Others

ఆకర్షణ ప్రేమ కానే కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేటి యువతలో ప్రేమకి ఆకర్షణకి తేడా తెలియకుండా పోతోంది. యుక్తవయసులో కలిగే ఆకర్షణే ప్రేమ అని భ్రమిస్తున్నారు. చదువుకోవాల్సిన వయసులో సినిమా ప్రభావంతో పరిపక్వత లేకుండానే జీవితంలో తప్పటుడుగులు వేస్తూ తరువాత తీరిగ్గా విచారిస్తున్నారు. అసలు బాల్యం నుంచే చదువుకోవాల్సిన వయసులో ప్రేమగురించి ఆలోచనలు, ఆకర్షణలు ఎలా కలిగినాయి? దీన్ని పెంచి పోషిస్తున్నది ఎవరు అని ఒకసారి మననం చేసుకుంటే- అందివచ్చిన టెక్నాలజీ, స్వేచ్ఛ, తెలుసుకోవాలి అన్న ఉత్సాహం కూడా కొత్తదార్లను వెతుక్కోవడానికి పురికొల్పుతుంది. ఈ రోజుల్లో ఆరవ తరగతి నుంచి పదో తరగతి లోపే ప్రేమ వ్యవహారాలకి బీజం పడుతుంది. ఇక పది దాటాక ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ చదువులలో ప్రేమ వ్యవహారాలకు అంతే ఉండదు. ఇదంతా పిల్లలకి స్వేచ్ఛని ఇవ్వడం మూలానే ఏర్పడుతున్నాయా? అదికాక ప్రేమని అంగీకరించకపోతే చంపడాలు, చావడాలు. సరైన రీతిలో నడవకపోతే దారి తప్పి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడితే ఎవరు కారణం?
ఆకర్షణ అనేది మనసును పట్టి లాగి వుంచే ఒక భావం. యితే ఇది భౌతికంగా ఇనుము అయస్కాంతాల మధ్య చూడవచ్చు. భూమ్యాకర్షణ అనేది కూడా భౌతికమే. అసలు ఈ సృష్టి సమస్తము ఆకర్షణా శక్తితోనే నడుస్తుంది. చంపభూతాలను పట్టి ఉంచిన జీవజాలం అంతటికి ఆధారభూతం అన్నది భూమ్యాకర్షణ అనే మహత్తరమైన శక్తి. ఈ భూమి సూర్యాకర్షణకి లోనై కక్ష్యలో క్రమపద్ధతిలో తిరుగుతుంది. అలాగే సూర్యుడి ఆకర్షణకు లోనై గ్రహాలు తిరుగుతుంటాయి. అంతరిక్షంలో చరచరాలన్నీ ఆకర్షణకు లోనై సంచరించేవే.
మొదటిదశలో ఆకర్షణ, ప్రతి మానవ ప్రణయ జీవితంలోనూ ఒక ప్రత్యేకమైన అనుభూతి! ఆ అనుభూతి ఒక నూతన తేజాన్ని ఇస్తూంది జీవితానికి. ఆమె అతనిలో అంతులేని ఆకర్షణ చూస్తూంది. అతడు ఆమెలో వుండే అన్ని గుణాలవైపూ ఆకర్షించబడతాడు. ఇద్దరూ ప్రపంచాన్ని ఒక కొత్త కోణంలో చూస్తారు.
ఆకర్షణకి ప్రేమకి కొన్ని తేడాలుంటాయి. వాటిని గుర్తించాలి. ఆకర్షణలో ఖచ్చితత్వం వస్తుంది. ఎలాగంటే ఎన్ని రోజులు గడిచినా తొలి రోజు కలిగిన ఆకర్షణ అలాగే కొనసాగగల్గితే అలాంటివారిలో ప్రేమభావం ప్రవేశించిందన్నమాటే. అలాకాక కొన్నాళ్ల తర్వాత వారిని చూచినపుడు కల్గినంత వ్యామోహం వాళ్లు ఎదురుగా లేనపుడు కలగకపోతే అది ఖచ్చితంగా ప్రేమ కాదు.
టీనేజ్‌లో అమ్మాయిలకు అబ్బాయిలపట్ల, అబ్బాయిలకు అమ్మాయిలపట్ల ఆకర్షణ ఉండటం సైన్స్. ఆకర్షణ కల్గినపుడు ఒకరినొకరు కొన్నిసార్లు గమనిస్తూ ఉంటారు. ఇలా గమనించడానే్న తమచుట్టూ వున్నవారు గమనించి ‘ప్రేమ’అని ట్యాగ్ తగిలిస్తారు. అందరూ అదేవిధంగా మాట్లాడటంతో ఆకర్షణలోవున్నవారు దానే్న ప్రేమ అనే భావనను ఇష్టపడతారు. నిజానికి ప్రేమ, ఆకర్షణ రెండూ వేర్వేరు భావనలు. ఆకర్షణ అనే భావన తాత్కాలికమే. ఈ భావన వలన పొసెసివ్‌నెస్ పెరుగుతుంది. అదే ప్రేమ అనే భావన మనసును అర్థం చేసుకుంటుంది.. ప్రశాంతతను చేకూరుస్తుంది.
ఆకర్షణ, ప్రేమ అనే సహజ భావనలపట్ల మన సమాజంలో కూడా అయోమయంగా అధికంగా వుంది. ఈ అయోయమంవలన జీవితాంతం సమస్యల సుడిగుండంలో చిక్కుకుపోతున్నారు. ఏవిధమైన స్పష్టత లేకుండా కలిగి వుండే ఒక భావోద్వేగాన్ని ఇంగ్లీష్‌లో ఇన్‌ఫాక్చ్యుయేషన్ అంటారు.
ప్రేమ వేరు, ఆకర్షణవేరు. ఆకర్షణ అనేది కేవలం కొంతకాలం మాత్రమే వుంటుంది. ప్రేమ అనేది ఎప్పుడూ ఉంటుంది. నిజమైన ప్రేమలో అహంభావం, నేను అన్న స్వార్థం ఉండవు. ప్రేమను పంచటంలో వుండే ఆనందం వేరు, ప్రేమను స్వీకరించడంలో వుండే ఆనందం వేరు. మనం కావాలి అనుకున్నవాళ్ళు ఎప్పుడూ మనతోనే ఉంటారు. బంధం అనుబంధంగా మారి శాశ్వతంగా నిలుపుకోవాలనుకుంటే నేను అన్న అహంభావం వీడాలి. మన అనుకుని ఉండాలి, ఇద్దరి వ్యక్తులు కలిసి ఉండాలి అనుకున్నపుడు వారియొక్క శక్తి ఇంకా పెరగాలి. ఒకరిని ఒకరు ఉత్సాహపరచుకుని ముందరకు వెళ్లినపుడే ఆ బంధం శాశ్వతంగా వుంటుంది.

- పుష్యమీ సాగర్