Others

మీ వ్యూస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జబర్దస్త్ కాదు
చారుశీల చిత్రాన్ని జబర్దస్త్ యాంకర్ రేష్మి గౌతమ్‌ను దృష్టిలో పెట్టుకుని తీసినట్టుగా ఉంది. జబర్దస్త్ కార్యక్రమం ఎంత హిట్టయ్యిందో, ఆమెతో తీసిన చిత్రాలు అంత ఫట్టవుతున్నాయన్న విషయాన్ని నిర్మాతలు గమనించటం లేదు. యాంకర్‌ను దృష్టిలో పెట్టుకుని తయారు చేసుకుంటున్న కథ, కథనాలుతో కేవలం స్కిన్ షోను నమ్ముకుని, జబర్దస్త్ ఇమేజ్‌తో సినిమాను క్యాష్ చేసుకోవాలనుకుంటున్న ఆలోచన దారుణం. చారుశీల చిత్రం ఏం ఆలోచించి తీశారో దర్శక నిర్మాతలకే బహుశ తెలిసుండకపోవచ్చు. అసలు చారుశీల నవల తప్ప పాత్రే లేనపుడు, సినిమాకు అంత సీనెందుకో. ఇలాంటి చిత్రాలతో రేష్మి కెరీర్‌ను కూడా పాడుచేస్తున్నారనిపిస్తోంది.
-టి రఘురామ్, నర్సరావుపేట

అంతేగామరి!
మనకు బాగా తెలిసిన హీరోలు, అందమైన హీరోలు, మెగా హీరోలవి ఏవో కొన్ని చిత్రాలు 100 కోట్ల వసూళ్లు దాటితే, ఇక ఏదితీసినా అదే రేంజి ఉంటుందనుకోవడం కల. బ్రహ్మోత్సవం బ్రహ్మాండం బద్ధలు చేస్తుందన్నారు! అంతకుముందు అదే మహేష్‌బాబు సినిమా వన్ హిట్టనుకున్నారు. ఇక పవన్ సర్దార్ కోట్లు తెచ్చేస్తుందనుకున్నారు. కబాలి బాక్సాఫీస్‌నే షేక్ చేస్తుందన్నారు. చివరకు ఏమైంది? చతికిలపడ్డాయి. వీటి హైప్‌లన్నీ హుష్‌కాకులయ్యాయి. ప్రతిసారీ వంద కోట్ల సినిమాలు రావు. వందకోట్లను టార్గెట్ చేసేవి సినిమాలూ కావు. కథ, కథనాలు, కొత్తదనాన్ని నమ్ముకుంటే నిర్మాతలు బాగుంటారు, డిస్ట్రిబ్యూటర్లు బాగుపడతారు. మొత్తంగా పరిశ్రమే కళకళలాడుతోంది.
-ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్

గులాబి రంగు
పింక్ కలర్ -సింబాలిక్‌గా అమ్మాయిలకు అన్నది పాశ్చాత్యుల భావన. పుట్టిన బిడ్డ అమ్మాయి అయితే పింక్ ఉయ్యాల, అబ్బాయి అయితే బ్లూ ఉయ్యాల కొంటూంటారు. పింక్ కలర్ దుస్తులు ధరించిన అబ్బాయిల్ని ఆడంగి వెధవ అని తిడుతుంటారు కూడా. ఈ భావం మన దేశానికీ పాకింది. గులాబి గ్యాంగ్ పేరిట ఉత్తరాదిలో ఓ మహిళా సంస్థ ఉంది. అమితాబ్ బచ్చన్ పింక్ చిత్రంలో చేయడంతో, ఆ రంగు గురించి తాజాగా చర్చ మొదలైంది. ఇది స్ర్తిల సినిమా అని అందరూ అడుగుతుంటే, కాదు బాబోయ్ అని నిర్మాత మొత్తుకుంటున్నాడు. ఎంత మొత్తుకున్నా -అది మహిళా ప్రాధాన్యత కలిగిన సినిమానే. హాయిగా, ధైర్యంగా ఎందుకు చెప్పుకోవడంలేదో అర్థంకావడం లేదు. ఇదీ గులాబి కథ!
-ఎన్.గిరిధర్, కాకినాడ

ముగ్గురు పోతనలు
కొద్దిరోజుల క్రితం వెనె్నల్లో భక్తపోతన చిత్రం గురించి రాసిన వ్యాసం బాగుంది. 1942లో నాగయ్య నటించిన భక్తపోతన (కెవి రెడ్డి) ముందు 1966లో గుమ్మడి నటించిన ‘్భక్తపోతన’ (జి రామినీడు) తరువాత జెవి సోమయాజులుతో దర్శకుడు బాపు తీసిన ‘్భక్తపోతన’లు నిలువలేకపోయాయి. నాగయ్య పోతన సూపర్‌హిట్ అయితే, గుమ్మడి పోతన యావరేజ్. సోమయాజులు పోతన ఫ్లాప్. పైగా ఈ చిత్రాన్ని రంగుల్లో తీసినా ఎక్కలేదు. ఏదైనా ఒరిజినలే గొప్ప. ఎప్పుడోగాని జిరాక్స్‌లు అందంగా అనిపించవు.
-పి రామకష్ణ, ఆదోని

వారసులెవరు?
హాస్య సంభాషణలతో వెరైటీ డైలాగుల రచనతో అద్భుతమైన దర్శకత్వ ప్రతిభతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించిన హాస్య బ్రహ్మ జంధ్యాల -మొగుడూ పెళ్లాలు, శ్రీవారికి ప్రేమలేఖ, నాలుగుస్తంభాలాట, అహనాపెళ్లంట, రెండుజళ్ల సీత, రెండు రెళ్లు ఆరు, జయమ్ము నిశ్చయమ్మురా, వివాహ భోజనంబు, హై హై నాయక, చూపులు కలసిన శుభవేళ లాంటి అద్భుత చిత్రాలను అందించాడు. వాటిని ఎన్నిసార్లు చూసినా కడుపుబ్బ నవ్వు తప్పదు. సుత్తిజంటతో నవ్వులు పూయించాడు. శ్రీలక్ష్మితో అమాయకంగా డైలాగు చెప్పించి కితకితలు పెట్టించాడు. ‘గుడి మెట్లమీద ఎండుచేపలమ్ముకునే మొహం నువ్వూనూ’ వంటి వెరైటీ తిట్ల వినిపించాడు. హాస్య బ్రహ్మ బిరుదు సార్థకం చేసుకున్నాడు. అద్భుతమైన కథ, కథనాలతో, సున్నితమైన హాస్యంతో తీసిన ఎన్నో చిత్రాల ద్వారా ఇంకా ప్రేక్షకుల గుండెల్లో పదిలంగా వున్నాడాయన. అయితే, ఆయన లేని లోటు స్పష్టంగా ఇపుడు టాలీవుడ్‌లో కనిపిస్తోంది. చక్కని హాస్యాన్ని పండించే హీరోలు, కమెడియన్లు వస్తున్నా, కథలో బలంలేక కామెడీని మిళితం చేయలేక సినిమాను నడిపించే హాస్యబ్రహ్మలు అభాసుపాలవుతున్నారు. కిచిడి చిత్రాలతో తెరవరకు రావడమే తప్ప, జంధ్యాల వారసత్వాన్ని నిలబెట్టే దర్శకులు ఒక్కరూ కనిపించడం లేదు. తెలుగు సినిమాకు ఇప్పుడు జంధ్యాల చాలా అవసరం. అంటే -జంధ్యాల మళ్లీ పుట్టాలి.
-ఎస్ శ్రీనివాసరాజు, వనస్థలిపురం

అదీ విషయం
గుండమ్మ కథ సినిమా పూర్తయ్యాక ప్రివ్యూకు కెవి రెడ్డిని ఆహ్వానించారు. ఆయన చూసి పెద్ద స్టార్‌కాస్ట్, మంచి బేనర్ వుంది కనుక మూడు లేక నాలుగు వారాలు ఆడుతుందన్నారు. వంద రోజులు కాగానే ఎవరో రెడ్డికి ఈ విషయం చెప్పగానే, ఆ చిత్రంలో ఏముందని ప్రేక్షకులు చూస్తున్నారో.. ఆశ్చర్యంగానే వుంది. ఏదిఏమైనా ప్రేక్షకుల నాడి పట్టడం అర్థంకావడంలేదని సెలవిచ్చారు.
ఈమధ్య రీమేక్ చిత్రాలు చేస్తామని కొంతమంది మహా హీరోలు బయలుదేరారు. విజయ నాగిరెడ్డి దృష్టికి పాతికేళ్ల క్రితమే రీమేక్ ఆలోచన వచ్చింది. రామారావు పాత్రకు బాలకృష్ణ, నాగేశ్వరరావు పాత్రకు నాగార్జున, సావిత్రి పాత్రకు విజయశాంతి, జమున పాత్రకు రాధ, రమణారెడ్డి పాత్రకు రావుగోపాలరావు, హేమలత పాత్రకు వై విజయ, హరనాథ్ పాత్రకు చంద్రమోహన్, ఎల్ విజయలక్ష్మి పాత్రకు రజనిని పెట్టమన్నాం. ఇక గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అప్పటికే జీవించి ఉన్నారు కనుక, ఆమెనే సజెస్ట్ చేశాం. ఈ రీమేక్‌ను సినిమా స్కోప్ కలర్‌లో తీసి పాటలు, మాటలు, యధావిధిగా ఉంచమని సూచించాం. అయితే భారీ బడ్జెట్‌తో కూడుకున్నది కనుక ఆగిపోయిందా రీమేక్!

-ఎస్.శ్రీనివాసరావు, ఎమ్మిగనూరు

డియర్ ఫ్రెండ్స్.. ఈ క్విజ్ మీ కోసమే...
మీ సమాధానాలు కార్డుపైన గానీ, మరే విధంగానైనా గానీ
రాసి పంపించవచ్చు. ఎలాంటి కొట్టివేతలు,
తుడిపివేతలు లేకుండా జవాబులన్నీ స్పష్టంగా రాయాలి.
మా దగ్గరున్న కీ సొల్యూషన్‌తో అన్ని విధాలా సరిపోయే జవాబులు
రాసిన వారి పేర్లు ప్రచురిస్తాం.

1. ఈ స్టిల్ ఏ సినిమాలోది?
2. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ప్రభాస్, ఇలియానా నటించిన చిత్రం?
3. నాగార్జున నటించిన ‘ఆవిడా మా ఆవిడే’ సినిమాకు దర్శకుడు?
4. పవన్‌కళ్యాణ్ ‘ఖుషీ’ చిత్రానికి సంగీత దర్శకుడు?
5. రవితేజ ‘్భద్ర’ చిత్రంలో హీరోయిన్?
6. సునీల్ ‘కృష్ణాష్టమి’ సినిమాకు నిర్మాత?
7. ‘మనసెరిగినవాడు మా దేవుడు... శ్రీరాముడు’ పాట ఏ సినిమాలోది?
8. ‘మానవ జాతి మనుగడకే ప్రాణంపోసింది మగువ/ త్యాగంలో అనురాగంలో తరగని పెన్నిధి మగువ’ మాతృదేవతకు పాట రాసినది ఎవరు?
9. ‘చిన్నారి పైడిబొమ్మా... కన్నీరు ఎందుకమ్మా’ అమాయకురాలు సినిమాలోని ఈ పాట పాడిన గాయని ఎవరు?
10. ఫొటోలోని నటిని గుర్తించండి?

సమాధానాలు- 99

1. ఓకే బంగారం 2. ప్రియమైన నీకు
3. ఎస్ గోపాలరెడ్డి 4. ఎస్‌ఎస్ థమన్
5. జమున 6. ఆత్మగౌరవం
7. ఘంటసాల 8. చంద్రబోస్
9. కెకె సింథిల్‌కుమార్
10. సోనాలీ బింద్రే

సరైన సమాధానాలు రాసిన వారు

వివి జయలక్ష్మి, పాలకొల్లు
కె ప్రసన్నరాణి, ఆదిలాబాద్
జివి రామారావు, తుని
డి హరనాథ్, కొత్తకోట
ఎల్ సునీత, పెనుగొండ
జి జయరాజ్, ఆచంట
వై సుబ్రహ్మణ్యం, వరంగల్
కెవి లత, ఆదోని
ఎం వరప్రసాద్, ఒంగోలు
పివిఎస్‌పి రావు, అద్దంకి
ఎంవిబి రెడ్డి, కుతుకులూరు
పి విజయలక్ష్మి, రాజమండ్రి
సునీతా ప్రకాష్, బీజాపూర్
ఏఎస్ శర్మ, అనంతపురం
ఎన్ శివస్వామి, బొబ్బిలి

నిర్వహణ: కైపు ఆదిశేషారెడ్డి

ఫిలిం క్విజ్ 101

పూర్తి చేసిన క్విజ్‌ను పంపించాల్సిన మా చిరునామా: ఎడిటర్, వెనె్నల, ఆంధ్రభూమి దినపత్రిక 36, సరోజినీదేవి రోడ్, సికిందరాబాద్- 03