Others

హైరోడ్డుకెక్కిన ‘కంగారు’పెట్ట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్కాట్లండ్‌లో డూండీ నగరం మార్కెట్ దరి హై రోడ్డుమీద ఓ కంగారు కోడిపెట్ట పోలీసులను ముప్పుతిప్పలు పెట్టింది.
ఎక్కుపెట్టి విడిచిన బాణంలాగా దూసుకుపోతాయి కుక్కలూ, కోళ్ళూ కూడా మన రోడ్లకడ్డంగా. అలాగే పిల్లలు కూడా అట్నుంచి యిటు- రోడ్డు ఏదో తమ యింట్లో వరండా అయినట్లు చతశ్చక్ర శకటాల చోదకుల దాకా ఎందుకు? ద్విచక్రవాహనదారులకైనా రుూ ఆకస్మిక జంతు దాడులు హడలుగొడతాయి.
అంతేకాదు, యునైటెడ్ కింగ్‌డమ్‌లో కూడా హైరోడ్డుమీదకు ఓ ‘చికెన్’ చకచకా రోడ్డు క్రాస్ చేసెయ్యడానికి ట్రాఫిక్ సిగ్నల్స్‌ని ఖాతర్ చెయ్యకుండా దాటేస్తూ- పోయిన శుక్రవారం ఉదయం దర్శనం ఇచ్చింది. అది వాళ్లకి కొత్తగాని మన వాహనచోదకులకు అనుభవమే- ఆ కోడి లేదా కుక్కపిల్ల తన బండీ క్రింద పడ్డదో- బిలబిలా వీధిలోని జనాలంతా దాడి చేస్తారు. అదో గలాటా.. జేబులోని పైసలన్నీ గల్లంతయితేగానీ సమసిపోదు-
కానీ, డుండీ నగరంలోని జనసమ్మర్దమయిన ఆ రాదారి వాసులూ- ‘‘పోలీస్.. పోలీస్..’’ అంటూ ఆర్తనాదాలు చేశారు. కోడిపెట్ట, ‘డోంట్‌కేర్’ అన్నట్లు అటూ యిటూ పరుగులు- ‘కొక్కో కొక్కో’... మంటూ! ముగ్గురు పోలీస్ కానిస్టేబుల్స్ దాని వెంట పడ్డారు. ఈలోగా ట్వీట్స్, ఫేస్‌బుక్ పోస్టింగులు దుమ్ములేపేశాయి!మొత్తానికి కంగారు కోడిపెట్టని- అంతర్జాతీయ దొంగను వెంటాడి పట్టుకున్నంత ఆనందంగా పట్టుకొని- సంకలో ఒడిసిపట్టుకొని- ఠాణాకి వెళ్లి దాని సబ్‌ఇన్స్‌పెక్టర్‌కి అప్పజెప్పారు. ఆయన దాన్ని జాగ్రత్తగా పట్టుకొని కేసు రాసుకున్నాడు. ‘‘నీదే రుూ పెట్ట బాధ్యత!’ అన్నారు అధికారులు. సమాచారం కోసం తంటాలు మొదలెట్టారు. ‘‘సొంతదారులెవరైనా తగిన సాక్ష్యాధారాలతో వచ్చి రుూ కోడిపెట్టని తీసుకుపోండహొ’’ అంటూ అనౌన్సుమెంట్లు గుప్పించేశారు. ఓ నాలుగు వందల షిల్లింగులు పెట్టి దీనికి ఓ గంప కొనుక్కొచ్చారు. మేత పట్టుకొచ్చారు. ఎందుకు రుూ కోడిపెట్ట ‘డుండీ’ రోడ్డుని క్రాస్ చేస్తోంది? యజమానికే తెలియాలి. గానీ కోడివాళ్ళు రారు. వస్తే కేసెడతారు కదా? కోడి మీదే కేసు పెడతారు? దానికి మేత పెట్టలేక సణుక్కుంటున్నారు పాపం- స్కాట్లాండు పోలీసు కానిస్టేబుల్స్!