AADIVAVRAM - Others

బిడ్డను కంటే లక్షలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజమండీ.. ఆ ఊర్లో బిడ్డను కంటే ఎనిమిది లక్షలు రూపాయల బోనస్ ఇస్తారు. ఫిన్లాండ్‌లోని ఒక ఊరిలో జనాభా భారీగా తగ్గిపోతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే కొన్నాళ్లకు యువత లేకుండా అందరూ వృద్ధులే మిగిలిపోయే ప్రమాదం ఉందనుకుంది స్థానిక పాలకవర్గం. దీనికి పరిష్కారం చూపేందుకు ఒక ఆలోచన చేసింది. తమ ఊరిలో పిల్లలను కనేవారికి పారితోషికంగా 10, 000 యూరోలు ఇవ్వాలని నిర్ణయించింది. అంటే భారత కరెన్సీలో అక్షరాలా.. రూ. 7, 87, 270. పశ్చిమ ఫిన్లాండ్ ప్రావిన్స్‌లో ఉన్న అతి చిన్న మున్సిపాలిటీ లెస్టిజార్విలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. కేవలం 725 మంది మాత్రమే జనాభా ఉన్న ఈ ఊరిలో 2012లో ఒక్క శిశువు మాత్రమే జన్మించింది. దాంతో పిల్లలను కనేందుకు ప్రజలను ప్రోత్సాహించాలన్న ఆలోచనతో 2013లో ‘బేబీ బోనస్’ పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ పథకం కింద ఇక్కడ బిడ్డకు జన్మనిచ్చిన ప్రతి జంటకూ 10,000ల యూరోల పారితోషికం ఇస్తారు. ఆ మొత్తాన్ని ఏటా 1,000 యూరోల చొప్పున పది సంవత్సరాల పాటు చెల్లిస్తారు. ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఏడేళ్లలో ఇక్కడ 60 మంది పిల్లలు జన్మించారు. అంతకు ముందు ఏడు సంవత్సరాల్లో కేవలం 38 మంది మాత్రమే జన్మించారు. అంటే ఈ బోనస్ పథకం ఎంతో కొంత ఫలితాలిస్తోందని అర్థమవుతోంది. ఈ పథకం కింద అందరికంటే ముందు లబ్ధి పొందిన పెక్కా టుయిక్కా, తన భార్య జనికాతో కలిసి చిన్న వ్యవసాయ ఆధారిత పరిశ్రమ నడుపుతున్నారు. వారిలో 2013లో అమ్మాయి పుట్టింది. విశేషమేమంటే ఆ చిన్నారిని అందరూ ముద్దుగా ‘టెన్ థౌజెండ్ యూరో గర్ల్’ అని పిలుస్తారు. ఇప్పటివరకు ఆ కుటుంబానికి 6,000ల యూరోల పారితోషికం అందింది. ఈ ఊర్లోని ఫలితాలను చూసిన తర్వాత ఫిన్‌లాండ్‌లోని ఇతర మున్సిపాలిటీలు బేబీ బోనస్ వంటి పథకాలను ప్రవేశపెడుతున్నాయి. జననాల రేటును పెంచేందుకు స్థానిక పాలక సంస్థలు ఇలాంటి ప్రోత్సాహకాలు ఇస్తున్నా ఇప్పటికీ ఫిన్లాండ్ జాతీయ జననాల రేటు అత్యంత తక్కువగా ఉంటోంది. మిగతా యూరోపియన్ దేశాల మాదిరిగానే, గడిచిన దశాబ్ద కాలంలో ఫిన్లాండ్‌లో జననాల రేటు దారుణంగా పడిపోయింది. 2018లో ప్రతి మహిళకు ఒక్క చిన్నారి మాత్రమే ఉన్నారు. పదేళ్ల క్రితం ఒకొక్కరికి ఇద్దరేసి పిల్లలు ఉండేవారు. ఫిన్లాండ్‌లో జననాల పెరుగుదల, పిల్లల పోషణకు సంబంధించి ప్రోత్సాహకరమైన పథకాలు చాలానే ఉన్నాయి. బేబీ బాక్స్ పంపిణీతో పాటు, ఒక్కో చిన్నారికి నెలనెలా దాదాపు 100 యూరోలు ఇవ్వడం, డెబ్భై శాతం వేతనంతో కూడిన తొమ్మిది నెలల ప్రసూతి సెలవులు ఇవ్వడం వంటి కార్యక్రమాలు అమలులో ఉన్నాయి.
యూరప్‌లోని మరో దేశం ఎన్తోనియాలో కూడా పిల్లలకు నెలనెలా ఆర్థిక సాయం అందించే కొత్త పథకాన్ని ప్రారంభించింది. ఇక్కడ మొదటి బిడ్డకు 60 యూరోలు, రెండో బిడ్డకు 60 యూరోలు, మూడో బిడ్డకు 100 యూరోలు చొప్పున ప్రతి నెలా ఇస్తారు. ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ఎన్తోనియా ప్రభుత్వం అదనపు బహుమతులు కూడా ఇస్తుంది. ఆ కుటుంబాలకు నెలవారీ బోనస్‌గా 300 యూరోలు చెల్లిస్తుంది. అలా ముగ్గురు ప్లిలలు ఉన్న ఒక్కో కుటుంబం నెలనెలా రూ. 40, 920 (520 యూరోలు) అందుకుంటుంది. సాధారణ జీవన వ్యయం, సగటు ఆదాయం తక్కువగా ఉన్న ఈ దేశంలో అంత మొత్తంలో ఆర్థిక సాయం అంటే పెద్ద విషయమే. కాబట్టి ఈ పథకాల ప్రభావం బాగానే ఉన్నట్లు అనిపిస్తోంది. 2010తో పోలిస్తే 2018 నాటికి జనాల రేటు 1.32 నుంచి 1.67కి పెరిగింది.
ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక ప్రోత్సాహకాలతో సానుకూల ఫలితాలు వస్తున్నట్లు అనిపిస్తోందని టాలిన్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్లు చెబుతున్నారు. మూడో బిడ్డను కన్నవారికి ప్రత్యేక బహుమతి ఇచ్చే పథకం ఎక్కువ ప్రభావం చూపినట్లు తెలుస్తోంది అని వారంటున్నారు. అదే సమయంలో ఎన్తోనియాలో ప్రజారోగ్య సౌకర్యాలు మెరుగుపడటం, స్థిరమైన ఆర్థిక వృద్ధి లాంటి అంశాలు కూడా జననాల రేటు పెరుగుదలకు ఒక కారణం అయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‚
జననాలు నిజంగా పెరుగుతాయా?
ఇలాంటి నగదు ప్రోత్సాహకాలతో జననాల రేటును పెంచవచ్చునని ఇటలీలో ఇటీవల ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఇటలీలో జననాల రేటు కొన్ని దశాబ్దాలుగా చాలా తక్కువగా నమోదవుతోంది. 2018లో కనిష్టస్థాయికి పడిపోయింది. అదే ఇటలీలో జననాల రేటును పెంచేందుకు మెరుగైన ప్రోత్సాహకాలు అందిస్తున్న ఒక ప్రావిన్సులో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. స్విట్జర్లాండ్, ఆస్ట్రియా సరిహద్దుకు సమీపాన ఉన్న బోల్జానో ప్రావిన్సు అది. ఇక్కడ జననాల రేటు 1.67గా ఉంది. అది యూరోపియన్ యూనియన్ సగటు కంటే ఎక్కువ. ఈ ప్రావిన్సులో కుటుంబ విధానాలు ఇటలీలోని ఇతర ప్రాంతాల కంటే చాలా మెరుగ్గా ఉండటమే ఇందుకు కారణమని చెప్పొచ్చు. ఇక్కడ నెలనెలా చిన్నారులకు దాదాపు 200 యూరోల దాకా ఆర్థిక ప్రయోజనం అందుతుంది. అది జాతీయ సగటు కంటే రెట్టింపు. అల్పాదాయ కుటుంబాలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కూడా ఇస్తోంది.

-మహి