్మకథ అన్న పేరును ఖరారు చేసేదాకా వచ్చింది. పేరు ఏం పెట్టలేకపోయారని మొదట ఈ సినిమా గురించి అందరూ నవ్వుకున్నారట. చివరికి నవ్విన నాప చేనే పండింది. అదీ గుండమ్మకథ.

-మంగం ఆనందరావు, వేగివారిపాలెం