Others

మెరుపుల మనస్వి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

2010లో మిస్ ఇండియా కిరీటం గెల్చుకున్న మనస్వి మంగాయ్ గుర్తుందా? అందాల రాణి కిరీటం గెలుచుకోగానే అమ్మడు సినిమా ప్రపంచాన్ని ఓ ఊపు ఊపేయాలనుకుంది. అందులో భాగంగా అజయ్ దేవ్‌గన్‌తో యాక్షన్ జాక్సన్ సినిమాలో సెకెండ్ హీరోయిన్‌గా నటించింది. మొదటి ఛాన్సు కాబట్టి బికినీలు వేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా, సినిమాలో దమ్ము లేకపోవడంతో మనస్వి శ్రమంతా వృధా అయిపోయింది. అప్పుడు మాయమైన మంగాయ్ మళ్లీ ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌లో మెరిసింది. ఓ స్వచ్ఛంద సంస్థ మ్యూజికల్ నైట్‌కు సంబంధించిన కర్టెన్‌రైజర్‌లో మనస్వి నాభి సొగసును ప్రదర్శించి మురిపించిందట. అందులోనూ అక్కినేని అఖిల్ పక్కన చేరి వచ్చేపోయేవారికి హాయ్‌లు చెప్పిందట. ఎప్పుడో చూసి మర్చిపోయన వారంతా మళ్లీ మళ్లీ ఆమెను చూసి ఎవరీ సుందరాంగి? అని ఆరా తీస్తే, అందరూ 2010కి వెళ్లాల్సి వచ్చింది. చూద్దాం, తెలుగులోనైనా ప్రాజెక్టులు వర్కవుట్ కాకపోతాయా? అని మనస్వి పాపం ఆశల ప్రయత్నాలు మొదలెట్టినట్టుంది. ఎంత ప్రయత్నిస్తే ఏం లాభం, లక్కుకీ ఓ లెక్కుండాలిగా అంటున్నారు సినీజనం.