Others

వ్యర్థానికి సరికొత్త అర్థం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యర్థం నుంచి సరికొత్త అర్థం పుడుతుంది.వాడేసిన కాఫీ పొడితో అందమైన కాఫీ కప్పు, సాసర్లను తయారుచేసి పర్యావరణానికి మరింత సహకరించవచ్చంటున్నారు జర్మనీ ఉత్పత్తిదారులు. తమ ఉత్పత్తులు పగిలిపోకుండా దృఢంగా ఉండటంతోపాటు కొద్దిపాటి తాజా కాఫీ పరిమళంతోపాటు మంచి అనుభవాలను అందిస్తాయంటున్నారు. వాడిన కాఫీ పొడిని సౌందర్య సాధనంగానూ, వస్తువులను శుభ్రపరిచేందుకు మొక్కల్లో ఎరువుగా వేసేందుకు వినియోగించడం తెలుసు కానీ జర్మన్ కంపెనీ, కాఫీఫామ్, కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
ప్రతిరోజూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలమంది అలవాటుగా తాగే కాఫీ తయారీ అనంతరం పొడి వృధాగా పోతోందన్న జర్మనీ డిజైనర్ జూలియన్ లేచ్నర్ ఆలోచనలే కప్పు, సాసర్ల రూపం దాల్చాయి. ఇటలీ నగరం బొల్జానా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సమయంలో లేచ్చర్‌కు ఈ కొత్త ఆలోచన వచ్చింది. కాఫీ పొడితో ఘనపదార్థాలను ఎలా తయారుచేయవచ్చు అన్న దిశగా పర్యావరణ అనుకూలమైన కప్పు సాసర్ల తయారీ దిశగా కార్యరూపం దాల్చింది. అయితే ఈ ప్రయోగం ఫలించడానికి అతడికి కొన్ని సంవత్సరాలు పట్టింది. ప్రస్తుతం చిన్న చిన్న ఫ్యాక్టరీల్లో కప్పుల తయారీకోసం ప్రత్యేకంగా వికలాంగులకు అవకాశం ఇస్తున్నామని త్వరలో కాఫీ ఫామ్ పెద్ద ఎత్తున ఉత్పత్తులు ప్రారంభించి ట్రావెల్ మగ్గులను కూడా ఉత్పత్తి చేసే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపాడు.

- తరిగొప్పుల విఎల్లెన్ మూర్తి