Others

డ్రెస్సుకో లెక్కుంది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెలబ్రిటీలు ఎలాంటి డ్రెస్సులేసినా -చెల్లిపోయే కాలమిది. కావాలని అందాలు కనిపించేలా డ్రెస్సులేస్తుంటే -్ఫటోలు తీసుకుని నెట్‌లో వైరల్ చేస్తున్నారు అభిమానులు. ఈ స్టయిల్ మరీ ముదిరిపాకన పడటంతో -హీరోయిన్ల డ్రెస్ సెన్స్‌కు మరీ లెక్కలేకుండా పోయింది. నడుమొంపు చూపాలంటే ఒక తరహా డ్రెస్. క్లీవేజ్ షోకు మరోరకం డ్రెస్. ఇలా అందాల ప్రదర్శనకు తగ్గట్టు లెక్కలేసుకుని మరీ పీలికల దుస్తులతో ప్రదర్శనకు వస్తున్నారు సెలబ్రిటీలు. స్క్రీన్‌మీద తప్ప, మామూలుగా బయటకు వచ్చినపుడు పద్ధతిగా కనిపించే కంగనారనౌత్ కూడా ఈమధ్య ఓ లెక్కలేని డ్రెస్ వేసుకెళ్లి అభాసుపాలైంది. అంతా మీదపడటంతో అక్కడినుండి ఉడాయించింది. ముందుభాగంగా స్వెట్టర్ మాదిరి కనిపించిన ఆ డ్రెస్, వెనక్కి తిరిగే సరికి బ్యాక్ కనిపించే డిజైన్డ్ డ్రెస్ వేయడంతో అభిమానులు అబ్బో అనుకుంటూ వెర్రెత్తి పరుగులు తీశారు. వారి ఆత్రం చూసి సిగ్గుతో కంగనా వెనక్కి తగ్గిందట. కంగన ఏం చేసినా దానికో లెక్కుంటుంది. ఈ డ్రస్ వెనుక ఏం లెక్కుందో? అందరికీ తెలియకపోయినా ఆమెకు మాత్రం తెలుసని బాలీవుడ్ మీడియా కథనాలు అల్లుతోంది. ఏ సినిమా ఛాన్స్‌కోసమో ఆ డ్రెస్ వేసిందో త్వరలో తెలుస్తుందేమో.