Others

దానిమ్మతో ఎవర్‌గ్రీన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కెంపుల్లా మెరిసిపోయే దానిమ్మ గింజల్లో పోషకాలు కోకొల్లలు. ఈ పండు వృద్ధాప్యాన్ని దరిచేరనీయదని ఓ పరిశోధనలో తేలింది.
కండరాల్లోని కణాలు బలహీనంగా కావడంవల్లే వయసు పైబడేలా కనిపించడానికి కారణం. దానిమ్మ గింజల్లోని అణువులు ఈ కణాలను శక్తివంతంగా చేస్తాయి. దీంతో శరీరంలో సత్తువ పెరిగి వార్థక్యం ఆలస్యంగా పలకరిస్తుంది.
శరీరంలోని కణాల్లో మైటోకాండ్రియా పెరిగిపోవడంవల్ల వయసు పైబడుతుంది. దానిమ్మ గింజలు తినడంవల్ల మైటోకాండ్రియా తగ్గుతుంది. తద్వారా కణాలు ఉత్తేజం అవుతాయి. ఈ విషయాన్ని ఎలుకలపై ప్రయోగించి శాస్తవ్రేత్తలు నిర్థారించారు.
దాదాపు రెండేళ్ళ వయసున్న ఎలుకకు దానిమ్మ గింజలు తినిపించారు. కొన్నాళ్ళకు ఆ ఎలుక గతంలోకంటే ఉత్సాహంగా కనిపించిందట. అదే వయసున్న మిగతా ఎలుకల పరుగుతో పోలిస్తే ఈ ఎలుక 42 శాతం వేగంగా పరిగెత్తడాన్ని శాస్తవ్రేత్తలు గుర్తించారు.
పేగుల్లో సూక్ష్మజీవులు దానిమ్మ గింజల్లోని పోషకాలను యూరోలిథిన్-ఎగా మారుస్తాయి. ఫలితంగా వయసు పునరుత్తేజితం అవుతుంది.
వంద గ్రాముల గింజల్లో..
కేలరీలు 83, కొవ్వు 1 శాతం, సోడియం 3 మిల్లీగ్రాములు, పొటాషియం 236 మి.గ్రా., కార్బోహైడ్రేట్స్ - 19 గ్రా., ప్రొటీన్ - 17 గ్రా. ఫైబర్ - 4 గ్రా., సుగర్ - 14 గ్రా., విటమిన్ సి 17 శాతం, విటమిన్ బి6 - 5 శాతం, మెగ్నీషిం 3 శాతం లభిస్తాయి.
మరిన్ని లాభాలు
దానిమ్మలోని విటమిన్ సి, పొటాషియం అలసటను తగ్గిస్తాయి.
వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.
దంత సమస్యలను కూడా దానిమ్మ దూరం చేస్తుంది.
దానిమ్మ రసం తీసుకోవడంవల్ల గుండె పని తీరు మెరుగుపడుతుంది. కేన్సర్ రిస్క్‌ను తగ్గిస్తుంది.
దానిమ్మ జ్యూస్‌తో కాలేయంలోని మలినాలు పోతాయి.
మరింత సౌందర్యాన్ని అందించడంతోపాటు వయసు పైబడటాన్ని తగ్గించి నవయవ్వనాన్ని కలిగిస్తుంది. ఇక ఆలస్యమెందుకు? ఇన్ని సత్ఫలితాలను అందిస్తున్న దానిమ్మను వెంటనే తీసుకుందాం పదండి..

- నీలిమ సుబ్బిశెట్టి