Others

పాతికేళ్లు వంగేవున్నా..శరత్కాలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూర్తి నామధేయం ఎంత పెద్దదైనా కేవలం ఇంటి పేరుతోనే పాపులరై 300 చిత్రాలకు పైగా నటించిన వంగర వెంకట సుబ్బయ్యకు ఒక ప్రత్యేకత వుంది. వంగర సినిమాల్లో ఎంత బిజీగావున్నా నాటకాల్లో నటిస్తూ, నాటక రంగంనుంచి రావటం కారణంగానే ఈస్థాయికి చేరుకొన్నానని పదే పదే గుర్తు చేసుకొనే వాడు. వంగరను గుర్తుకు తెచ్చుకోవాలంటే షావుకారు చిత్రంలో గుమాస్తా, పెద్దమనుషులు చిత్రంలో మున్సిపల్ కౌన్సిలర్, మాయాబజార్, పల్నాటి యుద్ధం చిత్రాలు చాలు. ఎన్‌టి రామారావు మొదటి చిత్రం ‘మన దేశం’ నుంచే వంగర ప్రధాన పాత్రల్లో నటించటం వలన ఆ మహానటుడి కాంబినేషన్‌లో పలు చిత్రాల్లో నటించే అవకాశం కలిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీకృష్ణపాండవీయం’లో నటించిన అగ్నిదోత్సనుడి పాత్ర పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ‘కృష్ణా యదుభూషణా’ అనే పాటను కూడా ప్రత్యేకంగా జతపరిచారు (గానం-పిబి శ్రీనివాస్). ఈ పాటవల్ల ఆ పాత్రకు ఎంతో నిండుతనం చేకూరింది. వంగర సినీ జీవితంలో ఒక హిట్ పాటతో నటించిన ఏకైక చిత్రం ఇదే కావటం విశేషం. ఈ విషయం గురించి వంగరను కదిపినప్పుడు ఎంతో ఆనందపడుతూ ఈ పాటలో ‘అఖిలము లెరిగిన అంతర్యామి’ అని శ్రీకృష్ణుడిని సంభోదిస్తూ వుంది. భారత గాథలో శ్రీకృష్ణుడే అంతర్యామి. తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కృష్ణుడు అంతర్యామి. ఆ మహానుభావుడి రూపకల్పన నాకు ఆ అదృష్టాన్ని కలుగచేసింది అని అనేవారు కృతజ్ఞతాభావంతో.
ఒక చిత్రం షూటింగ్‌లో ఒక యువ దర్శకుడు ఏదో సూచన చేస్తూ ‘వంగరా’ అని పిలిచాడు. వయసును కూడా పట్టించుకోకుండా దర్శకుడి సంబోధనకు కించిత్తు బాధ అనిపించినా తొణకకుండా ‘పాతికేళ్లనుంచి వంగే వున్నానండి. ఇంకా ఏమి వంగాలో సెలవివ్వండి’ అన్నాడు వ్యంగ్యంగా. ఆ సమాధానం ఆ దర్శకుడికి ఎలా అనిపించిందో అన్నది వేరే విషయం అనుకోండి. వంగరతో ఐదు నిమిషాలు ముచ్చటిస్తే కాసేపు ఆనందం పొందటం గ్యారంటీ. ‘నా బొంద’ ‘నా పిండాకుడు’ అనే మాటలు ఆయన సంభాషణల్లో ఎక్కువ వినపడేవి.
వృద్ధాప్యంతో చిత్రాల సంఖ్య తగ్గి యువ నటులకు నాటక రంగంలో శిక్షణయిస్తున్న సమయంలో సికింద్రాబాదు సీతాఫల్‌మండిలో జరిగిన ఆఖరి సన్మాన సభలో వంగర.

-పర్చా శరత్‌కుమార్ 9849601717