Others

మనసే మందిరం ఫ్లాష్‌బ్యాక్ @ 50

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన:
ఆచార్య ఆత్రేయ, గంగా
ఫొటోగ్రఫీ:
బాలు
ఎడిటింగ్:
ఎన్‌ఎం శంకర్
సంగీతం:
ఎంఎస్ విశ్వనాథం
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:
సివి శ్రీ్ధర్
నిర్మాత:
యర్రా అప్పారావు

ప్రముఖ తమిళ చిత్రాల దర్శకుడు, నిర్మాత, స్క్రీన్‌ప్లే రచయిత చిత్తమూరు విజయరాఘవులు శ్రీ్ధర్ (సివి శ్రీ్ధర్) తొలుత ‘రక్తపాశం’ నాటకం వ్రాసారు. ఆ నాటకాన్ని తమిళంలో ‘రక్తపాశం’, హిందీలో ‘్భయి భాయి’, తెలుగులో ‘శభాష్‌రాజా’ చిత్రాలుగా రూపొందించారు. శ్రీ్ధర్‌కు దర్శకునిగా తొలి చిత్రం కల్యాణపరసు (తమిళం). దీనే్న తరువాత పెళ్ళికానుక (తెలుగు), నజరానా (హిందీ)గానూ తీశారు. ఒకే కథ 3 భాషల్లో విజయం సాధించింది. గోపు వినె్సంటు, సుందరంలతో కలిసి చిత్రాలయ నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘నెంజిల్ ఒరు ఆలయం’, ‘కాదలిక్కనేర మిల్లై’, ‘వెన్నిరాడై’ వంటి చిత్రాలు నిర్మించారు. పలు తమిళ చిత్రాలకు డైలాగ్ రైటర్‌గా, 60కిపైగా తమిళ, హిందీ, తెలుగు చిత్రాలకు సారథ్యం వహించారు.
1962లో వీరు తమిళంలో నిర్మించిన ‘నెంజిల్ ఒరు ఆలయం’ చిత్రానే్న తరువాత హిందీలో ‘దిల్‌పల్ మందిర్’, తెలుగులో ‘మనసే మందిరం’గా రూపొందించారు. ఈ చిత్రం అక్టోబర్ 6, 1966న విడుదలైంది.
‘గాంధారి గర్వభంగం’ (1959) డబ్బింగ్ చిత్రం రూపొందించిన యర్రా అప్పారావు తమ కృష్ణసాయి బ్యానర్‌పై చిత్రాన్ని నిర్మించారు. వీరు ఆ తరువాత అనువాద చిత్రాలుగా ‘దోపిడి దొంగలు’, ‘పెంచిన ప్రేమ’ నిర్మిస్తే, వీరి తమ్ముడు యర్రా కన్నయ్య కూడా అనువాద చిత్ర నిర్మాతగా రాణించారు.
***
మానవ సేవే మాధవసేవగా భావిస్తూ ఓ ఆస్పత్రిలో కాన్సర్ స్పెషలిస్ట్‌గా విధులు నిర్వర్తిస్తుంటాడు డాక్టర్ రఘు (అక్కినేని నాగేశ్వర రావు).
గతంలో రఘు, సీత (సావిత్రి) ప్రేమించుకుంటారు. కాని సీత తండ్రికి సంభవించిన ఓ విపత్తు కారణంగా ఆమె రాము (జగ్గయ్య)ను పెళ్ళి చేసుకోవాల్సి వస్తుంది. రఘు ఇక పెళ్ళిమాట తలపెట్టక తన గుండెను గుడిగా చేసుకుని ఆమె ఆరాధనలో, రోగుల సేవలో కాలం గడుపుతుంటాడు. ఒకరోజు -క్యాన్సర్ వ్యాధి ముదిరిన రామును రఘు ఆస్పత్రికి తీసుకొస్తుంది సీత. తొలుత ప్రేయసి సీతను చూసి కొంత కలవరపడిన రఘు, తరువాత రామును ఏ పరిస్థితుల్లో సీత వివాహమాడాల్సి వచ్చిందో తెలుసుకుంటాడు. ఆమె భర్తను కాపాడటానికి శాయశక్తులా కృషిచేసి విజయం సాధిస్తాడు. కానీ ఆపరేషన్ కోసం అవిశ్రాంతంగా శ్రమపడటంతో, హార్ట్ ఎటాక్ వచ్చి రఘు మరణిస్తాడు. సీత, రాములు అతని ఆస్పత్రిని వృద్ధిచేసి, రఘు శిలా విగ్రహం నెలకొల్పి నివాళులు అర్పించటంతో చిత్రం ముగుస్తుంది.
ఈ చిత్రంలో హాస్పిటల్‌లో నర్సుగా ఝాన్సీ, అసిస్టెంటు జోగులుగా చలం, వైద్యం కోసం వచ్చిన వారిలో నాగభూషణం భార్యగా శారద, కాసులుగా గిరిజ, రేలంగి, చిన్న పిల్ల ఉమ, ఆమె తల్లిగా నిర్మల, రఘు తల్లిగా శాంతకుమారి, మరో వ్యాధిగ్రస్తునిగా గుమ్మడి కనిపిస్తారు.
ఈ చిత్రంలో డాక్టరుగా అక్కినేని చిరునవ్వుతో, హుందాతనంతో, సేవా ధర్మాన్ని పాటించే వ్యక్తిగా అద్భుతంగా నటించారు. తొలుత ప్రేయసి పట్ల అనురాగం, అభిమానం.. ఆమె దూరమయ్యాక ఆమెనే తన మనస్సులో దేవతగా ఆరాధిస్తూ పెళ్లి తిరస్కరించడం, తిరిగి తన ప్రేయసి భర్తను ఆరోగ్యవంతునిగా చేయడంలో దీక్ష.. తదితర ఉన్నత భావాలను నటనలో ప్రదర్శించి మెప్పించారు. సీతగా సావిత్రి తొలుత రఘుతో ప్రేయసిగా చిలిపితనం, ఆపైన డాక్టరుగా అతన్ని కలిశాక స్థాయిమించని అభిమానం, భర్త రాముపట్ల ప్రేమానురాగం, అతని ఆరోగ్యం కోసం ఆరాటం, బేబి ఉమపట్ల వాత్సల్యం, తోటి రోగుల పట్ల సానుభూతి.. ఇలా పలు సన్నివేశాల్లో గంభీరమైన నటన ప్రదర్శించారు. ఇక రాముగా జగ్గయ్య భయంకర వ్యాధిగ్రస్తుడైనా ఎంతో ఈజీగా దాన్ని స్వీకరించడం, భార్యకు ధైర్యం చెప్పడం, డాక్టర్‌తో చర్చించడం, కొన్నిసార్లు బాధతో విలవిలలాడటం, సీత రఘుల గురించి తెలుసుకుని కొంత ఆందోళన, డాక్టర్‌పట్ల నమ్మకం, భార్యపట్ల అనురాగం చూపే సన్నివేశాల్లో ఆకట్టుకునే నటనతో మెప్పించారు. బరువైన సన్నివేశాలకు చలం, రేలంగి, గిరిజల హాస్య సన్నివేశాలను తగిన మాటలతో జోడించి ఆత్రేయ రచన హృద్యంగా సాగింది. ‘జీవితాన్ని తేలికగా తీసుకోవాలి’, ‘జరిగేది జరగక మానదు’ లాంటి సంభాషణలతో సన్నివేశాలను రక్తికట్టించారు.
సివి శ్రీ్ధర్ చిత్ర సన్నివేశాలను బిగువుతో ఆసక్తిదాయకంగా మలిచారు. సీత ఉన్న ఫొటోను రఘు రోజూ చూడటం, ఒకరోజు ఇలస్ట్రేటెడ్ వీక్లీలో వున్న ఫొటోను రాము తీసుకెళ్లడం, దాన్ని సీత గమనించడం, కిందపడిన ఫొటోని రఘు వచ్చి తీసుకెళ్లటం, మరోసారి రఘువద్దనున్న తన ఫొటో ఇచ్చేయాలంటూ సీత అడిగే సన్నివేశంలో జగ్గయ్య వెనుకనుంచి వినడం, నా మనస్సులో నా భర్తకు తప్ప ఎవరికీ స్థానం లేదని సీత చెప్పడంతో రఘు ఆ ఫొటో చించేయటం.. లాంటి సన్నివేశాలు గుండెను బరువెక్కిస్తాయి. సీతను రఘు తన ప్రేమ గురించి అడగడం, సీత తండ్రి ఇబ్బంది, రాముని వివాహం చేసుకున్న కారణం చెప్పడం, అది రాము వినడం, తర్వాత రాము సీతల రియాక్షన్ అద్దంలో చూపుతూ చిత్రీకరించే గీతం -తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ సన్నివేశానుగుణంగా భావయుక్తంగా సాగుతుంది. -మనసునకెన్నో మార్గాలు/ కనులకు ఎన్నో స్వప్నాలు, -ప్రేమ పవిత్రం పెళ్లి పవిత్రం గీతాలు ఆత్రేయ మార్క్‌తో (గానం పిబి శ్రీనివాస్) సాగుతాయి. బేబి ఉమ వ్యాధి తగ్గితే తన భర్త జీవిస్తాడని సీత నమ్మకం, కానీ అది జరగకపోవడంతో భర్తను మరో ఆస్పత్రికి తీసుకెళ్లాలని సీత వాదన, రాముకు గుండెనొప్పి వచ్చినపుడు తాను మరణించాక సీతను వివాహం చేసుకోమని రఘును కోరడం సన్నివేశాలు చిత్రానికి ప్రాణంగా నిలిచాయి. సితార వాయించమని రాము కోరడంతో సీత పాడే గీతం -అన్నది నీవేనా నా స్వామి (రచన: కార్తీక్, గానం: పి సుశీల), పెళ్లి అలంకరణలో సీతను రమ్మని కోరిన రాము ఆమెకు పెళ్లినాటి ముచ్చట్లు వినిపించడం, అతని గుండెలపై తలవాల్చి సీత వినడం, ఇంతలో రఘు వచ్చి కేస్ షీటు, ఆమెను చూసి వెళ్లడం హృదయాలను కదిలించేలా భావయుక్తంగా సన్నివేశాలను రూపొందించారు. ఈ చిత్రంలోని గీతాలన్నీ ఆత్రేయ రాయగా, కార్తీక్ ఒక్క గీతం -‘అన్నది నీవేనా’ వ్రాశారు. సావిత్రి, బేబి ఉమ తదితరులపై చిత్రీకరించిన ఆనందగీతం -అల్లారు ముద్దుగదే అపరంజి ముద్దగదే (పి సుశీల). ఉమ మరణించగా విషాదంలో సావిత్రి, మేడపైనుంచి అక్కినేని కిందకి దిగడం, రూములో జగ్గయ్య, గుమ్మడిలను చూపుతూ చిత్రీకరించిన గీతం ‘అల్లారుముద్దుగదే’ (పి సుశీల). సావిత్రి, జగ్గయ్యలపై చిత్రీకరించిన గీతం -ఏమనుకుని రమ్మన్నావో (పెళ్లి వేడుకలు చూపుతూ తొలి రేయిని గుర్తు చేస్తూ సాగుతుంది). చిత్రం చివర వచ్చే గీతం -రూపులేని మందిరం/ మాపులేని నందనం/ ఒకరినే ప్రేమించి పదుగురికై జీవించి/ అసువులు బాసిన అమర జీవి నందనం (ఘంటసాల, ఎపి కోమల, కోరస్). ఈ చిత్రంలోని మరో మరపురాని గీతం.. రఘుపై నమ్మకంతో ఈ హాస్పటల్‌కు వచ్చామని సీత చెప్పగా రఘు ఆమె ఫొటో చూస్తూ పాడే గీతం -చల్లగ ఉండాలి/ నీ మది నెమ్మది పొందాలి’ (ఘంటసాల). ఎంఎస్ విశ్వనాథం స్వరాలలో ఈ చిత్ర గీతాలు అలరించేలా రూపొందాయి. పరిస్థితుల కారణంగా విడిపోయిన ఉదాత్త భావాలుగల ప్రేమికుల భావ సంఘర్షణకు, భార్యభర్తల అనుబంధానికి, స్నేహ బంధానికి ఉన్నత ఆదర్శాలను కలబోసుకుంటూ సాగిన ఈ చిత్రం తమిళంలో నేషనల్ ఫిలిమ్ అవార్డు, హిందీలో బెస్ట్ ఫిలిమ్, బెస్ట్ డైరెక్టర్ అవార్డులు పొందింది. మలయాళంలో ‘హృదయం ఒరుక్షేత్రం’గా, కన్నడంలో ‘కుంకుమ రక్ష’గా రూపొందింది. మనసే మందిరం అంతగా ఆర్థిక విజయం సాధించకున్నా, ప్రేమ, త్యాగం, మానవత్వపు విలువలకు అద్దంపట్టిన చిత్రంగా ప్రేక్షకాదరణ పొందింది. చిత్ర గీతాలు నేటికీ అలరిస్తాయి.

-సివిఆర్ మాణిక్యేశ్వరి