AADIVAVRAM - Others
విన్నపాలు..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 9 November 2019
-కోడిగూటి తిరుపతి.. 9573929493
నీ పాటల పల్లకిలో
పట్టపు రాణినై ఊరేగాలి
నీ నవ్వుల తోటలో
పారిజాత పువ్వై పరిమళించాలి
నీ గుండె గూటిలో
పసిపాపనై ఒదిగిపోవాలి
నీ నిండు మనస్సులో
పండు వెనె్నలై కురవాలి
నీ చేతి స్పర్శలో
సిగ్గుమొగ్గై మురవాలి
నీ పలుకుల సరిగమలో
దేవనర్తకినై నాట్యమాడాలి
నీ ఆలంబనల కొమ్మకు
ఆత్మీయ తీగనై అల్లుకోవాలి
నీ నులి వెచ్చటి ఊపిరిలో
గాలినై కలిసిపోవాలి
నీ ఒడి అమృతం తల్పంమీద
లిప్తకాలంపాటు నిద్దుపోవాలి
నీ వేలు పట్టి ఏడడుగులు కాదు
ఏడేడుజన్మలు కలిసి నడవాలి
నాదన్నది సర్వస్వం
నీకు అంకితమిచ్చుకోవాలి
ప్రియసఖుడా!
ఈ చిన్నదాని విన్నపాలు మన్నించి
నీదానిగా చేసుకుంటావు కదూ?