Others

నాకు నచ్చిన చిత్రం -- శ్రీకృష్ణపాండవీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణపాండవీయం ఒక కళాఖండం. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందించిన శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రలు అద్భుతం. లక్క ఇల్లు తగులబెట్టే సన్నివేశానికి ముందు భీమ పాత్రదారి ఉదయ్‌కుమార్‌ను ఉద్దేశించి ‘మత్తు వదలరా, నిద్దుర మత్తు వదలరా’ అంటూ కృష్ణుడు పాడే పాట మొద్దునిదుర పోయేవాళ్ళకు చక్కటి గుణపాఠం. ‘చాంగురే బంగారు రాజా/ చాంగు చాంగురే బంగారురాజా’ అంటూ జిక్కీ పాడిన పాట ప్రజల మన్ననలు అందుకుంది. ఐదుగురు మహావీరులు ఒకే జన్మ నక్షత్రంలో పుట్టారని, వారిలో ముందుగా ఎవరు ఎవరిని సంహరిస్తారో వారి చేతిలో మిగతా వీరుల మరణం రాసిపెట్టి ఉందన్న విషయంతో అల్లుకున్న ఇతివృత్తమే ఈ చిత్రం. అలాగే శకుని మాయ పాచికలు ఏవిధంగా వచ్చాయి, కౌరవుల వినాశనం కోరిన శకుని వారి ప్రక్కనేవుండి రెచ్చగొడుతూ... పాండవుల శ్రేయోభిలాషి ఎలా అయ్యాడు అన్న ఎడిసోడ్స్ ఈ చిత్రంలోనే చూస్తాం. ముఖ్యంగా ఏ సినిమాలోనైనా కామెడీ సన్నివేశాలు, ఆ సన్నివేశాలను పోషించే కామెడీ యాక్టర్లు లేకుండా ఉండరు. కాని ఈ చిత్రంలో అలాంటి సన్నివేశాలు, నటులు కనిపించరు. బకాసురు, జరాసంధులను వధించే సన్నివేశాలను మరపురాని విధంగా చూపించిన ఘనత ఒక్క ఎన్టీఆర్‌కే దక్కుతుంది. అలాగే శ్రీకృష్ణ రుక్మిణిల వివాహం, శ్రీకృష్ణుని విశ్వరూపం- అసలు ఆ చిత్రంలో ప్రతి సన్నివేశం ఒక కళాఖండం. మయసభ, మయసభలో దుర్యోధనుని నటన అత్యద్భుతం. ఈ రోజుకీ ప్రేక్షకుల మన్ననలు అందుకుంటున్న సినిమా శ్రీకృష్ణపాండవీయం. సముద్రాల రాఘవాచార్య రచన, టివి రాజు సంగీతం, ఎన్టీఆర్ దర్శకత్వంతో రూపొందిన అద్భుత కళాఖండం -శ్రీకృష్ణపాండవీయం.

-ఎం రాధాకృష్ణమూర్తి, గన్నవరం