AADIVAVRAM - Others

ఓ హరిత కథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అదే గొంతు.. అవును.. నిస్సందేహంగా అదే గొంతు.. అమ్మా అన్న పిలుపు.. అలుపెరుగని ఆ పిలుపు.. ఆ గొంతులో తొణికిసలాడే మాధుర్యం వచ్చీరాని మాటల్లో, ఆ కమ్మదనం.. మా అమ్మ బ్రతికి ఉన్న వరకు రింగవుతూనే ఉంటుంది. ఇది కేవలం ఆకృతి మదిలో భావనా.. లేక ఆ మధురానుభూతులలో తేలిపోయేందుకు ఆ భగవంతుని దీవెనా.. ఏమైనా ఆకృతి మదిలో పదిలపరచుకున్న తన బిడ్డ హరిత తీపి గురుతులు..
కానీ హరిత లేదు.. మరి రాదు.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందన్నది నిజం.. నిజాన్ని అంగీకరించలేని ఆకృతి మతిభ్రమణంలో హరిత ఓ చిన్నారి పాప.. ఆ కళ్లకు తను దీప.. అదే ఇప్పుడున్న ఆకృతి మానసిక స్థితికి బలము, బలహీనము ఆ తల్లికి. అందుకే ఇంటిలోని వారు, బయటి వారు అందమైన అబద్ధానికి అంటు కడ్తున్నారు.. ఆమెలోని మాతృత్వాన్ని చిగురుస్తున్నారు.. తామెంతో వగరుస్తున్నా హరిత మరణానికి -
అసలు ఈ హరిత ఎవరు.. ఆమె మరణించడమేమిటి? పట్టుమని మూడు పదులైనా నిండని కుందనపు బొమ్మ.. అశ్విన్, ఆకృతిల గారాల పట్టుకొమ్మ. అనూహ్యమైన హరిత మరణవార్త విన్న అశ్విన్ హతాశుడై చతికిలపడిపోయాడు ఒక పక్క. మరోపక్క విన్న వెంటనే షాక్‌కి గురై నోట మాట ఆడక.. కనులు రెప్పలార్చక.. ఆకృతి మంచమెక్కింది.. తెప్పరిల్లిన ఆకృతి తేరుకుంటున్న అశ్విన్‌ని తన హరితని వెంటనే తీసుకురండి హాస్టల్ నుండి అంటూ.. హరిత హాస్టల్‌లో ఉందన్న భ్రమలో.. హరిత మరణించిన వాస్తవానికి దూరమైంది. ఎక్కడో ఎప్పుడో చదివిన కొటేషన్ స్ఫురణకు వస్తోంది అశ్విన్‌కి-
‘జీవితం అనేది గమ్యం కాదు.. గమనం మాత్రమే.. గమ్యం అనంతం.. గమనం అనేకం.. ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా కదిలిపోయేదే జీవితం.’
మనిషనే వాడు ముందు దృఢత్వం.. స్థిరత్వం.. కలిగి ఉండాలి.. అవి లేనినాడు/ లేనివాడు మనిషిగా ఎదగలేడు. జీవితంలో వొదగలేడు.. ముందుకు సాగలేడు.. గమనాన్ని ఆపగలిగితే, ఎవరికి వారు, వారికి అనుగుణంగా మార్చుకొనగలిగితే, మలచుకొనగలిగితే.. ఇక దేవుని ఆశ్రయించేదెవరు. ఎవరికి వారు వారికి అనుకూలంగా జీవితాన్ని ఏర్పరచుకోగలిగి స్వతంత్రులైతే; ఆ సామర్థ్యం లేనివారు చతికిలబడటమో.. వెనుకబడటమో జరుగుతుంది. అందుకనో.. ఏమో? జీవన్మరణాలను, భూత, భవిష్యత్, వర్తమాన కాల గతులను తన అధీనంలోనే ఉంచుకున్నాడు, భగవంతుడు.
ఇది అశ్విన్ మస్తిష్కంలో సాగుతున్న వేదాంత చర్చ.. హరిత మరణం తనకి ఓ చిన్న అల తాకిడి అనుకోగలిగితేనే తను.. ఆకృతి.. కాలగమనాన్ని జీర్ణించుకో గలుగుతాం.. గమ్యాన్ని, దేవుడు రాసిన రీతిలో చేరగలుగుతాం.. ఓ దృఢ నిశ్చయానికి వచ్చేసిన అశ్విన్ వర్తమానంలో తన కర్తవ్యాన్ని నిర్వర్తించటానికి ఉద్యుక్తుడయ్యాడు. ఆకృతిని సమాధానపరచి హరిత పార్ధివ దేహానికి జరిపించవలసిన తదుపరి కార్యాలకై తనకెంతో ఆప్తుడైన స్నేహితుడు రమణని తీసుకుని బయలుదేరాడు ఆకృతి చెప్పిన విధంగా. అయితే ఆకృతి ఆశిస్తున్నది హరిత సశరీరాన్ని.. తను తీసుకురాగలిగింది మాత్రం హరిత పార్ధివ శరీరాన్ని.. చేతనం, అచేతనం.. రెండింటి నడుమ నలిగేదే జీవితం.
అశ్విన్‌ని బుజ్జగిస్తున్న రమణ తను అప్పుడప్పుడు.. తట్టుకోలేనప్పుడు.. ముఖం కర్చ్ఫీతో కప్పెడ్తున్నాడు - కారణం హరితతో తనకి, తన కుటుంబ సభ్యులకి అనుబంధం ఉంది.
ఫ్లైట్‌లో వాలిపోయారు అశ్విన్, రమణలు. ఎప్పుడు నిద్దరట్టిందో.. భళ్లున మెలకువ వచ్చింది ఫ్లైట్ ల్యాండవుతుండటంతో. విమానం బెంగుళూరు ఎయిర్‌పోర్ట్ చేరింది. బయటకు వచ్చిన అశ్విన్, రమణలు క్యాబ్‌లో హరిత కాలేజీకి బయలుదేరారు.. కాలేజీ సిటీ నుండి 20 కిలోమీటర్ల దూరం. హరిత ఎంతో కష్టపడి, ఇష్టపడి ఆ కాలేజీలో మెడిసిన్ సీటు సంపాదించుకుంది. కానీ తన జీవితం మూడునాళ్ల ముచ్చటై ముగిసిపోయింది. ఇది రమణ మదిలో ఆవేదన.. పొంగుకొస్తున్న దుఃఖాన్ని అడ్డుకట్టబోతే బయటకి కట్టలు తెంచుకొచ్చింది. అశ్విన్ రమణని వెన్నుతట్టి ఓదార్చాడు.. అశ్విన్ మానసికంగా నిలదొక్కుకున్నాడు.
ఏమో.. తీరా హరితని అచేతనగా చూస్తే పరిస్థితి.. అదీ ప్రశే్న.. బదులు ఇవ్వాలి కాలమే. ‘సమస్య ఎంత కఠినమైనా ప్రశాంతమైన మనస్సుకి ఉపశమనం తప్పక లభిస్తుంది. జీవితంలో అన్నీ కోల్పోయినా, భవిష్యత్తు మాత్రం మిగిలే ఉంటుంది. దానిని జాగ్రత్తగా రూపొందించుకోవాలి’ అశ్విన్ రమణని అనునయిస్తూ చెప్తున్నాడు, రమణ వౌనంగా ఆలకిస్తున్నాడు. ఎవ్వరూ సంతోషాన్ని మాత్రమే పంచుకోలేరు.. మధనంలో ఉద్భవమయ్యే హాలాహలాన్ని సైతం భరించాలి.. అప్పుడే జీవితం.. అదే నిత్యం.. సత్యం.
క్యాబ్ సాగిపోతున్న కొద్దీ రోడ్డు దూరాన్ని తగ్గిస్తోంది.. గమ్యానికి చేరుస్తోంది. క్యాబ్‌లో.. పెన్‌డ్రైవ్‌లో సాగే పాట ‘ఈ అనంత కాల గమనంలో.. ఈ రవ్వంత జీవన పయనంలో అందరు నీ వారు.. చివరకు మిగిలేదెవరూ లేరు..’ చాలా శ్రావ్యంగా వినిపిస్తూ, ఆక్రోశిస్తున్న గుండె లోతులకి ఉపశమన కెరటంలా కొంత ఊరట కలిగిస్తోంది రమణ, అశ్విన్‌లకి. తరువాత చరణం వారికి అన్వయించుకుంటే ఇలా వినిపిస్తోంది.. చేతికి అమ్మలు అందొస్తుందని.. చెట్టుకు తానొక వేరౌతుందని.. అంతే మళ్లీ ఇద్దరూ వస్తున్న దుఃఖాన్ని దిగమించే ప్రయత్నంలో చెరోవైపు విండోస్‌లోంచి చూస్తూ ముఖాలు దాచేసుకున్నారు. కానీ దుఃఖం హృదయాన్ని చల్లబరుస్తుందా.. చల్లబరచేందుకే మరి కన్నీరు.. గుండె మంటలార్పే సన్నీరు.. కన్నీరు.. ఉండమన్న ఉండవు శాన్నాళ్లు.. ఏమో కాలం మారుతుందేమో.. చేసిన గాయాన్ని మాన్పుతుందేమో, చూడాలి కాలగమనంలో.
నిర్దేశించుకున్న స్థలానికి చేరుకుంది క్యాబ్.. కాలేజీ అశ్విన్, రమణల మనస్సుల్లో శూన్యంలా.. క్యాంపస్ అంతా శూన్యం.. ఏమిటో ఎటు చూసినా శూన్యం.. నిశ్శబ్దం ఆవరించుకునుంది. నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ సెక్యూరిటీ క్యాబ్‌నాపాడు.. రిజిస్టర్‌లో సంతకం తీసుకుని, క్యాబ్‌ని లోనికి పంపాడు.. వెళ్తూనే ప్రిన్సిపాల్ రూమ్‌లో ప్రవేశించారు.. తమని తాము పరిచయం చేసుకోగానే ప్రిన్సిపాల్ కూడా ఎంతో బాధగా విషయాన్ని.. అదే హరిత మరణ ఉదంతాన్ని విపులీకరించారు. క్యాబిన్‌లో ఉన్న ముగ్గురి మధ్య సంభాషణ చాలా ముక్తసరిగా, గంభీరంగా సాగింది.
హరిత బాడీ అశ్విన్ కప్పగించటానికి కావలసిన కాగితాలు, ముందే తయారు చేయించి ఉంచినందువలన ఎక్కువసేపు టైమ్ తీసుకోకుండా అశ్విన్, రమణలు ప్రిన్సిపాల్ నుండి సెలవు తీసుకు బయలుదేరారు. ప్రిన్సిపాల్ ముందే సంబంధిత ఆసుపత్రి వారికి ఫోన్‌లో విషయం వివరించడంతో వాళ్లు ఆట్టే టైమ్ తీసుకోకుండా హరిత బాడీని అప్పగించారు అశ్విన్, రమణలకి.
ఇద్దరుగా బయలుదేరిన వారు ముగ్గురై వెనక్కి తిరుగు ప్రయాణమయ్యారు. అనుకున్న ప్రకారం హరితని నేరుగా ఇంటికే తీసుకువెళ్లారు.. మర్నాటి ఉదయం హరిత పార్ధివ దేహాన్ని ఖననం చేసేందుకు ఏర్పాట్లు జరిగిపోవటం చేత ఎక్కువ సమయం పట్టలేదు, తిరిగిరాని లోకాలకి పయనమైన హరిత పార్ధివ దేహాన్ని ఖననం చేయడానికి. కళ్ల ముందు జరుగుతున్న తంతు ఆకృతి మేధకు వెళ్లడం లేదు. అందుచేత జరగవలసిన కర్మ ఆకృతి కళ్ల ముందే జరిపించి ముగించేశారు. ‘హరిత జీవితం మూణ్ణాళ్ల ముచ్చటగా ముగిసిపోయింది..’ అంటూ మిసెస్ రమణ కాత్యాయని గుండెలవిసేలా ఏడుస్తోంది. ఆమెని ఓదార్చేదెవరు.. రమణది అదే పరిస్థితి.
ఎందుకు, ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం ఒక్క అవ్విన్ మాత్రమే చెప్పగలడు. పెంచిన మమకారం ఆకృతి అశ్విన్‌లది.. కన్న మమకారం కాత్యాయని, రమణలది.
ఈ నిజానికి దూరంగా ఉన్న బంధువులు మాత్రం విస్తుపోయి చూస్తూండిపోయారు.
సన్న సన్నగా వాన తుంపరలా వినవస్తోంది హరిత స్వరంగా పాట.. ఎందులకీ కన్నీరు.. ఎందుకిలా ఉన్నారు.. నేనేమై పోయాను.. ఉన్నాను నీడై ఉన్నాను... మీ నీడై ఉన్నాను..
అటు తర్వాత, మాటలో లాలన స్ఫురిస్తోంది హరిత గొంతుకలో ‘నాతో పుట్టుకొచ్చింది నాలో గుండె జబ్బు.. అది ఓ పాత గడియారం.. ఎప్పుడు పనే్జస్తుందో, ఎప్పుడు ఆగిపోతుందో దానికే తెలియదు. అయినా ఎంతకని రిపేరు చేయిస్తారు.. దాని నిష్క్రమణకు కూడా మీరు, నేను ప్రిపేర్ అయే ఉన్నాము. తెలిసి తెలిసి నాకై ఎందుకు మీకీ వగపు. ఇప్పుడు నా ఆత్మకు గుండె పుష్కలంగా ఉంది, అది ఎన్నటికీ ఆగదు. అందువల్ల మీరు నిశ్చింతగా ఉండండి, నేను ఎల్లవేళలా మీ చింతతోనే ఉంటాను. మీలో ఒకరై మసలుతాను.. నా జ్ఞాపకాలలో మీరుండండి.. సెలవు.. టాటా.. గుడ్‌బై..
హరిత ఆత్మ శాసిస్తోంది.. మా జ్ఞాపకాలలో శ్వాసిస్తోంది..

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505