Others

నాకు నచ్చిన చిత్రం.. మిస్సమ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాకు అన్ని విధాలా నచ్చి నిరంతరం గుర్తుకొచ్చే చిత్రం విజయవారి -మిస్సమ్మ. నాటికీ నేటికీ ఏనాటికీ ఉత్తమ చిత్రాల్లో ఇది అగ్రస్థానం వహిస్తుంది అనడంలో సందేహంలేదు. హాస్యం అనేది ప్రతీ ఫ్రేములోనూ మనకి కనిపించినా, ఎక్కడా కొంచెమైనా అపహాస్యం కాకుండా దర్శక నిర్మాతలు, రచయిత జాగ్రత్తలు తీసుకున్నారు. అంతకుమించి నటీనటుల సహజ నటన తోడై ఈ చిత్రం అన్ని విధాలా అందరినీ ఆకట్టుకుంది. నిరుద్యోగ సమస్య, వారి పాట్లతో పాటు హిందూ, క్రైస్తవ సంప్రదాయాల గూర్చి సంభాషణల్లో తెలియజేసిన విషయాలు మరపురానివి. చర్చి, గుళ్లు, గోపురం, మసీదు అన్నిటిపై నాకు నమ్మకం వుంది అని హీరో చెబుతాడు. ఈ ఒక్క వాక్యం చాలు, హిందూ ధర్మం విశ్వసమానత్వం కోరేది అని చెప్పడానికి. రాగసుధారస గానము పానముసేయ, తెలుసుకొనవె చెల్లి, తెలుసుకొనవె యువతి, బృందావనమది అందరిదీ, రావోయి చందమామ వంటి పాటలలో సంగీత సాహిత్యాలు పోటీపడి ప్రేక్షకులను ఉర్రూతలూగించాయి. అలాగే కరుణించు మేరి మాత అన్న పాటకు క్రైస్తవ కీర్తనల బాణీలోనే ట్యూన్ కట్టడం ఓ విశేషం. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోయే ఈ చిత్రానికి మహామహులు పనిచేశారు. పాటలు, మాటలు సమకూర్చిన పింగళి నాగేంద్ర రావు ప్రతిభ ప్రతి అక్షరంలోనూ కనిపిస్తుంది. ఇక ర-సాలూరు రాజేశ్వర రావు అందించిన బాణీలుగానీ, ఛాయాగ్రాహకుడు మార్కస్ మాట్లే అమర్చిన కెమెరా ఫ్రేముల్ని ఎప్పటికీ మర్చిపోలేం.
ఇక మహానటి సావిత్రి, ఎన్టీ రామారావు తమ తమ పాత్రలకు జీవం పోశారు. నాగేశ్వరరావు కామెడీ నటన ఓ వెరైటీ. జమున, ఎస్వీఆర్, ఋషేంద్రమణి, రమణారెడ్డివంటి నటుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

-అజ్జుగుట్టు లక్ష్మీకాంతమ్మ, గుత్తి